E-Paper
Advertisement

Horoscope  Today January 29th: ఆ రాశి వారికి ఈరోజు  ధన వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి 

Horoscope  Today January 29th: ఆ రాశి వారికి ఈరోజు  ధన వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి 
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 29న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశి వారికి ఈరోజు బంధు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ఉత్సహంతో ముందుకు సాగుతారు. కుటుంబ విషయాలలో సొంత ఆలోచనలు చెయ్యడం మంచిది. సోదరుల సహాయంతో చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.

Advertisement

వృషభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన గృహ నిర్మాణ ఆలోచనలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక నిరాశ కలిగిస్తాయి. ధన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.

మిథున రాశి: ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఇంట్లో ఉత్సాహంగా గడుపుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

Advertisement

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈరోజు సన్నిహితుల ప్రోద్బలంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాలపై దృష్టి సారిస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పనులు సకాలంలో పూర్తిచేసి అధికారుల ఆదరణ పొందుతారు.

సింహ రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగులకు అధికారుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. బంధు మిత్రులతో ఉన్న సమస్యలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఇతరులకు ధన సహాయం అందిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయట బాధ్యతలు కొంత చికాకు కలిగిస్తాయి. ప్రయాణాలలో కొంత లాభం ఉన్నప్పటికీ శారీరక శ్రమ తప్పదు.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి: ఈ రాశి నిరుద్యోగులకు ఈరోజు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూరప్రాంత బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. పాత రుణాలు కొంత వరకు తీర్చగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సంఘంలో పెద్దల నుండి అరుదైన గౌరవ మర్యాదలు పొందుతారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు ఇంట్లో సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నాయి.  చేపట్టిన పనులలో జాప్యం కలిగి నిదానంగా పూర్తి చేస్తారు.

ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ అవసరాలకు ధనం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.

మకర రాశి: ఈ రాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగాలలో స్థానచలనాలు తప్పవు. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో సన్నిహితుల నుండి ఆర్థిక సహాయం పొందుతారు.

కుంభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి సాధిస్తారు. నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రులతో కలసి విహారయాత్రలలో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు చురుకుగా పాల్గొంటారు.

మీన రాశి: ఈ రాశి వారు ఈరోజు ఇతరుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా సమస్యలు తప్పవు. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతారు. ఆరోగ్య సమస్యలు బాధించిన అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×