Nindu Noorella Saavasam Serial Today Episode: పిల్లలతో కలిసి రాథోడ్ క్రికెట్ ఆడుతుంటాడు. లాన్‌లో కూర్చున్న అమర్ కాఫీ తాగుతుంటాడు. మిస్సమ్మ, అనామిక పిల్లల ఆట చూస్తుంటారు. ఇంతలో మనోహరి లోపలి నుంచి వచ్చి అందరినీ చూసి ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది. లోపల ఎవ్వరూ కనిపించకపోయే సరికి ఎవ్వరూ లేరనుకున్నాను. అందరూ ఇక్కడే ఉన్నారు. అమర్ లేచాక కూడా ఇంట్లో ఉన్నాడంటే బాబ్జీ ఇంకా నిజం చెప్పలేదు. నేను వెళ్లి వాడికి కనిపించి ఏమీ చెప్పొద్దని చెప్పాలి. లేదంటే అమర్‌కు తెలియకుండా ఇన్ని రోజులు కష్టపడి దాచిన నిజం తెలిసిపోతుంది. ఆ ఎస్సైకి కూడా నా మీద డౌటు వచ్చినట్టు ఉంది. బాబ్జీని కలవనిస్తాడా..? ఏదైతే అది అయింది. ముందు వెళ్లి బాబ్జీని కలవాలి అనుకుంటూ మెల్లగా వెళ్లిపోతుంటే.. మిస్సమ్మ గమనించి మనోహరి గారు ఇక్కడ ఇటు రండి.. అని పిలుస్తుంది.
మనోమరి దగ్గరకు రాగానే.. పొద్దున్నే అంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు మనోహరి గారు అని అడుగుతుంది మిస్సమ్మ.. దీంతో మనోహరి మనసు ఏమీ బాగా లేదు.. అందుకే శివాలయానికి వెళ్తున్నాను అని చెప్తుంది. దీంతో ముందే చెప్తే అందరం వచ్చే వాళ్లం కదా మనోహరి గారు అంటుంది అనామిక. అంటే సడెన్‌గా అనుకుని వెళ్తున్నాను వెంటనే వచ్చేస్తాను అంటుంది మనోహరి. ఇంతలో రాథోడ్ మేడం మేము స్టేషన్‌కు వెళ్తున్నాము. మీరు కూడా వస్తే ఒక సారి బాబ్జీని కలవొచ్చు అంటాడు. అనామిక కూడా బాబ్జీ వెనక ఉండి.. ఇదంతా చేయిస్తున్నావాళ్లు ఎవరో చెప్పేటప్పుడు మనోహరి గారు అక్కడ ఉంటే మీ పని ఈజీగా అయిపోతుందిగా అంటుంది. దీంతో మనోహరి కోపంగా ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అంటూ కోప్పడుతుంది. దీంతో అనామిక అయ్యో మనోహరి గారు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒకవేళ బాబ్జీ నిజం చెప్పకపోతే మీరు నాలుగు తగిలించైనా నిజం చెప్పిస్తారని అన్నాను అంతే అనగానే.. మనోహరి నేను స్టేషన్‌కు రాలేను రాథోడ్ అని చెప్తుంది.
రాథోడ్ సరే మేడం అంటాడు. అమర్ మాత్రం ఎందుకు మనోహరి అని అడుగుతాడు. దీంతో మనోహరి అక్కడికి వచ్చి వాడి ముఖం చూడలేను అమర్ వాడు చేసిన పని తలుచుకుంటేనే ఒళ్లు మండిపోతుంది. అలాంటిది వాడి ఎదురుగా నిలబడాలి అంటే నా వల్ల అసలు కాదు. బై అమర్ అంటూ వెళ్లిపోతుంటే.. మనోహరి చెప్పడం మర్చిపోయాను నీ ఫ్రెండ్ నిన్న కనిపించింది. హోటల్ లో ఉన్నానని చెప్పింది. నా ఫ్రెండా.. ఎవరు అమర్ అని మనోహరి అడుగుతుంది. అదే అనాథ శరణాలయంలో కలిశాం కదా..? చిత్ర అని అమర్ చెప్పగానే మనోహరి షాక్ అవుతుంది. చిత్ర కొడైకెనాల్ లో ఉందా..? లేదు అమర్ నిన్న మాట్లాడినప్పుడు కూడా హైదరాబాద్ లో ఉన్నాను అని చెప్పిందే.. అనగానే.. నీకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకుందట అని చెప్పగానే.. మనోహరి ఆలోచనలో పడిపోతుంది. తనని లంచ్‌కు రమ్మని చెప్పు.. ఇవాళ బాబ్జీ నిజం చెప్పగానే.. రేపే హైదరాబాద్ వెళ్లిపోవాలి అంటాడు. మనోహరి సరే అంటూ వెళ్లిపోతుంది.
