Nindu Noorella Saavasam Serial Today Episode : ఇంట్లోకి వచ్చిన వినోద్ అటూ ఇటూ చూసి వదిన ఫోటో ఎక్కడా లేదేంటి అన్నయ్యా అని అడుగుతాడు. దీంతో అమర్ పిల్లలు మీరు పైకి వెళ్లి ఆడుకోండి అని చెప్తాడు. పిల్లలు పైకి వెళ్తారు. వాళ్లు వెళ్లిపోయాక ఆరు విషయంలో పిల్లలు చాలా డిస్టర్బ్ గా ఉన్నారు. అందుకే ఆరు ఫోటో కళ్ల ముందు ఉంటే మరచిపోరని.. ఆరు ఫోటోను పై రూంలో పెట్టాను అని చెప్తాడు. దీంతో వినోద్ సరే అన్నయ్యా నేను వదిన ఫోటో దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుని వస్తాను అని లోపలికి వెళ్లిపోతాడు. అమర్ తనకు చిన్న పని ఉందని బయటకు వెళ్లిపోతాడు. మనోహరి మాత్రం వినోద్ ను ఎలాగైనా నా వైపు మళ్లేలా చేసుకోవాలి అని మనసులో అనుకుని తాను కూడా రూంలోకి వెళ్తుంది. రూంలోకి వెళ్లిన వినోద్ ఆరు ఫోటో చూస్తూ ఏడుస్తూ.. బాధపడుతూ.. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు.
వినోద్ లాప్ టాప్ లో రిజల్ట్ చూస్తుంటాడు. ఆరు అటూ ఇటూ తిరుగుతూ దేవుడా ప్లీజ్ సీటు రావాలి అని మొక్కుతుంది. ఇంతలో వినోద్ సంతోషంగా లేచి ఎగురుతూ వదినా నాకు సీటొచ్చింది. అమెరికాలో నేను కోరుకున్న యూనివర్సిటీలోనే సీటు వచ్చింది అంటూ హ్యాపీగా చెప్తుంటాడు. ఆరు కూడా హ్యాపీగా థాంక్యూ దేవుడా అంటుంది. ఇంతలో అమర్ లేచి నీకు ఎగ్జామ్స్ కు చదివించింది నేను. ఎగ్జామ్ అప్పుడు నీకు అన్ని విధాలా సపోర్ట్ చేసింది నేను. ఇప్పుడేంట్రా సీటు రాగానే క్రెడిట్ అంతా మీ వదినకు ఇచ్చేస్తున్నావు.. అంటాడు. దీంతో ఆరు నేను మోరల్ సపోర్టు చేశానండి అని చెప్తుంది. వినోద్ కూడా అవును అన్నయ్య నా లైఫ్‌లో ఏ సక్సెస్ వచ్చినా కూడా అది ఓన్లీ మా వదిన వల్లే అంటాడు. దీంతో అమర్ నవ్వుతూ వినోద్‌ను కొట్టబోతాడు. వినోద్ తప్పించుకుని అటూ ఇటూ తిరుగుతుంటే.. ఆరు ఏవండి కొట్టకండి అంటుంది.
ఇదంతా గుర్తు చేసుకుని వినోద్ ఏడుస్తుంటాడు. మళ్లీ తాను అమెరికా వెళ్తున్నపపటి విషయం గుర్తు చేసుకుంటాడు. వినోద్ కారు దగ్గర నిలబడి బాధపడుతుంటే.. ఇలా బాధపడతావేంటి వినోద్.. రోజూ ఫోన్ లో మాట్లాడొచ్చు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియో కాల్ లో కూడా మాట్లాడుకోవచ్చు ఇంకా ఎందుకు ఇలా ఉంటావు.. అంటుంది. ఇంతలో అమర్ కూడా మేము అందరం నిన్ను చాలా మిస్ అవుతాం అంటాడు. వినోద్ కూడా నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతాను అన్నయ్యా.. వదిన అందిరిని నువ్వు ఎలాగూ బాగ చూసుకుంటావు. కానీ నిన్ను చూసుకోవడానికి ఇక నుంచి నేను ఉండను. నాకు అక్క ఉంటే ఎలా ఉంటుందో తెలియదు. కానీ నువ్వు లైఫ్‌లోకి వచ్చాక ఆ లోటు తీరిపోయింది వదిన అంటూ బాధపడుతుంటే.. ఆరు ఎమోషనల్‌గా సరే ఫ్లైట్‌కు లేట్ అవుతుంది. బాధపడకుండా బయలుదేరు అంటుంది.
