Daaku Maharaaj OTT: నందమూరి నటసింహం బాలయ్య కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. గత కొన్నేళ్లుగా వరుసగా హిట్ మూవీలను తన అకౌంట్ లో వేసుకుంటున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్ అనే భారీ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా దున్నెస్తుంది.. జనవరి 12 న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ఇక వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి ఇప్పుడు ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ మూవీ ఓటీటీ డీటెయిల్స్ ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
మాస్ డైరెక్టర్ బాబీ, గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్.. ఈ మూవీ సక్సెస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. ఈ హైయాక్షన్ వోల్టేజీ మూవీకి సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చింది. డాకు మహారాజ్ మూవీ ఓటీటీ హక్కులను ఎవరు సొంతం చేసుకున్నారో? ఎప్పుడు స్ట్రీమింగ్ అనేది ఒకసారి చూసేద్దాం.. డాకు మహారాజ్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే ఎన్ని కోట్లకు ఓటీటీ డీల్ కుదిరింది. అయితే అధికారిక ప్రకటన రాలేదు. కానీ, డాకు మహారాజ్’ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులను దాదాపు రూ. 50 కోట్లకు నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఓటీటీ నిబంధనల ప్రకారం థియేటర్‌లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి సినిమా రిలీజ్ అవ్వాలి . దీనిని బట్టి డాకు మహారాజ్ ఫిబ్రవరి రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 10 తరువాత స్ట్రీమింగ్ అవుతుందని టాక్., బాలయ్య హీరోగా వచ్చిన ఈ మాస్ యాక్షన్ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది.. మాస్ ఎంటర్టైనర్ మూవీని సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో బాలయ్య కు ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ ప్రత్యేక పాత్రల్లో నటించారు.. ఈ మూవీ ఇప్పటివరకు 150 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇంకా బాక్సాఫీస్ వద్ద జోరు తగ్గలేదు. 200 కోట్లకు పైగా టార్గెట్ చేసింది. మరి చివరకు ఎలాంటి కలెక్షన్స్ ను అందుకుంటుందో చూడాలి..
ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే.. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబో లో నాల్గొవ మూవీ రాబోతుంది. అఖండ 2 మూవీ పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.. షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదిలోనే మూవీని థియేటర్లలోకి రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ అంచనాలతో రాబోతున్న ఆ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..