Nindu Noorella Saavasam Serial Today Episode : ఆరు, యముడిని కలవడానికి గంట మోగిస్తుంది. యముడు కోపంగా రావడంతో ఆరు భయపడుతుంది. దగ్గరకు వెళ్లి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ కానీ తప్పక అలా చేయాల్సి వచ్చింది. వెంటనే నేను కిందకు వెళ్లాలి అని చెప్తుంది ఆరు. అయితే యముడు కోపంగా సూర్యాస్తమయం ముగిసిన పిమ్మట ఇచ్చట ఏ కార్యములు చేయమని.. అన్ని ద్వారములు మూసివేయబడతవని ఈ బాలికకు చెప్పలేదా..? అని అడుగుతాడు. దీంతో గుప్త చెప్పాము ప్రభు.. కానీ మా మాట వినడం లేదు అంటాడు. దీంతో యముడు కోపంగా విచిత్ర గుప్త ఈ బాలికను ఆమె స్థావరం దగ్గర విడిచిపెట్టుము అంటాడు. సరేనని గుప్త తీసుకెళ్తాడు. ఆరు వెళ్లిపోయాక ఆ బాలికకు తన మరణం విషయంలో నిజం తెలిస్తే ముల్లోకాలు తిరిగైనా మనల్ని ఇబ్బంది పెడుతుంది. అని చర్చించుకుంటారు యముడు. చిత్రగుప్తుడు.
రణవీర్, అమర్ ఇంటికి వస్తాడు. రణవీర్‌ను చూసి అంజు పరుగెత్తుకెళ్తుంది. మిస్సమ్మ వచ్చి అంజు ఆపి ఎందుకు అలా పరుగెడుతున్నావు అని అడుగుతుంది. రణవీర్ అంకుల్ వచ్చాడు అందుకే వెళ్తున్నాను అని వెళ్లిపోతుంది అంజు. దీంతో మిస్సమ్మ.. నిన్న మనోహరి.. రణవీర్ వచ్చాడని చెప్పింది. ఎందుకు వచ్చాడని అడిగితే ఏం చెప్పకుండా కంగారు పడింది. ఇప్పుడు రణవీర్ వచ్చాడు అని మనసులో అనుకుంటుంది. కిందకు వెళ్లి రణవీర్‌ను పలకరిస్తుంది. రణవీర్ మిస్సమ్మను పలకరిస్తాడు. అప్పుడే వచ్చిన మనోహరిని పలకరించడు. దీంతో నిర్మల అదేంటి మనోహరిని పలకరించలేదు అని అడుగుతుంది. మనోహరి గారిని ముందే కలిశానని చెప్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ముందే కలవడం ఏంటి..? అని నిర్మల అడుగుతుంది. ఏదో సర్ది చెప్పి అంజలిని షాపింగ్ కు తీసుకెళ్తానని అడుగుతాడు. అంజలిని కలిశాకే నా కూతురు లేదన్న బాధ నాకు తగ్గింది. అందుకే ఒక్క రెండు గంటలు అంజలిని నాతో తీసుకెళ్తాను అంటాడు. ఆ విషయంలో అంత మొహమాటం ఎందుకు రెండు గంటలే కదా తీసుకెళ్లండి అంటుంది మనోహరి. దీంతో శివరాం కోపంగా నువ్వు తీసుకెళ్లండి అని ఎందుకు చెప్తున్నావు మనోహరి పిల్లల విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే అది కేవలం మిస్సమ్మ, అమర్ కే హక్కు ఉంది అంటాడు. మనోహరి షాక్ అవుతుంది. మిస్సమ్మను రణవీర్ అడిగితే ఆయన లేకుండా బయటకు పంపించలేను అంటుంది మిస్సమ్మ.
మరోవైపు ఆరు బాధగా కూర్చుని ఎమోషనల్ అవుతుంటే.. గుప్త వస్తాడు. నా పిల్లలు ప్రమాదంలో ఉన్నారు. నాకేమైనా సాయం చేయండి అని అడుగుతుంది. దీంతో యముడి దగ్గరకు వెళ్లి నీ పాప చిట్టాల లెక్క చూసి శిక్ష వేయండి అని అడుగు అప్పుడు ఏం జరుగునో నువ్వే చూస్తావు అంటాడు గుప్త. డౌటుగానే ఆరు వెళ్తుంది. అప్పుడే యముడు పాపులను శిక్షించడానికి కూర్చోగానే ఆరు వెళ్లి ముందు నన్ను శిక్షించండి.. నేను ఎక్కువ పాపాలు చేయలేదని మీరే చెప్పారు. కాబట్టి నా లెక్క తీయండి అని అడుగుతుంది. దీంతో అటుల తీయుటకు కుదరదు అంటాడు చిత్రగుప్తుడు. ఎందుకు ఇప్పుడే తీయండి.. సభలో ఉన్నవాళ్లందరూ చూస్తున్నారా..? నా లెక్క అడిగితే ఆయన ఎందుకో కంగారు పడుతున్నారు అంటూ అరుస్తుంది ఆరు. దీంతో యముడు కోపంగా ఆరును తిట్టగానే.. అయితే నాకు న్యాయం జరగాలంటే పంచాయతీ పెట్టాల్సిందే అంటూ వెళ్లి గంటను కొట్టి.. ముక్కోటి దేవతలారా అందరూ దిగి రండి.. అంటూ పిలుస్తుంది. చిత్రగుప్తుడు వెళ్లి ఆరును మందలించి యముడి దగ్గరకు తీసుకుని వస్తాడు. ఇంతలో యముడు సభను వాయిదా వేసి వెళ్లిపోతాడు.
బయటకు వెళ్లిన రణవీర్, అమర్‌కు కాల్ చేసి అంజలిని బయటకు తీసుకెళ్లి తనకు ఏదైనా గిఫ్ట్ కొందామనుకుంటున్నాను.. నేను కాసేపు అంజలిని బయటకు తీసుకెళ్లవచ్చా అని అడుగుతాడు. సరే తీసుకెళ్లండి అని అమర్ చెప్పగానే… ఒక్కమాట మిస్సమ్మకు కూడా చెప్పండి అని ఫోన్ ఇస్తాడు. దీంతో అమర్ ఫోన్‌లో అంజును పంపమని చెప్పగానే.. మిస్సమ్మ అనుమానంగానే సరే అంటుంది. తర్వాత రణవీర్, అంజును తీసుకెళ్తుంటే.. మిస్సమ్మ.. అమ్మును పిలిచి అంజుకు తోడుగా వెళ్లమని చెప్తుంది. అంజు కోపంగా అమ్ము వస్తే.. నేను వెళ్లను అంటుంది. అమ్ము కూడా తనకు అసైన్‌మెంట్ ఉంది వెళ్లను అంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?