E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీ ప్రేమను చెప్తాడా? పెద్దోడు ప్రేమకు గ్రీన్ సిగ్నల్.. ప్రతాప్ ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : చక్రీ ప్రేమను చెప్తాడా? పెద్దోడు ప్రేమకు గ్రీన్ సిగ్నల్.. ప్రతాప్ ప్లాన్ సక్సెస్..
Advertisement

Podarillu Today Episode May 30th : రాత్రి భోజనం చేస్తూ అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.. చక్రిని ఎవరు పిలవలేదా అని అడుగుతుంది.. దానికి ప్రతాప్ నేనే దగ్గర నుండి పిలిచాను అమ్మ కానీ తను రాలేదు అని అబద్ధం చెప్తాడు. ఇక లలిత మాత్రం వడ్డించమని చెప్పగానే ఉన్న కూరలన్నీ కావాలని చక్రి ప్లేట్లో వడ్డిస్తుంది.. ఇక చక్రి చదువు గురించి ప్రతాప్ కావాలనే టాపిక్ తీసుకొని వస్తాడు. అల్లుడుని బాగా అర్థం చేసుకున్నాను ఇక మన బిజినెస్ లలో అల్లుడు కూడా భాగం పంచుకుంటాడు అని ప్రతాప్ అంటాడు. కానీ చక్రి మాత్రం ఏదో జరుగుతుంది నన్ను ఏదో చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు. మహా మాత్రం నేను ఇక్కడ ఉండను.. నా గోల్ని రీచ్ అవ్వాలి అని అంటుంది. అయితే మహాలక్ష్మి అభూషణ్ గురించి చెప్తుంది. చక్రి తో జరిగిన పెళ్లి అబద్ధం అని చెప్పాలని అనుకుంటుంది మహాలక్ష్మి.. కానీ చక్రి నిజం చెప్తే తనని ఏదైనా చేస్తారేమో అని అనుకుంటాడు.

చక్రీని మహాకు దూరంచేసేందుకు ప్లాన్..

ఆ చక్రి గాడిని ఇంట్లో లేకుండా చేయాలి. వాడి మాయలో పడి మహాలక్ష్మి కూడా వాడికి సపోర్ట్ చేస్తూ కనిపిస్తుంది.. మన ఇంట్లోనే వ్యక్తులతో సమానంగా చూస్తుంది. ఆ ఇంట్లో ఒక్క కూర వేసుకొని తిన్నా కూడా ఇక్కడ తన గురించి ఆ ఇంటి వాళ్ల గురించి ఎక్కువగా చెప్తుంది అని లలిత అలాగే ఆది అనుకుంటారు.. మనం వద్దని ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేసాము.. ఆ ఇంట్లో వాళ్ళు తనని బాగా చూసుకున్నారు అని చెప్తుంది. అయితే మహాలక్ష్మి ది శాశ్వతంగా ఇక్కడే ఉంచేస్తే చక్రి దూరమవుతాడు కదా అని ఆలోచిస్తూ ఉంటారు. లలిత ఆ డ్రైవర్ ని ఇంట్లో తిరగనివ్వకుండా చేయాలి అని అంటుంది. మన చేతికి మట్టి అంటకుండా ఏ పనైనా చేయాలి అని ప్రతాప్ అదిరిపోయే ప్లాన్ చెప్తాడు. ఈ దెబ్బతో చక్రి మహా అని వదిలేసి పారిపోతాడు అని ప్రతాప్ అనుకుంటాడు.

చక్రికీ మళ్ళీ టెన్షస్.. 

