Bengaluru East Railway Station: దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణంతో పాటు ఇంటర్ లాకింగ్ వ్యవస్థను అప్ గ్రేడ్ చేస్తున్నారు. రీసెంట్ గా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ కొత్త రైల్వే లైన్లను నిర్మించడంతో పాటు ఇంటర్ లాకింగ్ పనులను నిర్వహించారు. సుమారు 40 రైళ్లను రద్దు చేయడంతో పాటు పలు రైళ్లను ఆలస్యంగా నడిపారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఇక తాజాగా సౌత్ వెస్ట్రన్ రైల్వే పరిధిలోనూ పలు రైల్వే లైన్ల నిర్మాణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలు రైళ్లకు సంబంధించి తాత్కాలిక స్టాఫ్ లను క్యాన్సిల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
సౌత్ వెస్ట్రన్ రైల్వే పరిధిలో కొత్త లైన్ల నిర్మాణ పనులు
సౌత్ వెస్ట్రన్ రైల్వే పరిధిలోని మూడు, నాల్గవ లైన్ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు ఈస్ట్ స్టేషన్ సమీపంలో తాత్కాలిక స్టాప్‌లను తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 13 నుంచి టెంపరరీ హాల్టింగ్ క్యాన్సిల్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నెక్ట్స్ నోటీస్ జారీ చేసే వరకు స్టాఫ్ ల రద్దు కొనసాగింపు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ మేరకు రైల్వే అధికారులు ప్రకటన జారీ చేశారు.
బెంగళూరు ఈస్ట్ స్టేషన్ లో ఏ రైళ్లు ఆగవంటే?
ఇక మార్చి 13 నుంచి పలు రైళ్లు ఆగవని రైల్వే అధికారులు తెలిపారు. ఆ రైళ్లు ఏవంటే..
⦿ 12785 కాచిగూడ – మైసూరు
⦿ 16220 తిరుపతి – చామరాజనగర్
⦿ 06595 కెఎస్‌ఆర్ బెంగళూరు – ధర్మవరం
⦿ 06596 ధర్మవరం – కెఎస్‌ఆర్ బెంగళూరు
⦿ 11301 సిఎస్‌టి ముంబై – కెఎస్‌ఆర్ బెంగళూరు
⦿ 11013 ఎల్‌టిటి ముంబై – కోయంబత్తూర్
⦿ 18463 భువనేశ్వర్ – కెఎస్‌ఆర్ బెంగళూరు
⦿ 12577 దర్భంగా – మైసూరు
ఈ రైళ్లు ఈ నెల 13 నుంచి బెంగళూరు ఈస్ట్ రైల్వే స్టేషన్ లో ఆగవని అధికారులు తెలిపారు. నెక్ట్స్ నోటీసు జారీ చేసే వరకు హాల్టింగ్ ఉండదని అధికారులు వెల్లడించారు. ప్రయాణీకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
మల్కాజిపల్లి రైల్వే స్టేషన్ పరిధిలోనూ..
అటు నైరుతి రైల్వే పరిధిలోని మక్కాజిపల్లి రైల్వే స్టేషన్ లో ప్రయాణీకుల సౌకర్యాలకు సంబంధించి పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 15 వరకు మక్కాజిపల్లి రైల్వే స్టేషన్ లో పలు రైళ్లకు సంబంధించి తాత్కాలిక స్టాప్‌ల తొలగింపు అమలులో ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
⦿ 77213 గుంతకల్ – హిందూపూర్
⦿ 77214 హిందూపూర్- గుంతకల్
Read Also: ఇండియన్ రైల్వే సరికొత్త నిర్ణయం, ఇక టికెట్ లేకుండా స్టేషన్ లోకి అడుగు పెట్టడం అసాధ్యం!
రైళ్లకు సంబంధించి తాత్కాలిక స్టాఫ్ లు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 15 తర్వాత నుంచి యథావిధిగా ఈ స్టాఫ్ లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. మరికొద్ది రోజుల్లోనే అన్ని రైళ్లు యథావిధిగా ఆగుతాయని తెలిపారు.
Read Also: మీరు బుక్ చేసుకున్న టికెట్ వేరకొకరికి అమ్ముతున్నారా? అయితే, జైల్లో ఊచలు లెక్కించాల్సిందే!
Read Also: కోడికి టికెట్ తియ్యాలి, ఐస్ క్రీమ్ తినకూడదు.. ఈ ఫన్నీ రైల్ రూల్స్ తెలుసా?