BigTV English

Trinayani Serial Today November 4th: ‘త్రినయని’ సీరియల్‌:  తనపై విష ప్రయోగం జరుగుతుందన్న నయని – నయనికి పిచ్చి ముదిరిందన్న తిలొత్తమ్మ

Trinayani Serial Today November 4th: ‘త్రినయని’ సీరియల్‌:  తనపై విష ప్రయోగం జరుగుతుందన్న నయని – నయనికి పిచ్చి ముదిరిందన్న తిలొత్తమ్మ

trinayani serial today Episode:  హాల్లో కూర్చున్న తిలొత్తమ్మ, సుమన నెయిల్‌ పాలీస్‌ పెట్టుకుంటుంటే.. హాసిని వచ్చి మీకేమైనా పిచ్చా అంటూ తిడుతుంది. ఎందుకని వల్లభ అడగ్గానే తినే టైంకు నెయిల్ పాలీస్‌ పెట్టుకోవడం ఏంటని అడుగుతుంది. ఏయ్‌ మా మమ్మీకి నేను తినిపిస్తాను అంటాడు వల్లభ. ఇంతలో సుమన మాత్రం నేను తినను అంటుంది. దీంతో హాసిని అంత స్పీడుగా కమిట్‌ కాకు చెల్లి.. ఎందుకంటే నయని చాలా గుమగుమలాడే వంటకాలు చేసింది అని చెప్తుంది హాసిని. దీంతో అదేంటి నయని వంటలు చేస్తూ ఇంట్లో ఉందా? షాపింగ్‌ కు వెళ్దాం అన్నారు కదా? అంటుంది తిలొత్తమ్మ. ఇప్పుడు ఎలా వెళ్తారు. టైం ఎనిమిది అవుతుంది అంటాడు విక్రాంత్.


ఇంతలో నయని విశాల్‌ అక్కడికి రాగానే సుమన కోపంగా తిడుతుంది. దీంతో నయని ఏంటక్కా మా చెల్లి అలా మాట్లాడుతుంది అని హాసినిని అడుగుతుంది. దీంతో చాలా అప్‌ సెట్‌ అయినట్టుంది అంటుంది. ఇంతలో పావణమూర్తి ఎందుకు తిట్టుకోవడం ఇప్పడు వెళ్దాం పదండి అంటాడు. దీంతో నయని ఇప్పుడు వెళ్లినా గంట కన్నా ఎక్కువ సమయం ఉండదు బాబాయ్ అని చెప్తుంది. ఇంతలో సుమన మా ఆక్క ఉద్దేశం అర్తం కావడం లేదు. రేపైనా సరే మనం ఇల్లు దాటం అనగానే ఎందుకని పావణమూర్తి అడుగుతాడు. ఎందుకంటే రేపు పులి వస్తుంది కదా? అనగానే వల్లభ ఆడపులా.. మగపులా..? అని భయపడతాడు. దీంతో హాసిని వెటకారంగా వల్లభ మీద సెటైర్‌ వేస్తుంది.

ఇంతలో సుమన మీరు ఎప్పుడైనా వెళ్లండి నేను మాత్రం రానని అంటుంది. ఎందుకని విక్రాంత్‌ అడగ్గానే మా అక్కకు గండం వచ్చాక ఇక పండగేం ఉంటుంది అంటుంది. ఇంతలో సుమన తల మీద ప్లవర్‌ వాజ్‌ పడుతుంది. ఎవరు కొట్టారు అని అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు. ఇంతలో గాయత్రి పాప ప్లవర్‌ వాజ్‌ తీసుకుని వస్తుంది. ది గ్రేట్‌ గాయత్రి దేవి అలియాస్ గాయత్రి పాప అని హాసిని అంటుంది. సరేలే సుమనకు ఏమీ కాలేదు కదా.. ఇక అంత కన్నా హ్యాపీ ఏంటంటే నయనికి వచ్చే కల ఏదీ నిజం కాదని తెలుస్తుంది. నయనికి విశాలాక్షి అమ్మవారు అందించే దివ్యదృష్టి ఇక లేనట్టే అంటుంది తిలొత్తమ్మ. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంకా త్రినయని అనే  పేరుకు సార్థకత ఉందని నటిస్తున్నట్టు ఉంది అంటుంది.


