Nindu Noorella Saavasam Serial Today Episode : మనోహరి వచ్చి రామ్మూర్తిని తిడుతూ పుట్టగానే అందరినీ దూరం చేసుకున్న అంత గొప్ప జాతకురాలి గురించి ఇంత వెతకడం ఏంటని అనగానే రామ్మూర్తి కోపంగా మనోహరిని తిడతాడు నువ్వు ఓ బిడ్డను కని ఆ బిడ్డ నీకు దూరం అయితే ఎలా ఉంటుందో నీకేం తెలుసు అంటాడు. మనోహరి షాక్ అవుతుంది. ఇంతలో అల్లుడు గారు అంటూ మళ్లీ అమర్‌ను పిలుస్తాడు రామ్మూర్తి. ఆయన లేరు నాన్నా బయటకు వెళ్లారు అని మిస్సమ్మ చెప్తుంది.
ఇంతలో రాథోడ్ రాగానే ఏమయ్యా రాథోడ్ నాకు సమాధానం చెప్పలేక మీ సార్ ముఖం చాటేశాడా..? నువ్వైనా నిజం చెప్పయ్యా అంటూ నిలదీస్తాడు రామ్మూర్తి. రాథోడ్ పలకకుండా నిలబడిపోతాడు. అంజు కూడా రాథోడ్ నువ్వు ఏమీ చెప్పకపోతే డాడీ నిజం దాస్తున్నాడని అర్తం అవుతుంది. డాడీ తప్పు చేయడని చెప్పు రాథోడ్ అంటుంది. ఇంతలో నిర్మల, శివరాం కూడా అమర్ ఎక్కడున్నాడనో చెప్పు అంటారు. రాథోడ్.. రామ్మూర్తిని తీసుకుని బయటకు వెళ్తాడు.
కిటికీ నుంచి గార్డెన్ లోకి వెళ్లిన గుప్త అసలు ఇప్పుడు ఏమైందని ఆ మానవుడు అంతలా అరుస్తున్నాడు. అసలు ఈ మానవులకు కొంచమైనా ఓపిక ఉండదు అంటాడు. కోపంగా చూస్తున్న ఆరు ఏం దాస్తున్నారు గుప్త గారు మీరు ఏదో దాస్తున్నారు చెప్పండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది గుప్త గారు. ఆయన నా తల్లిదండ్రులు ఎవరో తెలిసినా చెప్పడం లేదు. మిస్సమ్మ అక్క గురించి తెలిసినా చెప్పడం లేదు. ఎందుకు ఆయన ఇంతలా దాస్తున్నారు అని ప్రశ్నిస్తుంది. అతగాడి ఆలోచనలు అతడికి ఉన్నాయి. ఏం జరిగినా ఈ మూడు రోజులు చూస్తూ సంతోషంగా ఉండు తల్లి అంటాడు గుప్త.
ఆరు ఏడుస్తూ.. దేనికి నేను సంతోషంగా ఉండాలి. నా స్నేహితురాలు నన్ను చంపి నా కాపురాన్ని ముక్కలు చేసి నా పిల్లలను అనాథలను చేయాలని చూస్తున్నందుకా నేను సంతోషంగా ఉండేది అంటూ గుప్త కాళ్లు పట్టుకుని నిజం చెప్పండి అని అడుగుతుంది. లేదా ఆయన దగ్గరకు నన్ను తీసుకెళ్లండి అని వేడుకుంటుంది. సరే బాలిక ఇది నీవు కోరి తెచ్చుకున్న కష్టం. ఒక్కసారి నిజం తెలుసుకున్నచో దాన్ని నువ్వు మరువలేవు అని గుప్త చెప్పగానే.. సరే బాలిక రమ్ము అంటూ అమర్ ఉన్నచోటికి బయలుదేరుతారు. మరోవైపు రాథోడ్ కారులో రామ్మూర్తిని తీసుకెళ్తుంటాడు.
వెనక ఆటోలో మిస్సమ్మ ఫాలో అవుతుంది. రాథోడ్, రామ్మూర్తిని ఆశ్రమానికి తీసుకెళ్తాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు రాథోడ్ అని అడగ్గానే.. 30 ఏళ్ల క్రితం ఇక్కడ మొదలైన కథకు ఇక్కడే ముగింపు పలకాలని మిమ్మల్ని ఇక్కడికి తీసుకురమ్మన్నారని చెప్పి లోపలికి తీసుకెళ్తాడు. లోపలికి వెళ్లిన రామ్మూర్తి, అమర్ ను చూసి మీకు నిజం తెలిసినా నాకు చెప్పకుండా అడ్డుపడ్డారా..? అని అడుగుతాడు. అమర్ అవునని చెప్పగానే రామ్మూర్తి బాధపడతాడు. నిజం కోసం 30 ఏళ్లుగా పరుగెత్తి నా ప్రాణం అలసిపోయింది బాబు ఇక నాకు ఓపిక లేదు మీకు దండం పెడతాను నా కూతురు ఎవరో.. ఎక్కడుందో చెప్పండి బాబు అంటూ బతిమాలుతాడు.
అమర్ పలకకుండా అలాగే నిలబడేసరికి కోపంగా అమర్‌ను తిడతాడు. దీంతో రామ్మూర్తని రాథోడ్ తిడుతూ మీరు ఎన్ని చెప్పినా ఆయన అలాగే మౌనంగా ఉంటారు. ఎందుకంటే నిజం తెలిస్తే తట్టుకునే ధైర్యం మీకు లేదు సార్ అంటాడు. అయితే రాథోడ్ నా కూతురు గురించి నీకు కూడా తెలుసా..? తెలిస్తే నువ్వైనా చెప్పు రాథోడ్ అంటాడు రామ్మూర్తి. నిజం విని తట్టుకునే శక్తి మీకు ఉందేమో కానీ నిజం చెప్పేంత ధైర్యం నాకు లేదు. ఈ నిజం ఎప్పటికైనా మా సారే చెప్పాలి అంటాడు రాథోడ్.
రామ్మూర్తి, అమర్ దగ్గరకు వెళ్లి చూడగా అమర్ ఏడుస్తుంటాడు. రామ్మూర్తి తన మీద ఒట్టేసి నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టు అని అడుగుతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ఆరుకు బాలిక నీ గతం గురించి నీవు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఇక్కడకు తీసుకొచ్చాను. నిజం తెలుసుకున్నాక నువ్వు తట్టుకునే శక్తి ఆ జగన్నాథుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటాడు గుప్త. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?