వినోద్ ఏమోషనల్ గా ఆరు కాళ్లు మొక్కుతాడు. ఏయ్ ఏంటి ఇదంతా మంచిగా చదువుకో అని జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది. అది కూడా గుర్తు చేసుకుని వినోద్ ఆరు ఆస్తికలు పట్టుకుని బాధపడుతుంటాడు. మమ్మల్ని వదిలి ఎలా వెళ్లాలనిపించింది వదిన. తిరిగి ఇండియాకు వచ్చినప్పుడు గుమ్మం ముందు అమ్మలా ఎదురుచూస్తుంటానని మాట ఇచ్చావు కదా..? మర్చిపోయావా..? అని ఏడుస్తుంటాడు. ఇంతలో మనోహరి వచ్చి ఆఖరి నిమిషం వరకు ఆరు ఈ ఇంటి గురించి ఈ కుటుంబం గురించి ఆలోచించింది వినోద్. నీలాంటి మంచి కుటుంబం దొరకడం ఆరు అదృష్టం అంటుంది. అయితే వదిన మా ఇంటికి రావడం మా అదృష్టం అంటాడు వినోద్. ఆరు ఇంత కష్టపడి కాపాడుకున్న ఈ కుటుంబం ఇలా నా కళ్ల ముందు కూలిపోతున్నా..? నేను ఏమీ చేయలేని పరిస్తితి అంటుంది. దీంతో వినోద్ ఏంటి ఏమన్నారు…? అని అడుగుతాడు. దీంతో మనోహరి ఏమీ లేదు వినోద్. ఇప్పుడే వచ్చావు కదా వెల్లి ప్రెష్ అవ్వు అని చెప్తుంది. వినోద్ మాత్రం పర్వాలేదు మనోహరి గారు చెప్పండి అని అడుగుతాడు.
దీంతో మనోహరి చెప్పడానికి ఏముంది వినోద్.. భాగీ మోసం చేసి అమర్‌ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ ఇంట్లో ఎవ్వరూ మనఃశాంతిగా లేరు అంటుంది. దీంతో వినోద్ అదేంటి ఆవిడ వచ్చాక ఇంట్లో అన్ని సర్దుకున్నాయి అని అమ్మ చెప్పింది అనగానే.. మనోహరి లేనిపోని కట్టుకథలు కల్పించి చెప్తుంది. మరోవైపు అనామిక, రాథోడ్ బయటకు వెల్తుంటే మిస్సమ్మ వస్తుంది. దీంతో రాథోడ్ ఓ వచ్చేశావా మిస్సమ్మ సార్ నీ గురించే అడుగుతున్నారు అని చెప్తాడు. దీతో మిస్సమ్మ ముందు వినోద్‌కు హాయ్ చెప్పి తర్వాత ఆయన్ని కలుస్తాను అంటుంది. దీంతో అనామిక షాక్ అవుతుంది. వినోద్ నా ఫోటో దగ్గర ఉన్నాడు కదా ఇప్పుడు మిస్సమ్మ అక్కడికి వెళితే మొత్తం తెలిసిపోతుంది. అని మనసులో అనుకుని మిస్సమ్మను ఆపి కొద్దిసేపు అయితే వినోద్ గారే బయటకు వస్తారు కదా అంటుంది. దీంతో మిస్సమ్మ నేను ఆ రూంలోకి వెళ్లి వినోద్ ను ఎందుకు కలవకూడదు అని అడుగుతుంది. అనామిక ఏదేదో చెప్తుంటే.. మిస్సమ్మ వినకుండా వెళ్తుంది. డోర్ దగ్గరకు వెళ్లి లోపల ఉన్న ఆరు ఫోటో చూసి షాక్ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?