E-Paper
Advertisement

OTT Movie : అందమైన అమ్మాయిలతో గ్యాంగ్ స్టర్ పాడు పనులు… హీరో భార్యను కూడా వదలకుండా…

OTT Movie : అందమైన అమ్మాయిలతో గ్యాంగ్ స్టర్ పాడు పనులు… హీరో భార్యను కూడా వదలకుండా…
Advertisement

OTT Movie : యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చూడటానికి ఎక్కువమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. హాలీవుడ్ నుంచి వచ్చే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు మూవీ లవర్స్ ని ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తాయి. అయితే ఒక కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో దుమ్ము లేపుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

రెండు ఓటీటీలలో 

Advertisement

ఈ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘అన్‌స్టాపబుల్‘ (Unstoppable). ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి కిమ్ మిన్-హో దర్శకత్వం వహించారు. ఇందులో మా డాంగ్-సియోక్, సాంగ్ జి-హ్యో, కిమ్ సంగ్-ఓహ్, కిమ్ మిన్-జే, పార్క్ జి-హ్వాన్, బే నూ-రి నటించారు. ఈ మూవీలో లెజెండరీ గ్యాంగ్‌స్టర్ గా ఉండే హీరో తన భార్య కోసం సీఫుడ్ డిస్ట్రిబ్యూటర్‌గా మారుతాడు. తన భార్యను కిడ్నాప్ చేసిన విలన్స్ అక్రమ రవాణా చేస్తూ ఉంటారు. తనని రక్షించడానికి హీరో క్రూసేడ్‌కు వెళతాడు. ఈ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ ‘అన్‌స్టాపబుల్’ మూవీ నవంబర్ 22, 2018న విడుదలైంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) నెట్ఫ్లిక్స్ (Netflix) లలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

హీరో సీఫుడ్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యాపారం చేస్తూ ఉంటాడు. హీరో భార్య కూడా ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ లైఫ్ ని సంతోషంగానే సాగిస్తూ ఉంటారు. ఒకరోజు తక్కువ ధరకే చాలా సరుకు వస్తుందని ఫ్రెండ్ చెప్పడంతో, అప్పు తెచ్చి మరీ అడ్వాన్స్గా ఇస్తాడు. అయితే సరుకు రావాల్సిన షిప్ ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేస్తారు. తీసుకున్న డబ్బుకు వడ్డీ కూడా పెరుగుతుంది. ఆ తర్వాత హీరో భార్యను, విలన్ కిడ్నాప్ చేస్తాడు. హీరో తన భార్య కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. పోలీసులతోనే కాకుండా, తను కూడా వెతకడం మొదలు పెడతాడు. హీరో కూడా ఒకప్పుడు గ్యాంగ్ స్టార్ గా ఉంటాడు. భార్య తన జీవితంలోకి రాగానే అన్నిటినీవదిలి సాధారణ జీవితం మొదలు పెడతాడు. భార్య కిడ్నాప్ అవ్వడంతో హీరో మళ్లీ గ్యాంగ్ స్టర్ అవతారం ఎత్తుతాడు. అదే సమయంలో విలన్ హీరోకి ఫోన్ చేసి పోలీసులకు చెప్పి తప్పు చేశావని బెదిరిస్తాడు. సైలెంట్ గా ఉండకపోతే నీ భార్యను చంపేస్తానని చెప్తాడు.

విలన్ కొంతమంది అమ్మాయిలను కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్ముతూ ఉంటాడు. అందమైన అమ్మాయిలకు ఎక్కువ రేటు ఉండటంతో, అందంగా ఉన్న ఆడవాళ్లను కిడ్నాప్ చేస్తూ ఉంటాడు.ఈ క్రమంలోనే హీరో భార్యని కిడ్నాప్ చేస్తాడు. హీరో తన భార్యను వెతికే క్రమంలో, ఒక వ్యక్తి ద్వారా విలన్ ఎవరో తెలుసుకుంటాడు? చివరికి హీరో తన భార్యని కనిపెడతాడా? విలన్ గ్యాంగ్ ను హీరో ఎలా పట్టుకుంటాడు? కష్టమ్స్ అధికారులు పట్టుకున్న షిప్ రిలీజ్ అవుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), నెట్ఫ్లిక్స్ (Netflix) లలో స్ట్రీమింగ్ ఆవుతున్న ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable) అనే ఈ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

అవమానాల నుంచి అధిపత్యం వైపు… చరిత్ర సృష్టించిన ఓ రియల్ హీరో లైఫ్ స్టోరీ

ఊహకు అందని భవిష్యత్తు ప్రపంచం… విజ్ఞాన శాస్త్రం సృష్టించిన వింత వినాశనం

అపరిచితుల మధ్య రాత్రికి రాత్రే పుట్టే అందమైన ప్రేమ… మనసును హత్తుకునే మధురమైన లవ్ స్టోరీ

బార్డర్ దాటి వెళ్లిన డెడ్లీ కమాండోలు… శత్రువుల డెన్‌లో మైండ్ బ్లాక్ వేట

 ఒక క్షణంలో గతంలోకి… మరుక్షణం భవిష్యత్తులోకి… టైమ్ ట్రావెల్ రొమాంటిక్ డ్రామా

కుప్పలు తెప్పలుగా వచ్చి పడే భారీ అనకొండలు… ప్రాణాల కోసం పరుగులు… ఊపిరి బిగపట్టించే మాన్స్టర్ థ్రిల్లర్

ప్రేమికులపై కన్నేసిన మాస్క్‌డ్ కిల్లర్… వీడి కంట్లో పడ్డారా డైరెక్ట్ నరకానికే… భయపెడుతూనే నవ్వించే రొమాంటిక్ స్లాషర్ ఫిల్మ్

భార్యాభర్తల మధ్య రగిలిన గొడవలు… కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ డ్రామా

Big Stories

Advertisement
×