Arjun Tendulkar: టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ( Sachin Tendulkar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 20 ఏళ్ల పాటు టీమిండియాలో పాతుకు పోయారు సచిన్ టెండూల్కర్. ఈ నేపథ్యంలోనే ఎన్నో రికార్డులు, వేలాది పరుగులు చేసి చరిత్ర సృష్టించారు. అలాంటి పరుగుల వీరుడు సచిన్ టెండూల్కర్ కొడుకు… బౌలర్గా రాణిస్తున్నారు. లెఫ్ట్ హార్మ్ బౌలింగ్ చేయగల అర్జున్ టెండూల్కర్ ( Arjun Tendulkar ) తాజాగా సంచలన బౌలింగ్ తో అందరినీ భయపట్టించాడు.
Also Read: South Africa vs India, 3rd T20I: బౌలింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా.. అవేశ్ ఖాన్ పై వేటు ?
Also Read: Sanjay Bangar: అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన సంజయ్ బంగర్ కొడుకు ?
ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి… ప్రత్యర్ధులకు చుక్కలు చూపించాడు సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ( Arjun Tendulkar ). బుధవారం జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లు పడగొట్టి 25 పరుగులు ఇచ్చి చరిత్ర సృష్టించాడు. దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో…. గోవా జట్టుకు ( Goa Team ) ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అర్జున్ టెండూల్కర్ ( Arjun Tendulkar ). ఈ నేపథ్యంలోనే బుధవారం రోజున గోవా వర్సెస్ అరుణాచల్ ప్రదేశ్ ( Arunachal pradesh) మధ్య బిగ్ ఫైట్ జరిగింది.
అయితే ఈ మ్యాచ్ లో అర్జున్ టెండూల్కర్ ( Arjun Tendulkar ) రెచ్చిపోయి బౌలింగ్ చేశాడు. 25 పరుగులు ఇచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఈ దెబ్బకు అరుణాచల్ ప్రదేశ్ 84 పరుగులకే కుప్ప కూలడం జరిగింది. ఈ మ్యాచ్ లో 9 ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్ ( Arjun Tendulkar )… ఐదు వికెట్లు తీయడమే కాకుండా మూడు ఓవర్లు మేడిన్ కూడా చేశారు. అలాగే 25 పరుగులు ఇచ్చాడు. అయితే ఈ ఐదు వికెట్లలో ముగ్గురు క్లీన్ బోల్డ్ కావడం విశేషం.
Also Read: ICC Champions Trophy 2025: పాక్ కుట్రలు… దక్షిణాఫ్రికాలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ?
వాస్తవంగా ఈ మ్యాచ్ కంటే ముందు 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్కు వాడిన అర్జున్ టెండూల్కర్ ( Arjun Tendulkar )… 32 వికెట్లు తీయగలిగాడు. గతంలో 49 పరుగులు ఇచ్చిన నాలుగు వికెట్లు తీసిన రికార్డు మాత్రమే అర్జున్ టెండూల్కర్ ( Arjun Tendulkar ) పేరుపై ఉండేది. అయితే దాచక కొత్త బెస్ట్ నమోదు చేసుకున్నాడు అర్జున్ టెండూల్కర్ ( Arjun Tendulkar ).. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగల సమర్థుడు అర్జున్ టెండూల్కర్ ( Arjun Tendulkar ).
23.13 సగటుతో ఇప్పటివరకు 533 పరుగులు చేసి రాణించాడు అర్జున్ టెండూల్కర్ ( Arjun Tendulkar ). ఇందులో ఒక సెంచరీ తో పాటు రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల చెత్త ప్రదర్శనతో… నెగిటివ్ కామెంట్స్ ను ఎదుర్కొంటున్నాడు. అయితే తాజా ప్రదర్శనతో ఐపీఎల్ మెగా వేలం లో.. వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సారి కూడా ముంబై ఇండియన్స్.. చేసే అవకాశాలు ఉన్నాయి.