trinayani serial today Episode: గురువు గారు వచ్చి త్రినేత్రిని వివరాలు అడుగుతాడు. మీ అమ్మా నాన్న ఎవరు అని అడగ్గానే గుర్తుకు రావడం లేదని చెప్తుంది నేత్రి. ఇంతలో సుమన నాన్నంటే మన చిన్నప్పుడే పోయారు. అమ్మ పేరు కూడా చెప్పకపోతే ఎలా అక్కా అని అడుగుతుంది. దీంతో నయనికి గుర్తుకు లేదు అంటే ప్రమాదం జరగక ముందు ఉన్న గతం జ్ఞాపకం లేదని విశాల్ అంటాడు. దీంతో గురువు గారు నయనికి తెలుసు కానీ త్రినేత్రికి తెలియదు విశాల అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఏం చేయాలో చూచయాగా అర్తం అయిందంటారు గురువు గారు.
ఏం చేస్తారో త్వరగా చేయండి గురువు గారు అంటుంది దురందర. ఇంతలో హాసిని.. చెల్లి నువ్వు జుట్టు ఆరబెట్టుకో అని చెప్పగానే సరేనని లోపలికి వెళ్లిపోతుంటే తిలొత్తమ్మ ఆగు నీ సంగతి గురువు గారు చూసే వరకు ఎక్కడికి వెల్లొద్దని అంటుంది. నన్ను ఇలా విసిగిస్తే నీ సంగతి చూడాల్సి వస్తుంది అని తిలొత్తమ్మను హెచ్చరిస్తుంది నేత్రి. మొన్న ఇలాగే నన్ను కొట్టింది అని సుమన అడగ్గానే ఎందుకు కొట్టావమ్మా అంటూ గురువు గారు అడగ్గానే నా తలకు దెబ్బ తగిలిందని చెత్త వాగుడు వాగితే ఒక్కటి ఇచ్చాను. అని చెప్తుంది. ఏం చేస్తారో మీరే చేయండి స్వామి అని వల్లభ అడగ్గానే పది నిమిషాలు టైం ఇస్తే చెప్పేస్తానని గురువుగారు అంటారు. నేత్రిని తీసుకుని లోపలికి వెళ్తుంది హాసిని.
తర్వాత తిలొత్తమ్మ, వల్లభ సీరియస్‌గా ఆలోచిస్తుంటారు. గురువు గారి మనసులో ఏముందో ఎవరికి తెలుసు అని అడుగుతాడు వల్లభ. దీంతో గురువు గారు ఏం చేయబోతున్నారో కొంచెమైనా గెస్ చేయాలి వల్లభ అంటుంది తిలొత్తమ్మ. ఆయన మాటలే అర్తం కావు ఇక ఆయన చేతలు ఎలా తెలుసుకుంటామంటాడు వల్లభ. దీంతో వల్లభను పిచ్చ తిట్టుడు తిడుతుంది తిలొత్తమ్మ.
మహానుభావుడు ఆయన దివ్యదృష్టితో చూస్తారు ఆయన అని తిలొత్తమ్మ చెప్పగానే.. నాకు అర్థం అయింది మమ్మీ మనకు తిక్క పట్టిస్తున్న ఆ అందగత్తెను ఏం చేయాలో చెప్పు అని అడుగుతాడు వల్లభ. ఏం చేస్తావని తిలొత్తమ్మ అడగ్గానే.. ఏమైనా చేస్తానని ఫోటోలు తీసి పోలీసులకు కంప్లైంట్ చేస్తాను అంటాడు వల్లభ. అయితే పోలీసులు ఎంట్రీ అయితే మన బండారం కూడా బయట పడుతుందని చెప్తుంది తిలొత్తమ్మ. వల్లభ భయపడతాడు. మనం ఇప్పుడు ఏం చేయాలని అడుగుతాడు. దీంతో గురువు గారు ఏం చేస్తారో తెలుసుకోవాలని చెప్తుంది తిలొత్తమ్మ.
