BigTV English

OTT Movie : ఆ పని అయ్యాక అబ్బాయి సైకో అని తెలిస్తే… క్లైమాక్స్ ట్విస్ట్ కు దిమ్మ తిరగాల్సిందే భయ్యా

OTT Movie : ఆ పని అయ్యాక అబ్బాయి సైకో అని తెలిస్తే… క్లైమాక్స్ ట్విస్ట్ కు దిమ్మ తిరగాల్సిందే భయ్యా

OTT Movie : డిజిటల్ మీడియా ఈరోజుల్లో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రిలీజ్ అవుతున్న సినిమాలు కొద్దిరోజుల్లోనే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలు ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తున్నాయి. థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న ఒక మూవీ ప్రస్తుతం ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)

ఇప్పుడు మనం చెప్పుకోబోయే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు “డౌన్” (Down). హీరోయిన్ ను ట్రాప్ చేసి ఆమెతో సరసాలాడి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకునే ఒక సైకో స్టోరీ తో మూవీ నడుస్తుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

జెనీఫర్ ఒక సాఫ్ట్ వేర్  కంపెనీలో పని చేస్తూ ఉంటుంది. మరుసటి రోజు వీకెండ్ కావడంతో, పైగా వాలెంటైన్ డే సందర్భంగా, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ను కలవడానికి ప్లాన్ చేసుకుంటుంది. కొన్ని కార్యనాల వల్ల అతనికి బ్రేక్ అప్ చెప్పి ఉంటుంది. ఆమె వెళ్తున్న లిఫ్ట్ లో గయ్ అనే వ్యక్తి కూడా వస్తాడు. ఇద్దరితో  మాత్రమే వెళ్తున్న లిఫ్ట్ సడన్ గా ఆగిపోతుంది. వీళ్ళు ఎంత ట్రై చేసినా ఆ లిఫ్ట్ ను ఓపెన్ చేయలేక పోతారు. ఫోన్లో సిగ్నల్స్ కూడా లేకపోవడంతో ఎవరైనా సాయం చేస్తారేమోనని అక్కడే నిరీక్షిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉంటారు. టాపిక్ సెక్స్ వరకు వెళుతుంది. ఇద్దరూ లవర్స్ తో ఒకసారి ఎంజాయ్ చేసామని చెప్పుకుంటారు. ఆ సమయంలో వీరిద్దరూ ఒకరితో ఒకరు ఏకాంతంగా గడుపుతారు. ఆ తర్వాత గయ్ జెనీఫర్ తో నిన్ను లవ్ చేస్తున్నానని చెప్తాడు. అందుకు ఆమె నా మనసులో నా బాయ్ ఫ్రెండ్ మాత్రమే ఉన్నాడని ఇప్పుడు జరిగింది మరచిపొమ్మని చెప్తుంది.

జెనీఫర్ మాటలకు బాధపడ్డ అతను, ఆమెను ఎంతలా లవ్ చేస్తున్నాడో తెలియజేయటానికి ఫోన్లో కొన్ని వీడియోస్ చూపిస్తాడు. ఆమె వెళ్తున్న ప్రతి ప్లేస్ ని షూట్ చేసి ఉంటాడు. లిఫ్ట్ ఆగిపోవడానికి కారణం ఇతనే అని జెనీఫర్ గ్రహిస్తుంది. పోలీసులకు చెప్తానని బెదిరించడంతో, ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. గయ్ ఆ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుంటాడు. మరొక సెక్యూరిటీ గార్డ్ వీరున్న చోటును చూసి కాపాడాలని వస్తుంటాడు. అతన్ని ప్లాన్ చేసి గయ్ చంపేస్తాడు. చివరికి జెన్నీఫర్ అతని నుంచి తప్పించుకొని బయటపడుతుందా? పోలీసులకు ఈ విషయం తెలుస్తుందా? గయ్ చివరికి ఏమవుతాడు? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “డౌన్” (Down) రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీని చూసి మూవీ లవర్స్ బాగా ఎంటర్టైన్ అవుతారు.

Related News

OTT Movie : గ్రామీణ నేపథ్యంలో మరో వెబ్ సిరీస్… పల్లెటూరి ప్రేమలు… బంగారు గాజులదే కీలక పాత్ర

OTT Movie : నాలుగు స్టోరీలతో కేక పెట్టిస్తున్న సినిమా … ఒక్కొక్కటి ఒక్కోరకం … ఉహకందని ట్విస్టులు

OTT Movie : మేడమ్ సార్ మేడమ్ అంతే… పెళ్లి వద్దంట, అది మాత్రమే ముద్దు… ఒకరి తరువాత ఒకరు

OTT Movie : స్టార్ నటుడి వెర్రి వేషాలు… నవ్వులు పూయిస్తున్న మళయాళ సినిమా… తెలుగులోనూ చూడొచ్చు

OTT Movie : ఆ ఇంట్లో అడుగుపెడితే చావు మేళం మోగినట్లే … సినిమా మొత్తం అరాచకమే … IMDbలో 9.1 రేటింగ్

OTT Movie : 7 నుంచి 17 ఏళ్ళున్న అమ్మాయిలే టార్గెట్… ఊహించని మలుపులు… థ్రిల్లింగ్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×