Brahmamudi serial today Episode: జూనియర్ స్వరాజ్‌కు అపర్ణ, సుభాష్ భోజనం తినిపిస్తుంటే.. రాజ్, కావ్య వాటర్ తీసుకొచ్చి ఇస్తారు. ఇదిగో వాటర్ తాగు అని అపర్ణ అడగ్గానే నేను వాటర్ తాగను. తాగాలంటే నన్ను పట్టుకోవాలి అంటాడు. మళ్లీ పరుగెత్తాలా అంటుంది అపర్ణ. దూరం నుంచి అంతా గమనిస్తున్న రుద్రాణి ఏదో జరుగుతుంది కానీ ఏం జరుగుతుందే అర్థం కావడం లేదు అంటుంది. అపర్ణ స్వరాజ్‌ను తీసుకుని లోపలికి వెళ్తుంది. చూశారా కళావతి గారు వాళ్లిద్దరూ ఎలా కలిసిపోయారో.. ఆ రాముడు బాణం వేస్తే తిరుగుండదు. ఈ రామ్ ప్లాన్ వేస్తే ప్లాప్ ఉండదు. వాళ్లిద్దరిని కలిపే విషయంలో నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాను. ఇప్పటికైనా ఒప్పుకుంటారా..? నేను గ్రేట్ అని రాజ్ అడగ్గానే..
ఏంటి రామ్ గారు ఒప్పుకునేది మీరు సక్సెస్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ బాలెన్స్ ఉంది అని కావ్య చెప్పగానే రాజ్ ఏంటి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉందా..? అంటాడు. ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా కంప్లీట్ అయితే మీకు అపర్ణ చేతిలో ఉంటుంది అనుకుంటూ ఇంద్రాదేవి వస్తుంది. రాజ్, కావ్య షాక్ అవుతారు. అదేంటి అమ్మమ్మ అత్తయ్య చేతిలో మేము అయిపోవడం ఏంటి.? అంటుంది. అయిపోక అపర్ణ మీకు సన్మానం చేస్తుంది అనుకుంటున్నారా..? అసలు మీకు కొంచెం అయినా బుద్ది ఉందా..? అసలు మీరేం చేస్తున్నారు..? అనగానే.. మేము ఏం చేస్తున్నాం నాన్నమ్మ బాబును తీసుకొచ్చాం అంతేగా.. అంటాడు రాజ్. అంతేగా ఏంట్రా అంతేగా రేవతి కొడుకును ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు. అది కూడా నాకు చెప్పకుండా అసలు రేవతి గురించి అనవసరంగా మీకు చెప్పి తప్పు చేశాను అనిపిస్తుంది అని ఇంద్రాదేవి అనగానే కావ్య అదేంటి అమ్మమ్మ గారు అలా అన్నారు అంటుంది.
లేకపోతే ఏంటి ఆరోజు కూడా అంతే నాకు చెప్పకుండా రేవతిని ఇంటికి పిలిచి అపర్ణ చేత గొడవ చేయించారు. ఈరోజు ఏకంగా దాని కొడుకును తీసుకొచ్చి మనింట్లోనే పెట్టారు. ఆ విషయం అపర్ణకు తెలిస్తే ఇంకేమైనా ఉందా..? అన్నింటికీ మీ ఇష్టానికే నిర్ణయాలు తీసుకుంటున్నారు. నేను ఒకదాన్ని ఉన్నానని కానీ నాకు చెప్పాలని కానీ లేదా..? అసలు ఏమనుకుంటున్నారు మీరు ఇద్దరు అంతా మీకే తెలుసు అనుకుంటున్నారా ఏంటి..? అని ఇంద్రాదేవి తిట్టగానే కావ్య క్షమించండి అమ్మమ్మగారు మీకు చెప్పకపోవడం తప్పే కానీ మా ఉద్దేశం మీకు చెప్పకూడదని కాదు అంటుంది. మరి ఏమిటి మీ ఉద్దేశం అంటుంది ఇంద్రాదేవి. దీంతో రాజ్ అమ్మకు తెలియకుండా వాళ్లిద్దరిని ఒక్కటి చేయడం అంటాడు. ఏమంటున్నావురా అని ఇంద్రాదేవి అడగ్గానే.. అవును నాన్నమ్మ కొద్ది రోజుల్లోనే అమ్మకు వాణ్ని చాలా క్లోజ్ చేస్తాం. ఇక అమ్మ వాడు లేకుండా ఉండలేను అని తన నోటితో చెప్పేలా చేస్తాం. ఆ తర్వాత నిజం చెప్పి అక్కని ఇంటికి తీసుకొచ్చేస్తాం. ఎలా ఉంది నా ప్లాన్ అని రాజ్ అడగ్గానే..
