BigTV English

Bigg Boss 8 Telugu: నబీల్ కోసం తల్లి స్పెషల్ గిఫ్ట్.. గౌతమ్‌తో పెళ్లి సంబంధం మాట్లాడిన రోహిణి తల్లి

Bigg Boss 8 Telugu: నబీల్ కోసం తల్లి స్పెషల్ గిఫ్ట్.. గౌతమ్‌తో పెళ్లి సంబంధం మాట్లాడిన రోహిణి తల్లి

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో ప్రస్తుతం 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. అందుకే ఈవారమే ఫ్యామిలీ వీక్ ప్రారంభం కానుంది. దాదాపు 70 రోజుల నుండి కంటెస్టెంట్స్ అంతా తమ ఇంటికి, ఫ్యామిలీకి దూరంగా ఉంటుండగా వారిని హ్యాపీ చేయడం కోసం బిగ్ బాస్.. ఈ ఫ్యామిలీ వీక్ ఏర్పాటు చేశారు. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో నబీల్ తల్లితో పాటు రోహిణి తల్లి, మేనల్లుడు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చారు. వారు ఆడియన్స్‌లాగా బిగ్ బాస్‌ను బయట నుండి చూస్తారు కాబట్టి తమ పిల్లలు ఎలా ఆడాలో సలహాలు ఇచ్చి వెళ్లారు. అంతే కాకుండా రోహిణి తల్లి అయితే తన కూతురు గౌతమ్‌ను ఇష్టపడుతుందని ఏకంగా పెళ్లి సంబంధం మాట్లాడడానికే సిద్ధమయిపోయారు.


గులాబ్ జామ్ గిఫ్ట్

కొన్నాళ్ల క్రితం కంటెస్టెంట్స్ అందరికీ అన్‌లిమిటెడ్ రేషన్ దక్కడం కోసం స్వీట్స్‌ను త్యాగం చేశాడు నబీల్. తనకు స్వీట్స్ అంటే ఎంత ఇష్టమున్న తినను అని బిగ్ బాస్‌కు మాటిచ్చాడు. అలాంటిది తాజాగా బిగ్ బాసే తనను పిలిచి స్వీట్ పెట్టాడు. అదే సమయంలో తన తల్లి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. ఆమెను చూసి నబీల్ సంతోషంగా ఫీల్ అయ్యాడు. తన కొడుకు అందరికంటే చిన్నవాడు కాబట్టి హౌస్‌లో ఉన్న అమ్మాయిలంతా తన అక్కలు అని అనేశారు. ఆపై తను ఆట బాగా ఆడుతున్నారని, ఎమోషనల్ అవ్వకూడదు అని చెప్పారు. చివరికి వెళ్లే ముందు నబీల్ తల్లితో ఒక ఆట ఆడించారు బిగ్ బాస్. ఆ ఆట గెలిచిన నబీల్ తల్లి.. అందరికీ 20 గులాబ్ జాములను గిఫ్ట్‌గా హౌస్‌లోకి తీసుకురాగలిగారు.


Also Read: డేంజర్ జోన్ లో టైటిల్ ఫేవరేట్.. ఎలిమినేషన్ తప్పదా..?

ఒంటరిగా నబీల్

నబీల్ తల్లి వచ్చి వెళ్లిపోయిన తర్వాత తన ధ్యాస్ మొత్తం అక్కడే ఉండిపోయింది. ఇక టేస్టీ తేజ అయితే తన తల్లి హౌస్‌లోకి రాలేకపోతున్నందుకు చాలా ఫీలయ్యాడు. ఏడ్చాడు. రోహిణి తల్లి వచ్చిన తర్వాత హౌస్ వాతావరణమే మారిపోయింది. తనతో పాటు రోహిణి మేనల్లుడిని కూడా తీసుకొచ్చారు. ఆ పిల్లోడితో కంటెస్టెంట్స్ అంతా సరదాగా ఆడుకున్నారు. రోహిణి కూడా తన తల్లిని, మేనల్లుడిని చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యింది. ఇక రోహిణి ఆట ఎలా ఉందని అందరి ముందు కాకుండా పక్కకు తీసుకెళ్లి మాట్లాడారు.

గౌతమ్‌తో పెళ్లి ఓకే

రోహిణితో అందరూ బాగానే ఉంటున్నట్టు అనిపించినా వెనక మాట్లాడుతున్నారని, అందుకే ఎవరినీ నమ్మొద్దని మరీ మరీ చెప్పారు తన తల్లి. అవినాష్, టేస్టీ తేజ మాత్రమే తనకు నిజమైన ఫ్రెండ్స్ అని, మిగిలిన కంటెస్టెంట్స్ అంతా తన గురించి వెనుక మాట్లాడుకుంటున్నారని అన్నారు. తనకు కప్ రాదని అనుకోవద్దని, కప్ కోసమే ఆడాలని మోటివేషన్ ఇచ్చారు. అప్పుడే గౌతమ్ కూడా అక్కడికి రావడంతో రోహిణి పెళ్లి టాపిక్ వచ్చింది. తాము పెళ్లి చేసుకోమని అంటున్నా కూడా తను ఒప్పుకోవడం లేదని అన్నారు. గౌతమ్ ఎదురుగానే ఉన్నాడు కాబట్టి తను ఓకేనా అంటే తనకు ఓకే అయితే ఓకే అని ఓపెన్‌గా చెప్పేశారు. అక్క, చెల్లి అనకుండా ఓకే అంటే మాకు కూడా ఓకే అన్నారు రోహిణి తల్లి.

Related News

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Big Stories

×