Nindu Noorella Saavasam Serial Today Episode : బర్తు సర్టిఫికేట్స్ ఉన్న ఫైల్ ను మిస్సమ్మ ఇచ్చి అమర్ రూంలో జాగ్రత్తగా ఉంచమని చెప్తాడు శివరాం. మిస్సమ్మ సరేనని ఫైల్ తీసుకుని అమర్ రూంలోకి వెళ్తుంది. కిటికీలోంచి అంతా గమనిస్తున్న మనోహరి ఆ ఫైల్‌లో ఏదో సీక్రెట్ ఉందని అదేంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. ఈ ముసలోడు ఒక్క సెకన్ లేటుగా వచ్చి ఉంటే ఆ ఫైల్‌లో ఏముందో చూసేదాన్ని. అమర్ వాళ్లు లేనప్పుడు ఆ ఫైల్ లో ఏముందో కచ్చితంగా చూడాలని అనుకుని అక్కడి నుంచి తన రూంలోకి వెళ్తుంది. ఫైల్ తీసుకుని అమర్ దగ్గరకు వెళ్తిన మిస్సమ్మ.. ఏవండి మామయ్య ఈ ఫైల్ మీకు ఇవ్వమన్నారు అని చెప్తుంది. ఆఫీసుకు వెళ్తున్న అమర్.. కప్‌బోర్డులో పెట్టమని చెప్తాడు. లేదు మీ చేతికే ఇవ్వమన్నారు అని మిస్సమ్మ చెప్పినా అమర్ వినకుండా పర్వాలేదు కప్‌బోర్డులో పెట్టు అంటాడు. అదేం కాదండి జాగ్రత్తగా మీ చేతిలోనే పెట్టమన్నారు అంటుంది మిస్సమ్మ.
దీంతో అమర్ కోపంగా నాకు కొన్ని రోజులు ఆఫీసు పని ఉంది. అన్ని నిన్నే చూసుకోమని చెప్పాను కదా అంటాడు. కానీ నేను నిన్నటి నుంచి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని మిస్సమ్మ అనగానే.. అమర్ చెప్పండి అంటాడు. దీంతో మిస్సమ్మ… నిన్న నేను కరుణ స్కూటీ మీద వెళ్తుంటే మాకు రెండు కార్లు వచ్చి డాష్ ఇవ్వబోయాయి. అంటూ చెప్తుండగానే.. రాథోడ్ సార్ సార్ అంటూ వస్తాడు. మిస్సమ్మ చెప్పడం ఆపేస్తుంది. సార్ చుట్టాల నుంచి సమాచారం వచ్చింది అని చెప్తాడు. దీంతో అమర్ వెళ్లి కలవగలిగే ఇన్ఫర్మేషనేనా..? అని అడుగుతాడు. లేదు సార్ పై నుంచి ఫోన్ వచ్చింది అని రాథోడ్ చెప్పగానే.. అయితే వెళ్దాం పద అని అమర్, రాథోడ్ అక్కడి నుంచి పాస్ట్‌గా వెళ్తారు.
అయ్యో కొంత మంది గన్స్ పట్టుకుని సిటీలో తిరుగుతున్నారు అని చెప్పబోతుంటే వెళ్లిపోయారేంటి..? అనుకుంటుంది మిస్సమ్మ. తర్వాత ఫైల్‌లో ఉన్న అంజు అడాప్షన్ సర్టిఫికెట్ చూసి షాక్ అవుతుంది. అంజును దత్తత తీసుకున్నారా..? అని బాధపడుతూ.. అమర్ మాటలు గుర్తు చేసుకుంటుంది. అసలు ఇది ఎలా సాధ్యం.. ఇది నిజం కాదు అనుకుంటుంది. ఇంతలో ఆనంద్, ఆకాష్ భాగీ అనుకుంటూ లోపలికి వస్తారు. మాకు ట్రైనింగ్ ఇస్తా అన్నావు అక్కడ అంజు, మనోహరి ఆంటీతో చాలా చేస్తుంది అంటూ చెప్పగానే మిస్సమ్మ సరే పదండి అని వెళ్తుంది.
అనామిక పిల్లలతో కలిసి గార్డెన్‌లో గేమ్ ఆడుతుంది. మనోహరి ఆలోచిస్తూ కూర్చుని ఉంటుంది. స్వామిజీ చెప్పినట్టు చేయడానికి టైం కోసం వెయిట్ చేస్తుంది. ఒక ప్లాన్ వేసి తన ప్లాన్ ప్రకారం అనామికను తనతో చెస్ ఆడటానికి ఒప్పిస్తుంది. అనామిక, మనోహరి చెస్ ఆడుతుంటే.. స్వామిజీ చెప్పినట్టు చేస్తుది మనోహరి. తర్వాత తాయెత్త తీసుకుని స్వామిజీ దగ్గరకు వెళ్లి స్వామీజీ మీరు చెప్పినట్టే చేశాను. తాయెత్తు కూడా తీసుకొచ్చాను అంటూ తాయెత్తు చూపిస్తుంది. ఆ తాయోత్తు ముట్టుకుని చూసిన స్వామిజీ ఇందులో ఏ ఆత్మ లేదు మనోహరి అని చెప్పగానే.. మరి ఆత్మ ఏమైంది. ఇంకా ఆనామిక బాడీలోనే ఉందా..? అంటూ మనోహరి భయంగా అడుగుతుంది. దీంతో స్వామిజీ అనామిక, అరుంధతిగా మారిపోయింది. అని చెప్పగానే.. మనోహరి షాక్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలని అడుగుతుంది. దానికి ఇప్పుడు నేనేమీ పరిష్కారం చెప్పలేనని స్వామిజీ అనడంతో మనోహరి ఆలోచనలో పడిపోతుంది. మరోవైపు అనామికలా మారిపోయిన ఆరుంధతి.. మిస్సమ్మ ను చూసి వెళ్లి గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?