ఆ మీరు నిజం చెప్పగానే హారతి ఇచ్చి స్వాగతం పలుకుతుంది అనుకుంటున్నారా…? మొన్న ఎంత గొడవ చేసిందో చూశారుగా అంటుంది. దీంతో చూశాం కాబట్టే ఇలా నరుక్కుంటూ వస్తున్నాం నాన్నమ్మ. అమ్మకు బాబు ఎవరో తెలియకుడా మెల్లిమెల్లిగా దగ్గర చేశామనుకో.. అమ్మ వాడికి కనెక్ట్ అవుతుంది. వాడి మీద ప్రేమ పెంచుకుంటుంది. ఆ ప్రేమ కాస్త రాను రాను అతి ప్రేమగా మారిపోయి వాడికి అడిక్ట్ అవుతుంది. కరెక్టుగా అదే టైంలో వాడిని దూరం చేశామంటే వాడి గురించి ఆలోచిస్తూ.. వాడు లేకుండా ఉండలేక బాధపడతూ వాడి కోసం వెతకడం మొదలు పెడుతుంది. అప్పుడు అమ్మకు వాడు కావాలన్న ఆరాటంతో ఉంటుంది కాబట్టి బాబును తీసుకొచ్చి వాడి గురించి చెపేస్తాం అంటాడు రాజ్ చెప్పేస్తే అపర్ణ ఒప్పుకుని కూతురును క్షమిస్తుందా..? అని అడుగుతుంది ఇంద్రాదేవి. క్షమిస్తుంది నాన్నమ్మ కూతురు కోసం కాకపోయినా మనవడి కోసమైనా తప్పకుండా క్షమిస్తుంది అని రాజ్ చెప్పగానే.. ఏమోరా మనవడా..? నువ్వు చెప్తుంటే నమ్మాలి అనిపిస్తుంది. కానీ నమ్మకం కుదరడం లేదురా ఏదో ఒకటి చేయండి వాళ్లిద్దరు కలిస్తే నాకు అదే చాలు అంటుంది ఇంద్రాదేవి.
తర్వాత ఇంట్లోకి వెళ్లిన ఇంద్రాదేవిని స్వరాజ్ తాతమ్మ అని పిలవడంత అందరూ షాక్ అవుతారు. అపర్ణకు నిజం తెలిసిపోతుందని ఇంద్రాదేవి, రాజ్, కావ్య భయపడుతుంటారు. ఇంతలో రుద్రాణి మా అమ్మ నీకెలా తెలుసురా అని అడుగుతుంది. స్వరాజ్ నువ్వు నాకు నచ్చలేదు నీకు చెప్పను అంటాడు. దీంతో అపర్ణ వచ్చి అడుగుతుంది ఇలాంటి ఓల్డ్ ముసలి వాళ్లను తాతమ్మ అని పిలవాలని ఇలాంటి వాళ్లు రోడ్ల మీద ఏదైనా హెల్ప్ అడిగితే చేయాలని మా అమ్మ చెప్పింది అంటాడు. దీంతో రాజ్, కావ్య, ఇంద్రాదేవి ఊపిరి పీల్చుకుంటారు. మరోవైపు వైదేహి వచ్చి యామినిని భోజనానికి పిలుస్తుంది. బావ వచ్చాక తింటానని చెప్తుంది.
ఇంతలో రాజ్ ఫోన్ చేసి ఇవాళ తాను కావ్యకు ప్రపోజ్ చేస్తున్నానని రావడానికి లేటు అవుతుందని చెప్తాడు. దీంతో యామిని ఫోన్ విసిరికొడుతుంది. యామినిని వాళ్ల అమ్మ, నాన్న తిడతారు. ఇప్పటికైనా రియలైజ్ కమ్మని చెప్తారు. వాళ్లిద్దరని విడదీయోద్దని ఇప్పటికైనా రాజ్‌ను వదిలేయమని చెప్తారు. మరోవైపు కావ్య దగ్గరకు వెళ్లిన రాజ్ తన మనసులో మాట చెప్పడానికి సిగ్గు పడుతుంటే అప్పుడే అక్కడికి ప్రకాష్ వస్తాడు. రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం