Nindu Noorella Saavasam Serial Today Episode: బెస్ట్ కపుల్ కాంపిటీషన్ సెకండ్ రౌండ్ లోనూ అమర్, మిస్సమ్మలు గెలుస్తారు. దీంతో చిత్ర డిస్సపాయింట్ అవుతుంది. మీరు నిజంగా మమ్మల్ని సర్‌ప్రైజ్ చేశారు అమరేంద్ర గారు. ఐయామ్ వెరీ హ్యాపీ ఓకే థర్డ్ రౌండ్ స్టార్ట్ అవ్వబోతుంది అందరూ లోపలికి రండి అని మేనేజర్ చెప్పగానే మిస్సమ్మ హ్యాపీగా చూస్తుంది. అమర్ ఏయ్ లూజ్ హ్యాపీయా..? అంటాడు. మిస్సమ్మ నవ్వుతూ చాలా చాలా అండి అంతా మీ వల్లే.. థాంక్యూ వెరీమచ్ అంటుంది.
అందరూ లోపలికి వెళ్లాక చిత్ర పక్కకు వెళ్తుంది. ఇంతలో సంతోష్ వస్తాడు. కోపంగా ఏయ్ సంతోష్ ఏంటయ్యా నువ్వు మను ఏమో అంతా నువ్వు చూసుకుంటావు అని చెప్పింది. నువ్వేమో జరిగేది చూడటం తప్పా ఏం చేయడం లేదు అంటుంది. దీంతో సంతోష్ మేడం సాయం చేయడం అంటే మీ గేమ్స్ కూడా నేను ఆడతాను అని కాదు మేడం నాకు కుదిరినంతలో హెల్ప్ చేస్తాను అని అనగానే సెకండ్ రౌండ్‌లో నువ్వు ఏం చేశావు నుల్చుని చూడటం తప్ప అంటుంది. మేడం అక్కడ మీరేం చేయలేక నా మీద అరుస్తారేంటి..? రెండు సింపుల్ గేమ్స్ గెలవడం మీద కాంసట్రేషన్ చేసి గేమ్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడం రాదు. మీకు అయినా మీరేం టెన్షన్ పడకండి మేడం. నెక్ట్స్ రౌండ్ ట్రెజర్ హంట్ అన్ని క్వశ్చన్స్ భార్యాభర్తలకు ఇంటికి సంబంధించినవే ఉంటాయి. అని సంతోష్ చెప్పగానే అవునా.. క్వశ్చన్ దొరికిన వెంటనే నేను నిన్ను చూస్తాను. నువ్వు ఎలాగోలా. నాకు క్లూ దొరికేలా చూడు అని చెప్పి వెళ్లిపోతుంది చిత్ర. మేడం నేను అలా చేయలేను అంటాడు సంతోష్. అయినా పట్టించుకోకుండా వెళ్లిపోతుంది చిత్ర.
మరోవైపు అమర్ ఇంటికి వచ్చిన రణవీర్, మనోహరికి ఆరు వార్నింగ్ ఇస్తుంది. దీంతో రణవీర్, మను ఇంట్లోంచి బయటకు పారిపోతారు. రణవీర్ కోపంగా మనోహరి నువ్వెందుకు అంజలిని కాపాడుతున్నావో నాకు అర్థం కాలేదు.. నువ్వే కదా అంజును తీసుకెళ్లమని చెప్పింది. మళ్లీ ఇలా ఎందుకు చేశావు అని రణవీర్ అడగ్గానే.. మనోహరి భయంగా రణవీర్ నీకు దండం పెడతాను. ఈ ఒక్క రోజు వెళ్లిపో నీకు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఏదో ఒక రోజు అంజలిని తీసుకెళ్లు అంటుంది. దీంతో కోపంగా రణవీర్ నువ్వు నాకే ఎదురు తిరుగుతావని అస్సలు అనుకోలేదు మనోహరి అనగానే.. ఇంతకుముందే చూశావుగా ఆరు విశ్వరూపం అందుకే వద్దన్నాను. అయినా నువ్వు వింటే కదా..? నాకు సాయంత్రమే సినిమా చూపించింది ఆ ఆరు. అందుకే నిన్ను వెళ్లిపో అంటే వినకుండా ఇంత దూరం తెచ్చుకున్నావు. అయినా అంజును కాపాడితే నాకేం వస్తుంది రణవీర్. అది అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తే ఇదిగో ఇలా అయిపోతావు అంటుంది మనోహరి. సరే మనోహరి అయితే ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా అంజును తీసుకెళ్లాలి. నీ ఫోన్ కోసం ఎదురుచూస్తుంటాను అంటూ రణవీర్ వెళ్లిపోతాడు.
మరోవైపు కాంపిటీషన్‌లో లాస్ట్ రౌండ్, విన్నర్స్ ఎవరో డిసైడ్ చేసే రౌండ్ విన్నర్ ఈజ్ ట్రెజర్ రౌండ్, మీ అందరికీ ఒక క్లూ ఇవ్వడం జరగుతుంది. దాని ఆధారంగా ఎవరైతే ముందుగా ట్రెజర్‌ను చేరుకుంటారో వాళ్లే విన్నర్స్ అని క్లూ ఇస్తాడు. ఇప్పటి నుంచి మీకు 20 నిమిషాల టైం ఉంటుంది. ది టైం స్టార్ట్ నౌ అని మేనేజర్ చెప్పగానే అందరు ట్రెజర్ చేరుకోవడినికి క్లూ చూస్తుంటారు. ఇంతలో హాల్ లో షార్ట్ సర్య్యూట్ కావడంతో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. అందరూ గందరగోళంగా బయటకు వెళ్లిపోతుంటారు. అమర్, మిస్సమ్మ మాత్రం ఇద్దరూ కలిసి ఒక్కోక్కరిని బయటకు పంపిస్తుంటారు. మంటల్లో చిక్కుకున్న ఒక మహిళను ఇద్దరూ వెళ్లి కాపాడతారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం