Biden Award Soros,Hilary Clinton, Lionel Messi | అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ప్రెసడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌కు 19 మంది ఎంపికయ్యారు. వీరికి బైడన్ త్వరలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నార. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు అందుకోనున్న వారిలో అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, ఫ్యాషన్ డిజైనర్ రాల్ఫ్ లారెన్, ఫుట్‌బాల్ స్టార్ లయెనెల్ మెస్సీ, అమెరికా మాజీ రక్షణ మంత్రి, దివంగత ఆష్టన్ కార్టర్ కూడా ఉన్నారు. ప్రపంచ శ్రేయస్సు, అమెరికా ప్రజాస్వామిక విలువలు, భద్రత కోసం పాటు పడ్డ వారిని అమెరికా ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరిస్తుంది.
అసలైన నాయకులు తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకుంటారని, ప్రజలకు సమాన అవకాశాలు అందిస్తారని అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యానించారని శ్వేత సౌధం ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పౌర పురస్కారానికి ఎంపికైన వారందరూ గొప్ప నాయకులని, అమెరికాతో పాటు ప్రపంచానికి ఎంతో చేశారని అధ్యక్షుడు బైడెన్ ప్రశంసించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన హల్లరీ క్లింటర్ గురించి అందరికీ తెలిసిందే. అమెరికా సెనెట్‌కు ఎన్నికైన తొలి అమెరికా ప్రథమ మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. దశాబ్దాల పాటు ప్రజాసేవకు అంకితమైనందుకు ఆమె పౌర పురస్కారానికి ఎంపికయ్యారు. ఇక అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయిన తొలి మహిళగా కూడా హల్లరీ అరుదై గుర్తింపు సొంతం చేసుకున్నారు.
ప్రముఖ ఇన్వెస్టర్ జార్జ్ సారోస్ కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. తన దాతృత్వంతో అనేక మంది జీవితాల్లో ఆయన వెలుగులు నింపుతున్నారు. పలు ఫౌండేషన్లు, భాగస్వామ్యాలు, ప్రాజెక్టుల ద్వారా 120 దేశాల్లో స్వచ్ఛందసేవ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, మానవహక్కులు, వైద్యం, సామాజిక న్యాయం అందరికీ అందేలా కృషి చేస్తున్నారు. అయితే, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సోరోస్ ఎప్పుడూ విమర్శలు చేస్తూ ఉంటారు.
Also Read: ప్రతిపక్ష నాయకుడిని పట్టిస్తే రూ.85 లక్షల కానుక.. వెనెజూలాలో పాలిటిక్స్ పీక్స్
ఫుట్‌బాల్ ప్రపంచంలో స్టార్‌గా వెలుగొందుతున్న క్రీడాకారుడు లయోనెల్ మెస్సీ ఈ క్రీడ అభివృద్ధికి ఎంతో పాటు పడ్డారు. దీంతో, పిల్లలు విద్య, వైద్యం అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా కూడా మెస్సీ ఉన్నారు.
ఎయిడ్స్ నిర్మూలన కొసం పాటుపడుతున్ ప్రముఖ సింగర్, యూ2 రాక్ బాండ్ సభ్యుడైన బోనో, పార్కిన్సన్ వ్యాధిపై పరిశోధనలను ప్రోత్సహిస్తున్న మైఖేల్ జే ఫాక్స్, పర్యావరణ సంరక్షణ కార్యకర్త జేన్ గుడాల్, మాజీ బాస్కెట్ బాల్ ప్లేయర్ ఎర్విన్ మాజిక్ జాన్సన్, ఎందరో అమెరికా విద్యార్థులకు మార్గదర్శిగా ఉన్న సైన్స్ ఎడ్యుకేటర్ విలియం శాన్‌ఫోర్డ్ నై, ప్రముఖ వ్యాపారవేత్త, కార్లైల్ గ్రూపు అధినేత డేవిడ్ ఎమ్ రూబెన్‌స్టైన్, రచయిత జార్జ్ స్టీవెన్స్, నటుడు డెంజెల్ వాషింగ్టన్, వోగ్ పత్రిక ఎడిటర్ ఆనా వింటోర్ తదితరులు ఈ పురస్కారానికి ఎంపికైన వారిలో ఉన్నారు. శ్వేత సౌధంలో త్వరలో జరిగే కార్యక్రమంలో అధ్యక్షుడు స్వయంగా అవార్డు అందించనున్నారు
Also Read: ట్రంప్ కు జైలు శిక్ష?.. తగ్గేదెలే అంటున్న జడ్జి.. జనవరి 10న తీర్పు..