ముక్కోటి పరుగెత్తుకుంటూ వెళ్తుంటాడు. పోలీస్ కారు ఎదురు రావడంతో కళ్లు మూసుకుని అమ్మో చచ్చానురోయ్ అంటూ అరుస్తాడు. అలాగే నిలబడి వణికిపోతుంటాడు. వెనక నుంచి వచ్చిన బామ్మ కూడా పోలీసు ఆయన ఎదరొచ్చారు. నేత్రి గురించి వెతకమని ఆయనకు చెప్పాలి అనుకంటూ దగ్గరకు వస్తుంది. ఆ పోలీస్ ముక్కోటిని మూడు రోజుల క్రితం ఈ ఊరిలో ఒక యాక్సిడెంట్ జరిగింది. దాని గురించి నీకు ఏమైనా తెలుసా? అని అడుగుతాడు. తెలియదని ముక్కోటి చెప్పగానే పోలీస్ వెళ్లిపోతాడు. ఇంతలో దగ్గరకు వచ్చిన బామ్మ నేత్రి గురించి వెతకమని చెబుదామని వచ్చే లోపు ఆయన వెళ్లిపోయారని అంటుంది. నేత్రి చనిపోయిందని చెప్తే వినవా నువ్వు అంటూ ముక్కోటి అనగానే ముక్కోటిని తిట్టి బామ్మ వెళ్లిపోతుంది.
హాల్లో గురువు గారు జపం చేసుకుంటూ ఉంటారు. అందరూ ఆయన్ని చూస్తూ ఉంటారు. ఇంతలో తిలొత్తమ్మ, వల్లభ వస్తారు. ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు అని అడుగుతుంది తిలొత్తమ్మ. ఇంతలో గురువుగారు కళ్లు తెరచి చూస్తూ నయనిని రమ్మనండి అని చెప్తాడు. దీంతో సుమన నయని అక్కా అని పిలుస్తుంది. కానీ పలకదు. త్రినేత్రి అని పిలవండి వస్తుంది అని గురువు గారు చెబితే నేను పిలవను అంటుంది సుమన. విశాల్ నయని అని పిలవగానే నేత్రి కిందకు వస్తుంది. రాగానే గురువుగారు ఏం చేసినా ఏం మాట్లాడిన ఏమీ అనకూడదు అని చెప్తాడు.
సరేనని చెప్తుంది నేత్రి. దీంతో గురువు గారు నీ ఇష్టదైవం అయిన అమ్మవారి మీద ఒట్టు వేసి చెప్పమని అడుగుతాడు. సరేనని నా పేరు చెప్పాను ఇక ఎవరు అంటే ఏమి చెప్పగలను స్వామి పెళ్లీడుకు వచ్చిన 21 సంవత్సరాల అమ్మాయిని అని కచ్చితంగా చెప్పగలను అంటుంది. దీంతో సుమన 4 సంవత్సరాలు తగ్గించి చెప్తావేంటి అక్కా అని అడుగుతుంది. మాట దాయోచ్చు కానీ వయసు కప్పేయలేము కదా.. అంటుంది నేత్రి. దీంతో నయని చెప్పిందే నిజం అంటాడు స్వామి. స్వామి మాటలకు అందరూ షాకింగ్ గా చూస్తారు.
ఇంతలో స్వామి గాయత్రి దేవి గురించి అడిగిన విషయాలు తెలియదు అంటుంది నేత్రి. ఇంతలో పెద్దమ్మను నువ్వే కన్నావు పెద్ద మరదలా..? అని వల్లభ అంటే పళ్లు రాలగొడతాను అంటుంది నేత్రి. హాసిని నేత్రి గురించి మాట్లాడుతుంటే నీకు కూడా పిచ్చి పట్టిందా..? అని తిలొత్తమ్మ అడుగుతుంది. హాసిని అన్నది నిజం అని స్వామి చెప్తాడు. ఇంతటితో ఇవాళ్టి త్రినయని ఎపిసోడ్ పూర్తయిపోతుంది.