దీంతో హాసిని ఏంటి మీరు మాట్లాడేది అంటుంది. దీంతో వల్లభ నువ్వాగవే..? మమ్మీ చెప్పింది నూటికి నూరు శాతం నిజం. రెండు వారాల నుంచి తను చెప్పింది ఏదీ జరగలేదు. ఏదైనా జరిగింది అంటే గాయత్రి పాపే గాయత్రి దేవే అని చెప్పకపోవడం అంటాడు వల్లభ. మా ఆయన చెప్పేసి ఉంటే మనకు ఎప్పుడో తెలిసేది అత్తయ్యా అంటుంది సుమన. ఇప్పుడు కూడా నయని నాకు గండం. నా ప్రాణాలకు హాని ఉందని చెప్తుంటే.. సుమన అన్నట్టు ఎవరి కోసం తను ఇలా నాటకం ఆడుతున్నట్లు అంటుంది తిలొత్తమ్మ. దీంతో మీరెందుకు నామాట నమ్మడం లేదు నాకు అర్థం కావడం లేదు అంటుంది నయని. చూడక్కా నీకు ఒంట్లో బాగా లేకపోతే మంచి డాక్టర్‌ కు చూపించుకో అంతే కానీ చిన్నపిల్లలాగా నటించకు. గాయత్రి అత్తయ్యే గాయత్రి పాప అని తెలిసినప్పటి నుంచి నువ్వు ఇలా నటిస్తున్నావేమో..ఇది వెర్రి ఆనందమో.. నిజంగా పిచ్చో కూడా తెలియడం లేదు అని సుమన అనగానే ఊరుకోమ్మా నువ్వు.. మల్లీ ఏం వచ్చి నీ నెత్తి మీద పడుతుందో ఏమో అంటాడు పావణమూర్తి.

ఇంతలో నయనికి కల వస్తుంది. అందులో త్రినేత్రి ప్రసాదం తిని చనిపోయినట్టు కనిపిస్తుంది. దీంతో విశాల్‌ నయని ఏం జరిగింది అని అడుగుతాడు. దీంతో విష ప్రయోగం జరుగుతుంది. అమ్మవారి విగ్రహం ముందు ప్రసాదం తినడంతో నేను చనిపోయినట్టు కల వచ్చిందని నయని బాధపడుతుంది. ఈసారి విషప్రయోగం చేసి నా ప్రాణాలు తీస్తున్నారు. గాయత్రి పాప నాఉక ఏమైనా అయితే నాన్నని చెల్లిని నువ్వే చూసుకోవాలి తల్లి అంటూ ఏడుస్తుంది. అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు. నయని ఏడుస్తూ లోపలకి వెళ్లిపోతుంది. వల్లభ మాత్రం పెద్దమరదలును చూస్తుంటే జాలేస్తుంది అంటాడు. తిలొత్తమ్మ అమాయకంగా విశాల్‌ సారీ నయనికి పిచ్చే వెంటనే చూపించకపోతే చాలా కష్టం నాన్నా అని చెప్తుంది. విశాల్‌ కోపంగా చూస్తుంటాడు.

తర్వాత తిలొత్తమ్మ, వల్లభ కలిసి నయని గురించి మాట్లాడుకుంటుంటారు. ఒకేసారి ఒక్కరికే ఇన్ని గండాలు ఎలా వస్తాయి అని తిలొత్తమ్మ చెప్తుంది. అది అమ్మవారి ప్రసాద్‌ తింటే చనిపోయినట్టు కల ఎలా వస్తుంది అంటుంది. దీంతో అసలు కాపాడే అమ్మవారే ఎలా చంపేస్తారు అని వల్లభ అడుగుతాడు. మరోవైపు ముక్కోటి చాప దుప్పటి తీసుకుని బయటకు వెళ్తుంటే బామ్మ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అంటూ తిడుతుంది. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Big Stories

×