Advertisement

ఆ భూషణ సంగతి ఇంట్లో వాళ్ళందరూ మర్చిపోయినారు కదా.. అతనితో పెళ్లి చేయాలన్న ఆలోచన కూడా వీళ్ళకి లేనట్టుంది అని మహాలక్ష్మి అనుకుంటుంది. అయితే తనకు జరిగింది నిజమైన పెళ్లి కాదని వాళ్ళతో చెప్పాలని అనుకుంటుంది. అప్పుడే చక్రి వచ్చి పిలవడంతో అతనితో మాట్లాడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే నేను మా నాన్న వాళ్లతో మాట్లాడేసి వస్తాను అని మహాలక్ష్మి అంటుంది.. నేను వెళ్తాను మీరు మీ వాళ్ళతో ఎంత సేపు కావాలన్నా అంతసేపు మాట్లాడేసి రండి అని మహాలక్ష్మితో అని చక్రి వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి నేను మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. అయితే ఆ మాట వినగానే ఆది నాకు ఒక అర్జెంటు పని ఉందని ఫోన్ రాగానే వెళ్ళిపోతాడు. అటు ప్రతాప్ కూడా ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి చేసేదేమీ లేక లలితని పాలు అడిగి తీసుకు రమ్మని చెబుతుంది..

నన్ను మళ్ళీ కాపాడారు.. 

ఏంటండి ఇందాక కిందకి వచ్చి పిలిచారు అని మహాలక్ష్మి అంటుంది. నేను మా వాళ్లకి మన పెళ్లి గురించి నిజమైన పెళ్లి కాదు అని చెప్పాలనుకున్నాను. కానీ అది కుదరలేదు అని మహాలక్ష్మి అంటుంది. ఆ పెళ్లి గురించి ఒకవేళ నిజంగా బయట పెడితే నన్ను ముందు వేసేస్తారండి మీరు ఇకనుంచి వెళ్లేంతవరకు ఎటువంటి రిస్క్ చేయకండి అని చక్రి అడుగుతాడు. కానీ మా అన్నయ్య నాన్న వెళ్ళిపోవడంతో నేను ఎవరికీ చెప్పాలో అర్థం కాక వచ్చేసాను అని మహాలక్ష్మి అంటుంది.. ఇప్పుడు మీరు నా గురించి మనకు జరిగిన పెళ్లి గురించి చెప్పడం కాదు మీ గోళ్లు మీరు రీచ్ అవ్వాలి అని చక్రి చెబుతాడు. మీరు ఈ నిజాన్ని చెప్పకుండా మరోసారి మళ్లీ నన్ను కాపాడారు అని చక్రి చాలా సంతోష పడిపోతూ ఉంటాడు..

మాధవ్ తో ప్రేమలో పడుతున్న మనీషా..

Advertisement

పొదిరిల్లు సీరియల్ లో మాధవ్ కి అసిస్టెంట్ గా ఉన్న బన్సీ భాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాధవ్ పెద్ద మేస్త్రి అయితే అతని కింద పనిచేస్తున్న వారిలో బన్సీ ఒకరు.. అతడు చెల్లెలు మనిషా మాధవ్ కి జోడి అవుతుందని ఇప్పుడు జరిగిన ఎపిసోడ్ ని చూస్తే అర్థమవుతుంది. ఆమెను చూసిన మాధవ్ హిందీ గురించి తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఇకముందు ఎపిసోడ్లలో మనిషా తో మాధవ్ ప్రేమలో పడేటట్టు కనిపిస్తున్నాడు. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ కనక మొదలైతే ఎపిసోడ్ కాస్త రసవత్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా కేశవ చెప్పినట్లు వాళ్ళ అన్నయ్య కోసం పుట్టిన అమ్మాయి మనిషా అనే అని అర్థమవుతుంది. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా పడుతుంది? పెళ్లి పీటల వరకు వెళ్తారా లేదా అన్నది ముందు ముందు ఎపిసోడ్ లలో చూడాలి.. సోమవారం ఎపిసోడ్లో చక్రిని ఇరికించేందుకు ప్రతాప్ మైండ్ బ్లాక్ చేసేలా ప్లాన్ చేస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇకముందు ఎపిసోడ్లలో ఎలాంటి ట్విస్టులు ఎదురవుతాయో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో రోహిణి ఫ్యూజుల్ అవుట్.. బాలు మాస్టర్ ప్లాన్.. అయ్యో రోహిణి..

Related News

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

Big Stories

Advertisement
×