Heroine ..తాజాగా ఒక హీరోయిన్ చేసిన కామెంట్లు అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి. బాలీవుడ్ నటి అను అగర్వాల్(Anu Agarwal) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందం గురించి, తన స్కిన్ గ్లోయింగ్ గురించి చేసిన కామెంట్లు అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన స్కిన్ గ్లో గా ఉండడానికి తన మూత్రం తానే తాగినట్లు చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఇటీవల బాలీవుడ్ నటుడు పరేష్ రావల్.. ఈ విషయాన్ని చెప్పడంతో ఆమె కూడా తన మూత్రం తానే తాగినట్లు సమర్ధించారు. “నేను కూడా నా మూత్రాన్ని తాగాను. అయితే మూత్రాన్ని నిర్దిష్ట మోతాదులో తీసుకుంటే అది అమృతంలా ఉంటుంది” అంటూ ఆమె వెల్లడించింది. “అది నీ చర్మాన్ని ముడతలు పడకుండా, త్వరగా వృద్ధాప్యం రాకుండా చూస్తుందని” కూడా తెలిపింది. అంతేకాదు “యోగాలో దీనిని అమృతంగా పరిగణిస్తారు” అంటూ తెలిపారు.
నా మూత్రం నేనే తాగాను – అను అగర్వాల్
ఇక దీనిపై అను అగర్వాల్ మాట్లాడుతూ.. “మనమందరం కూడా దీనిని ప్రయత్నిస్తే కలిగే నష్టం ఏమీ లేదు. నిజానికి యోగా శాస్త్రంలో ఇది ఒక అద్భుతమైన అభ్యాసం. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. మీరు మొత్తం మూత్రాన్ని తాగకూడదు. ఉదయం మాత్రమే తాగాలి. అయితే ఒక్కసారి తాగితేనే అది అమృతంగా భావిస్తారు. ఇది చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుతుంది. ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. నేను దానిని స్వయంగా అనుభవించాను కూడా” అంటూ చెప్పుకొచ్చింది అను అగర్వాల్. ప్రస్తుతం అను అగర్వాల్ చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అను అగర్వాల్ కెరియర్..
అను అగర్వాల్ విషయానికి వస్తే.. 1969 జనవరి 11న మల్కా గంజ్ ఢిల్లీలో జన్మించారు. ఈమె ‘ఆషికి’లో చేసిన నటనతో ప్రశంసలు అందుకుంది. ఇక హిందీలోనే కాకుండా తెలుగులో కూడా ‘దొంగ దొంగ’ సినిమాలో చంద్రలేఖగా నటించి ఇటు తెలుగువారికి కూడా పరిచయమైంది. ఇంకా ఈమె కెరియర్ విషయానికి వస్తే.. ఢిల్లీలో పుట్టింది కానీ చెన్నైలో పెరిగింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి సోషాలజీలో గోల్డ్ మెడలిస్ట్ అందుకున్న ఈమె.. కొన్ని రోజులు మోడలింగ్ చేశాక టీవీలో వ్యాఖ్యాతగా కూడా పనిచేసింది. ఆపై నటిగా ఆషికీ లో తొలిసారి కనిపించింది. ఇక ఈ సినిమా వాణిజ్యపరంగా, అటు సంగీతంలో కూడా మంచి విజయాన్ని అందుకుంది. 1999లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడి దాదాపు 29 రోజులపాటు కోమాలోనే ఉంది. ప్రస్తుతం బీహార్లో ఉంటున్న ఈమె ఒంటరిగానే యోగా, లలిత కళలను అభ్యసిస్తూ కొన్ని విషయాలను అభిమానులతో కూడా పంచుకుంటుంది. ఇక ఈమె నటించిన సినిమాల విషయానికి వస్తే తిరుడాతిరుడా, గజబ్ తమాషా, ఖల్ నాయికా, ది క్లౌడ్ డోర్, కన్యా దాన్, జనం కుండలి రిటర్న్ ఆఫ్ ది జువెల్ థీఫ్ వంటి చిత్రాలలో నటించింది. ఇక ప్రస్తుతం కెరియర్ పై కాకుండా ఆరోగ్యం పై దృష్టి పెట్టి పలు అంశాలపై చర్చిస్తూ వార్తల్లో నిలుస్తోంది.
ALSO READ:Razakar: అనసూయ రజాకర్ మూవీకి అవార్డ్స్.. అసలైన వేడుక షురూ..!