తర్వాత పిల్లలందరూ కూర్చుని చదువుకుంటుంటే.. అంజు వచ్చి మిస్సమ్మతో మాట్లాడదామా అంటుంది. దీంతో అమ్ము బాల్కనీలో ఉంది వెళ్లి ఎంతసేపైనా మాట్లాడుకో అంటుంది. మనలా కాదు మిస్సమ్మ ఇష్టపడే అక్కవాళ్ల పిల్లలాగా మాట్లాడదాము అంటుంది. ఆనంద్ కూడా కరెక్టే ఒక్కసారి మాట్లాడదాము ఇంక చాలు అంటాడు. హైదరాబాద్ వెళ్లిపోతే ఎలాగూ మాట్లాడలేము కదా ఈ ఒక్కసారికి మాట్లాడదాము అంటుంది అంజు. దీంతో అమ్ము నాకెందుకో రిస్క్ అనిపిస్తుంది అంజు. డాడీ నిజం మిస్సమ్మకు తెలియకూడదని మరీ మరీ చెప్పారు అంటుంది. దీంతో అంజు నేనేం నిజం చెబుదాం అనడం లేదు కదా..? జస్ట్ మిస్సమ్మకు ఫోన్ చేసి మాట్లాడదాం పాపం హ్యాపీగా ఫీలవుతుంది కదా అంటుంది. దీంతో అమ్ము సరే ఇదే లాస్ట్ మళ్లీ ఇంకొకసారి చేయకూడదు అంటుంది.
దీంతో అంజు బ్రెయిన్ లెస్ బ్రో వెళ్లి అనామికను పిలుచుకురాపో అని ఆకాష్‌కు చెప్తుంది. ఆకాష్, అంజును కొట్టి బయటకు అనామిక దగ్గరకు వెళ్లి అనామిక ఒకసారి మా రూంలోకి రావా అని పిలుస్తాడు. అనామిక ఎందుకు అని అడుగుతుంది. దీంతో ఆకాష్ ఆ విషయం ఇక్కడ చెబితే అర్థం కాదు.. అక్కడికి వస్తే అర్థం అవుతుంది అంటాడు. దీంతో అక్కడికి వస్తే ఏం అర్థం అవుతుందో తెలియదు కానీ నువ్వు ఇక్కడ చెప్పిన విషయం ఏమీ అర్థం కావడం లేదు అంటుంది అనామిక. అబ్బా రా చెప్తాను అంటూ చేయి పట్టుకుని లాకెళతాడు అకాష్. అప్పుడే లోపలికి వస్తున్న మిస్సమ్మ చూసి అంత సీక్రెట్‌గా అనామికను ఎందుకు తీసుకెళ్తున్నాడు. లోపల ఏదో జరుగుతుంది. అదేంటో కనిపెడదాం అనుకుంటూ మిస్సమ్మ లోపలికి వెళ్లబోతూ.. కిటికీ దగ్గరే నిలబడి చూస్తుంది. లోపలికి వెళ్లిన అనామిక అక్కడ ఉన్న ఫోన్ చూసి అమ్మును గుర్రుగా చూస్తుంది. దీంతో అమ్ము నన్నెందుకు అలా చూస్తున్నావు అనామిక చేద్దాం అన్నది అంజూనే అంటుంది. ఇంతలో అంజు అవునని ఎలాగైనా ఈ ఒక్కసారి ఫోన్ మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తుంది. పిల్లలందరూ కలిసి అనామికను కన్వీన్స్ చేస్తారు.
మరోవైపు అమర్ స్టేషన్ వెళ్లగానే అక్కడ మనోహరి, చిత్ర కనిపిస్తారు. అమర్ పిలవడంతో మనోహరి షాక్ అవుతుంది. దగ్గరకు వచ్చిన అమర్ మీరు ఇక్కడేం చేస్తున్నారు..? ఉదయం స్టేషన్ రమ్మని అడిగితే రానని చెప్పావు ఇప్పుడెందుకు వచ్చావు అంటూ అమర్ నిలదీయడంతో మనోహరి భయపడిపోతుంది. మెల్లగా తేరుకుని ఆరు చావు కోరుకున్నది ఎవరో ఇప్పటికైనా చెప్పమని నిలదీయడానికి వచ్చాను అమర్ అంటుంది మనోహరి. దీంతో వాడు చెప్పాల్సిన అవసరం లేదు మేడం.. ఎవరో తెలుసుకునే పెద్ద ఆధారం దొరికింది అంటాడు రాథోడ్. షాక్ అయిన మనోహరి భయంతో ఏం ఆధారం దొరికింది అమర్ అని అడగ్గానే.. వాడి ఫోన్ దొరికింది అని అమర్ చెప్తాడు. మనోహరి భయంతో వణికిపోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..?అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?