OTT Movie : బెంగాలీ ఇండస్ట్రీ చిన్నదే అయినా, మంచి కంటెంట్ ఉన్న థ్రిల్లర్ సినిమాలు వస్తున్నాయి. ఇవి ఓటీటీలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, సినీ నటికి చెందిన రహస్య వీడియో ఒకటి, ఒక న్యూస్ రీడర్ కి దొరుకుతుంది. ఆ తరువాత స్టోరీ అనుకోని మలుపులు తీసుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
శాంతిలాల్ కోల్‌కతాలో ఒక ఆంగ్ల వార్తాపత్రికలో వాతావరణ రిపోర్టర్‌గా పని చేస్తుంటాడు. అతనికి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాకుండా ఉంటాడు. అతను తన తల్లితో కలిసి నివసిస్తుంటాడు . అతని జీవితం ఒకేలా సాగుతూ, జర్నలిజంలో పెద్దగా గుర్తింపు లేకుండా ఉంటుంది. ఒక రోజు అతను ఒంటరిగా ఒక పాత పో*ర్న్ సినిమాను చూస్తున్నప్పుడు, అందులో ప్రముఖ సినీ నటి నందితకు సంబంధించిన ఒక సీక్రెట్ ఉంటుంది. ఆ వీడియో పద్మా పిక్చర్స్ అనే పో*ర్న్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌లో నటించే, ప్రసిద్ధ నటి మిస్ రోష్నీకి కూడా సంబంధించినదిగా తెలుస్తుంది. దీని రహస్యం ఎలాగైనా కనిపెట్టాలనే కుతూహలం శాంతిలాల్ కి కలుగుతుంది. ఆ వీడియోలో సినీ నటి ఒంటి మీద ఒక పచ్చబొట్టు ఉండటంతో అతనికి కలసి వస్తుంది. నందిత ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకుంటున్న ఒక గ్లామరస్ నటి, ఈ రహస్యం ఆమె కెరీర్‌ను ప్రమాదంలో పడేస్తుందని శాంతిలాల్ భావిస్తాడు.
ఈ రహస్యాన్ని ఒక పెద్ద హెడ్‌లైన్‌గా మార్చాలనే ఆశతో, శాంతిలాల్ పద్మా పిక్చర్స్ గురించి దర్యాప్తు ప్రారంభిస్తాడు. అతని దర్యాప్తు అతన్ని కోల్‌కతా నుండి చెన్నై, ఆపై సింగపూర్‌కు తీసుకెళ్తుంది. దర్యాప్తు సాగే కొద్దీ, శాంతిలాల్ అనేక అడ్డంకులను ఎదుర్కొంటాడు. పద్మా పిక్చర్స్ గురించి ఎవరూ మాట్లాడడానికి ఇష్టపడకపోవడంతో, మిస్ రోష్నీ గురించిన సమాచారం సేకరించడం అతనికి సవాలుగా మారుతుంది. చివరికి శాంతిలాల్ ఆ వీడియోలో ఉన్నది ఎవరో కనిపెడతాడా ? ఆ వీడియో వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి ? దీని వల్ల అతని కెరీర్ మారిపోతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ప్రేమికుల మధ్య రిజర్వేషన్ చిచ్చు… ఐఏఎస్ కలలను పక్కన పెట్టి రాజకీయ గందరగోళంలో కొట్టుకుపోయే అమాయకుడు
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ బెంగాలీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘శాంతిలాల్ ఓ ప్రజాపతి రహస్యం’ (Shantilal O Projapoti Rohoshyo). 2019 లో విడుదలైన ఈ బెంగాలీ మూవీకి ప్రతిమ్ డి. గుప్తా దర్శకత్వం వహించారు. ఇందులో రిత్విక్ చక్రవర్తి, పావోలీ డామ్, గౌతమ్ ఘోష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ స్టోరీ వాతావరణ రిపోర్టర్ అయిన శాంతిలాల్ భట్టాచార్య అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.