Nindu Noorella Saavasam Serial Today Episode: బుక్స్ చూసిన అమర్ పిల్లలు ఎవరు రాప్ చేశారో నిజంగా మీరు చూడలేదా..? అని అడుగుతాడు. దీంతో అంజు డాడ్ నేను ఆకాష్ చూస్తే ఎవ్వరూ లేరు డాడ్ కానీ బ్రౌన్ షీట్స్‌ను బుక్స్ రాప్ చేస్తున్నారు అని చెప్తుంది. అమర్ బుక్ ఓపెన్ చేసి అందులో ఉన్న రైటింగ్ చూస్తుంటాడు. ఇంతలో శివరాం ఏమంటున్నావు అంజు అమ్మా ఎవ్వరూ కనిపించలేదు కానీ బుక్స్ మాత్రం షీట్స్‌తో రాప్ చేశారు అంటున్నావు అని అడుగుతాడు. మిస్సమ్మ కూడా పిల్లలు ఇలాంటి విషయాల్లో జోక్స్ చేయకూడదు. ఏవండి మీరు కూడా ఏంటండి పిల్లలతో కలిసి ఏదేదో మాట్లాడుతున్నారు అని చెప్తుంది.
దీంతో అమర్ నేను జోక్ చేయడం లేదు భాగీ.. నిజం ఇది చూడు ఆరు హ్యండ్ రైటింగ్. చూడండి అమ్మ ఇది కచ్చితంగా ఆరు రాసిందే.. అని నిర్మల, శివరాంలకు చూపిస్తాడు అమర్. శివరాం కూడా అవును అమర్ అచ్చం ఆరు రాసినట్టే ఉంది అంటాడు. ఇంతలో మిస్సమ్మ కల్పించుకుని మామయ్యా ఏం మాట్లాడుతున్నారు అదెలా సాధ్యం అవుతుంది. చనిపోయిన అక్కా షీట్స్‌ను ఎలా రాప్ చేస్తుంది. వాటి మీద పేరు ఎలా రాస్తుంది అని అడుగుతుంది. దీంతో తెలియదు అమ్మా కానీ ఇవన్నీ చూస్తుంటే ఆరు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్తాడు. కిటికీలోంచి చూస్తున్న ఆరు గుప్త గారు సారీ టైం పాస్ అవ్వక ఆ బుక్స్ అన్నీ రాప్ చేశాను. ఇంత ఇష్యూ అవుతుందని అనుకోలేదు అని చెప్తుంది. గుప్త కోపంగా ఆరును అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. ఇంతలో నిర్మల నాన్నా అమర్ చెప్పటం మర్చిపోయాను నాకు తెలిసి ఈ పనులన్నీ వినోదే చేసి ఉంటాడు అని చెప్తుంది.
దీంతో అమర్ ఏం మాట్లాడుతున్నావు అమ్మా అంటాడు. అవును నాన్నా నిన్న చాలా సార్లు పిల్లల బుక్స్ అన్నింటికీ షీట్స్ వేయాలి అన్నాడు అని చెప్తుంది. దీంతో అమ్ము కానీ బాబాయ్ వచ్చి ఇన్ని బుక్స్ రాప్ చేసే టైం లేదు కదా నాన్నమ్మ అంటుంది. ఇంతలో మిస్సమ్మ పిల్లలు చేసిన అల్లరి చాలు ఎవరో ఒకరు చేసి ఉంటారు. పదండి స్కూల్‌కు టైం అవుతుంది. పదండి అంటూ మిస్సమ్మ పిల్లలను తీసుకుని వెళ్లిపోతుంది. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. పిల్లలను తీసుకుని బయటకు వచ్చిన రాథోడ్‌కు ఆశ్రమం వార్డెన్ ఫోన్ చేస్తుంది. రాథోడ్ పక్కకు వెళ్లి కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి వార్డెన్ గారు చిత్రను దత్తతకు తీసుకున్న వారి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు.
వార్డెన్ తెలియడం కాదు రాథోడ్ గారు వాళ్లిప్పుడు నా కళ్ల ముందే ఆశ్రమంలో ఉన్నారు అని చెప్తుంది. వాళ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. కూతురు లేని లోటు తీరుతుందని చిత్రను దత్తత తీసుకుంటే వాళ్లను రోడ్డున పడేసింది రాథోడ్ గారు అని వార్డెన్ చెప్తుంది. అసలేం జరిగింది మొత్తం చెప్పండి వార్డెన్ గారు అని రాథోడ్ అడగ్గానే వార్డెన్ మొత్తం చెప్తుంది. దీంతో రాథోడ్ అమర్ దగ్గరకు వెళ్లి విషయం చెప్తాడు. దీంతో అమర్ ఆశ్రమానికి వెళ్తాడు. రాథోడ్, వార్డెన్‌తో మాట్లాడింది. అమర్‌కు నిజం చెప్పింది వింటుంది ఆరు. అదంతా మిస్సమ్మకు చెప్తుంది. ఆరు, మిస్సమ్మకు నిజం చెప్పడం విన్న మనోహరి ఫోటోషూట్‌లో ఉన్న చిత్రకు ఫోన్ చేసి నిజం చెప్తుంది.
దీంతో చిత్ర వినోద్‌కు అబద్దం చెప్పి ఆశ్రమానికి బయలుదేరుతుంది. మరోవైపు ఆశ్రమానికి వెళ్లిన అమర్ చిత్రను దత్తత తీసుకున్న పేరెంట్స్ ను కలుస్తాడు. చిత్ర గురించి వాళ్లు నిజం చెప్తారు తను అసలు మంచిది కాదని తన వల్ల మేము రోడ్డున్న పడ్డామని చెప్పడంతో అమర్ కోపంతో ఊగిపోతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?