Nindu Noorella Saavasam Serial Today Episode: బెస్ట్ కపుల్ కాంటెస్ట్ మొదలవుతుంది. నిర్వాహకులు వచ్చి మాట్లాడుతుంటారు. పార్టిసిపేట్ చేసే వాళ్లంతా కూర్చుని ఉంటారు. ఇక్కడ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేశాము. మీ గేమ్స్ అన్ని చూసిన తర్వాత మీ అప్లికేషన్ కూడా వాల్యూ చేసి అప్పుడు విన్నర్స్ ను డిసైడ్ చేస్తాం అని చెప్పగానే.. ఏయ్ లూజ్ అప్లికేషన్ నువ్వే ఫిల్ చేశావు కదా..? నా గురించి ఏం రాశావు అని అమర్, మిస్సమ్మను అడుగుతాడు. దీంతో మిస్సమ్మ మీరు గాలిలో ఎగరగలరు.. సూపర్ మ్యాన్ అని రాశానండి.. లేకపోతే ఏంటండి మీరేం టెన్షన్ పడకండి మీ గురించి అంతా నిజమే రాశానండి. అయ్యో నిజమే రాశాను అని చెప్తుంది.
మరోవైపు వినోద్ కూడా చిత్ర అప్లికేషన్ నువ్వు ఫిల్ చేయలేదు కదా అని అడుగుతాడు. దీంతో చిత్ర అంత డబ్బులు ఇస్తున్నాం కదా అని సంతోష్ తో ఫిల్ చేయించా.. నువ్వేం టెన్షన్ పడకు తను చూసుకుంటాడు.. వినోద్ నువ్వేం టెన్షన్ పడకు అని చెప్తున్నాను కదా అంతా తను చూసుకుంటాడు అని చెప్తున్నాను కదా అంటుంది. ఇంతలో నిర్వాహకులు టోటల్ గా త్రీ రౌండ్స్ ఉంటాయి. రౌండ్స్ ఫినిష్ అయ్యాక మీకు ఆ రౌండ్స్ గురించి ఎక్స్‌ప్లైన్ చేస్తాం. మా టీం వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అప్పటి వరకు మీరు మాట్లాడుకోవచ్చు. మీ ఫోన్స్ ను మా టీం హ్యాండోవర్ చేసుకుంటారు. కాంపిటీషన్ అయ్యాక తిరిగి ఇచ్చేస్తాము అని చెప్తారు. అందరు తమ ఫోన్స్ ఇచ్చేస్తారు. తర్వాత నిర్వాహకులు లోపలికి వెళ్లిపోతారు వారితో పాటు ఉన్న సంతోష్ ఏంటి మొదటి రౌండ్ ఎలా చేయాలో మాకు కూడా చెప్పలేదు అని అడుగుతాడు. కంప్యూటర్ రూంలోకి వెళ్లి ఇదే మొదటి రౌండ్.. ప్రతి టేబుల్ దగ్గర ఒక కెమెరా ఉంది. స్పీకర్ ఉంది. వాళ్లు ఏం మాట్లాడుకుంటారో ఎలా బిహేవ్ చేస్తారో చూసి మార్కులు వేయడమే అని చెప్తాడు.
దీంతో సంతోష్ ఈ విషయం వెంటనే చిత్రకు చెప్పాలని మనసులో అనుకుని అందరూ సెటిల్ డౌన్ అయ్యారో లేదో చూసి వస్తాను సార్ అని కాంపిటీషన్ హాల్ లోకి వెళ్లి ప్లవర్‌బోకే కింద పడిపోయిందని చిత్ర దగ్గరకు వెళ్లి కెమెరా, మైక్ ఉందని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో చిత్ర, వినోద్ అలర్ట్ అవుతారు. లోపల ఉన్న నిర్వాహకులు ఒక్కోక్క టేబుల్ మైక్ ఆన్ చేసి వాళ్లు మాట్లాడుకునేది వింటారు. అమర్ వాళ్ల టేబుల్ మైక్ ఆన్ చేయగానే.. మిస్సమ్మ ఏవండి అది పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు.. వాళ్లు సేఫ్‌గానే ఉంటారు కదా..? మీరు అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారు కదా..? అని అడుగుతుంది. దీంతో అమర్ అవును భాగీ.. నువ్వు గేమ్ మీద కాంసంట్రేషన్ చేయ్ ఈ ప్రైజ్ మనీ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా..? అంటాడు.
వీళ్ల మాటలు వింటున్న నిర్వాహకుడు సంతోష్ వీళ్లకు ఎంత మంది పిల్లలు ఉన్నారు అని అడుగుతాడు. నలుగురు సార్ అమరేంద్ర గారి ఫస్ట్ వైఫ్ సార్ అని సంతోష్ చెప్పగానే.. వాట్ అంటే ఈవిడ సెకండ్ వైఫా..? ఏంటి సంతోష్ ఇది మనం సెకండ్ మ్యారేజ్ వాళ్లను కాంపిటీషన్‌కు రానివ్వం కదా అంటాడు. దీంతో కరెక్టే సార్ కానీ ఆయన లెఫ్టినెంట్ సార్ మీరే ఆయన ప్రొఫైల్‌ను సెలెక్ట్ చేశారు కదా..? అంటాడు సంతోష్. తర్వాత చిత్ర వాళ్ల మైక్ ఆన్ చేయగానే.. మనం ఎలాగైనా ఈ కాంపిటీషన్ విన్ అయ్యి ఆ అనాథ ఆశ్రమానికి ఇవ్వాలి వినోద్. నాలా ఇంకెవ్వరు అనాథ ఆశ్రమంలో ఆకలితో ఇబ్బంది పడకూడదు. ఆ పిల్లలకు అమ్మ ప్రేమ తెలియకపోయినా పర్వాలేదు. కానీ ఆకలి బాధ మాతరం తెలియకూడదు. వాళ్ల బాధ ఎలాగైనా తీర్చాలి వినోద్. తీర్చాలి అంటే నాకున్న ఒకే ఒక్క దారి ఈ కాంపిటీసన్ విన్ అవ్వడమే అంటూ నాటకాలు ఆడుతుంది.
చిత్ర మాటలకు నిర్వాహకులు ఫిదా అయిపోతారు. మరోవైపు అంజును కిడ్నాప్ చేయడానికి వచ్చిన రణవీర్ మనుషులు ఇంట్లోకి వెళ్లగానే.. గార్డెన్‌లో ఉన్న గుప్త కోపంగా బాలిక ఆ దుండగులు ఇంటిలోనికి ప్రవేశిస్తున్నారు అని చెప్తాడు. మను, అంజలి మీద ఎవ్వరినీ చేయి వేయనివ్వదు అని ఆరు చెప్తుంది. తర్వాత మనులోకి వెళ్లిన ఆరు రౌడీలను కొడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?