Nindu Noorella Saavasam Serial Today Episode : డోరు ఓపెన్ చేసుకుని పిల్లల రూంలోకి వచ్చిన మిస్సమ్మ మీకేం కాలేదు కదా..? అంటూ అడుగుతుంది. మాకేం కాలేదు కానీ ఇంతకీ ఏం జరిగిందని అమ్ము అడగ్గానే పాము బుట్టలోంచి బయటకు వచ్చి ఇంట్లో దూరిందని అందుకే భయపడ్డానని చెప్తుంది. దీంతో అంజు భయంతో మిస్సమ్మ చంకలో ఎక్కి కూర్చుంటుంది. దీంతో పాము ఎప్పుడో వెళ్లిపోయిందని చెప్పి అందరికి స్నాక్స్ చేసి పెడతానని కిందకు వెళ్లండి అని చెప్తుంది. సరే అని అందరూ కిందకు వెళ్తారు. మిస్సమ్మ రూం సర్దడానికి వెళ్లి ఆరును చూస్తుంది. మీరేంటి అక్కా ఇక్కడున్నారు..? ఎప్పుడొచ్చారు అని అడుగుతుంది. ఆరు ఏదేదో చెప్పి ఏడుస్తూ నువ్వు పిల్లలకు స్నాక్స్ చేయాలి వెళ్లు మిస్సమ్మ నేను వెళ్తాను అని ఆరు బయటకు వెళ్లిపోతుంది.
గార్డెన్ లో ఆలోచిస్తూ కూర్చున్న గుప్త దగ్గరకు వెళ్తుంది ఆరు. గుప్తను చూసి ఎక్కడికి వెళ్లిపోయారు. ఇంతకీ రాజు గారు ఏది ఆయన మాత్రం ఎందుకు కనిపించడం లేదు. అంటూ అసలు ఇక్కడ ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా..? ఒక పాములు పట్టేవాడు దానం చేయమని వచ్చి పామును ఇంట్లోకి వదిలేశాడు. ఎక్కడ పిల్లలను కాటేస్తుదోనని చాలా భయపడిపోయాను గుప్తగారు. ఆ గుడ్గగూడ గాడు దొరకాలి అంటూ తిడుతుంది.
బాలిక నీ కోపం పాము మీదనా..? లేక ఆ పాములు పట్టు వాణి మీదనా..? అని అడుగుతాడు గుప్త. దీంతో పాపం పాము మీద ఎందుకు కోపం ఉంటుందండి. ఆ పాములు పట్టేవాడి మీదే కోపం ఉంటుంది. గుప్త గారు ఆ పాములు పట్టేవాడు దొంగ అంటారా..? అని డౌటుగా ఆరు అడగ్గానే.. ఆపుము బాలిక.. ఆ పాముల పట్టువాడు దొంగ కాదు. అయినను తప్పిదం అంతయూ ఆ పాముల పట్టువాడికి అని ఎందులకు అనుకుంటివి అని గుప్త కొపంగా అరవగానే.. అయితే ఆ పాము నా కోసమే వచ్చిందని చెప్పండి అంటుంది ఆరు. వాడు ఇంకొక్కసారి కనిపిస్తే వాడి తాట తీస్తాను అంటుంది.
అయినా వాడు మళ్లీ నీకెందుకు కనిపిస్తాడు అని చెప్పగానే అయినా రాజు గారు ఎక్కడ కనిపించడం లేదేంటి..? అని అడగ్గానే మా లోకానికి వెళ్లాడని.. వెళ్తూ వెళ్తూ ఘోర భయంకరమైన శక్తులు కూడగట్టుకుంటున్నాడని ఎప్పుడైనా నిన్ను బంధిస్తాడని హెచ్చరించారు అని గుప్త చెప్పగానే ఆరు భయపడుతుంది.
మిస్సమ్మ వంట చేసి అందరినీ తీసుకొస్తానని పైకి వెళ్తూ.. నిర్మలను పిలిచి కుక్కర్ ఇప్పుడే తెరవవద్దని చెప్తుంది. సరేనని శివరాంను భోజనానికి పిలవడాకి వెళ్తుంది నిర్మల. అప్పుడే రూంలోంచి భోజనానికి వచ్చిన మనోహరి ఎవ్వరూ లేరని ఇంకా డైనింగ్ టేబుల్ మీద రెడీ చేయలేదని అనుకుంటూ అసలు వంటలు ఏం చేసింది చూద్దాం అనుకుంటూ కిచెన్ లోకి వెళ్తుంది. అన్ని తెరచి చూస్తూ.. కుక్కర్ కూడా తెరచి చూస్తుంది. ఇంతలో కుక్కర్ పేలిపోవడంతో ఆ శబ్దానికి అందరూ భయంగా హాల్ లోకి పరుగెత్తుకు వస్తారు.
మిస్సమ్మ వచ్చి కిచెన్ లో కుక్కర్ పెట్టానని చెప్పగానే రాథోడ్ వెళ్లి చూసి భయంతో అమ్మో దెయ్యం అనుకుంటూ వణుకుతూ వస్తాడు. ఇంతలో లోపలి నుంచి ముఖం నిండా పప్పుతో మనోహరి రావడంతో మిస్సమ్మ నవ్వుతూ రాథోడ్ మనోహరి గారు వచ్చారు. అని చెప్తుంది. దగ్గరకు వచ్చిన మనోహరి కోపంగా మిస్సమ్మను తిడుతుంది. మొన్న ఆరు చీర కట్ చేసింది. ఇప్పుడేమో కుక్కర్ పేలేలా చేసింది. నేను వెళ్లాను కాబట్టి సరిపోయింది. లేకపోతే పిల్లలు వెళ్లి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తుంది. దీంతో శివరాం కోపంగా మనోహరినే తిడతాడు.
ఇంతలో అమర్ వస్తాడు. ఏం జరిగిందని అడుగుతాడు. కుక్కర్ ప్రెషర్ లో ఉందని మనోహరి తెలియకుండా ఓపెన్ చేసిందని చెప్పగానే అమర్ కూడా మనోహరినే చూసుకోవాలి కదా..? అంటాడు. దీంతో ఉదయం పాము వచ్చింది కదా? అదే కంగారులో వెళ్లి కుక్కర్ ఓపెన్ చేశానని చెప్తుంది. మనోహరి పాము అని చెప్పగానే నిర్మల, శివరాం, పిల్లలు భయపడతారు. అమర్ అవునని ఆ విషయంలో మిస్సమ్మకు అందరు థాంక్స్ చెప్పాలని నేను చెప్పాలనుకున్నాను అంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.