trinayani serial today Episode: ఇక్కడున్న నయనియే నా మనవరాలు అని రత్నాంభ చెప్పడంతో ఈ బామ్మ మనవరాలు నిన్న రాత్రే ఇల్లు విడిచి వెళ్లిపోయిందని అంటుంది సుమన. అవునని విశాల్ బ్రో వెతకడానికి వెళ్లాడు కదా అంటాడు విక్రాంత్. మీ మనవరాలు వచ్చే వరకు హాయిగా ఇంట్లో తిని కూర్చోలేకపోతే ఎలా అంటుంది దురందర. దీంతో మా అమ్మ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అంటుంది వైకుంఠం. తప్పు చేయకుండా మనం క్షమాపణ ఎందుకు చెప్పాలి అంటూ సత్యప్రమాణికంగా ఇదిగో ఈ చంటి దాని మీద ఒట్టేసి చెప్పు నువ్వు నయనివా..? త్రినేత్రివా…? అంటూ రత్నాంభ అడుగుతుంది.
నయని.. గాయత్రి పాప మీద ఓట్టేసి.. నేను కన్న నా పెద్ద కూతురు ఈ గాయత్రి పాప అంటుంది. చాలా ఇంకేమైనా కావాలా..? అని విక్రాంత్ అడుగుతాడు. మీ మనవరాలికి పెళ్లి కాలేదు. గాయత్రి పాపను ఏనాడు తన బిడ్డ అనుకోలేదు అంటుంది సుమన. దీంతో హాసిని.. తిలొత్తమ్మను తిట్టగానే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత అందరూ ఒక్కొక్కరుగా వెళ్లిపోతారు. దీంతో మొత్తానికి గండం గడిచింది అంటుంది దురందర. అది సరే పిన్ని కోమాలో ఉన్న నన్ను ఎక్కడ పెట్టినట్టు అని నయని అడుగుతుంది. అసలు ఎవరు తీసుకెళ్లినట్టు అని విక్రాంత్ అడుగుతాడు. దీంతో గాయత్రి పాప తానే నయనిని శరీరాన్ని దాచి ఉంచింది గుర్తు చేసుకుంటుంది.
అత్తయ్య రూంలోంచి నయని వదిన బాడీని ఎవరు మార్చి ఉంటారు అని ఆలోచిస్తుంటాడు. సుమన వచ్చి అంత డీప్‌గా ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు అని విక్రాంత్ చెప్పగానే.. నాకు చెప్పడం ఇష్టం లేదని అర్థం అంటుంది సుమన. ఎప్పుడు చెప్పానని ఇప్పుడు చెప్పలేదు అంటున్నావు అంటాడు విక్రాంత్. చాలా పెద్దపెద్ద చదువులే చదివాను అంటారు. కానీ నేను సూటిగా మాట్లాడితే ఎందుకు తట్టుకోలేరు అని అడుగుతుంది సుమన. అయితే వెళ్లి నయని వదినను వెతుకు అంటాడు. ఇంట్లో మా అక్కను పెట్టుకుని మళ్లీ నేను వెతికితే పిచ్చి అంటారు. ముసలి దానిలా ఈయనకు మతి పోయినట్టు ఉంది అనుకుంటూ వెళ్లిపోతుంది సుమన.
తిలొత్తమ్మ, వల్లభ ఆలోచిస్తుంటారు. నేను బామ్మను తీసుకొస్తే.. త్రినేత్రిని తీసుకుని వాళ్లు వెళ్లిపోతారు అనుకున్నాను కానీ ఆ బామ్మకే పిచ్చి ఉందని తేలిపోయింది అని వల్లభ అనగానే అలా అని ఎలా అనుకోవాలి. కొంచెం నన్ను ఆలోచించుకోనివ్వు.. అంటుంది తిలొత్తమ్మ. ఇంకా ఆలోచించి ఏం లాభం మమ్మీ.. ఆ బామ్మ అయినా ఎమోషనల్ అయి నిరూపిస్తుందేమో అనుకుంటే ఆశాభంగం అయింది అంటాడు వల్లభ.
రత్నాంభ లాంటి బామ్మలు అబద్దం చెప్పరు వల్లభ. చెబితే వైకుంఠ దర్శనం అవ్వదని వాళ్ల ప్రగాఢ విశ్వాసం అంటుంది తిలొత్తమ్మ. అయితే మన ముందు నయనిలా ఉండేది త్రినేత్రి అంటావు అంతేనా మమ్మీ అంటాడు వల్లభ. కానీ తను నయనినా.. త్రినేత్రినా అనేది మనకు కచ్చితంగా తెలియాలి అంటే ఒక పని చేయాలి వల్లభ అని తిలొత్తమ్మ చెప్తుంది. ఏంటో చెప్పు మమ్మీ.. నువ్వు ఏం చెప్పినా చేస్తాను అంటాడు. దీంతో మర్డర్ చేయాలి వల్లభ అని తిలొత్తమ్మ చెప్పగానే.. వల్లభ షాక్ అవుతాడు. దీంతో తన ప్లాన్ చెప్తుంది తిలొత్తమ్మ.
రత్నాంభ ఒక్కటే గార్డెన్ లో కూర్చుని నాకు పిచ్చా అసలు పిచ్చి ఎప్పుడు పట్టింది నాకు అని ఒక్కతే మాట్లాడుకుంటుంటే.. నయని, హాసిని వస్తారు. ఏం ఆలోచిస్తున్నావు బామ్మ అని అడుగుతుంది నయని. మనశాంతి ఎప్పుడు దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాను అంటుంది రత్నాంభ. అది చనిపోతే కానీ రాదు కదా బామ్మ అంటుంది హాసిని.
నా మనవరాలు కనిపిస్తే నాకు మనశాంతిగా ఉంటుంది అని రత్నాంభ చెప్పగానే… ఇక్కడ లేని త్రినేత్రిని ఎలా తీసుకురాగలం అంటుంది హాసిని. దీంతో త్రినేత్రి ఇక్కడే ఉంది అంటుంది నయని. అదెలా సాధ్యం అని రత్నాంభ అడగ్గానే.. అక్కడ నయని లేదంటే ఇక్కడ త్రినేత్రి ఉన్నట్టే కదా అంటుంది నయని. దీంతో బామ్మను ఓదార్చడానికి నయని ఇలా మాట్లాడుతుందేమోనని హాసిని మనసులో అనుకుని హాసిని కూడా కన్పీజ్‌గా మాట్లాడుతుంది. దీంతో రత్నాంభ కన్పీజ్ అవుతుంది.
తమకు పాలు తీసుకొచ్చిన వైకుంఠానికి నెక్లెస్ ఇచ్చి పాలల్లో పొడి కలిసి ఆ పాలను గాయత్రి పాపకు తాగించమని చెప్తుంది. అయ్యో నేను తీసుకెళ్లను మీరు అందులో ఏదో కలిపారు పాపకు ఏమైనా జరిగితే అంటూ భయపడుతుంది. జరగకుండా మేము చూసుకుంటాము కదా నువ్వు గాయత్రి పాప దగ్గరకు వెళ్లే సరికి మేము వస్తాము అని చెప్పగానే.. వైకుంఠం పాలు తీసుకుని వెళ్తుంది. ఆ పాలు పాప తాగితే మీ పెద్దమ్మ చాప్టర్ క్లోజ్. పొరపాటున ఆ పాలు చేయి మారితే ఏం జరుగుతుందో చెప్పలేం అంటుంది తిలొత్తమ్మ. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?