Nindu Noorella Saavasam Serial Today Episode : కలకత్తాకు తాను వెళ్లనని ఇక్కడ నువ్వు ఉన్నా కూడా వాడు నన్ను చంపాలనుకున్నాడంటే అక్కడికి వెళ్లే వాడికి నన్ను చంపడం ఇంకా ఈజీ అవుతుందని మనోహరి భయపడట్టు నాటకం ఆడుతుంది. అయితే ఇక్కడే ఉండు కానీ ఇంట్లోంచి బయటకు వెళ్లొద్దు అని అమర్ చెప్పగానే సరేనని బయటకు అసలు వెళ్లనని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది మనోహరి.
పిల్లల గురంచి ఆలోచిస్తున్న మిస్సమ్మ తిన్నారో లేదోనని.. ఎలా ఉన్నారోనని ఆలోచిస్తూ నిర్మలకు ఫోన్ చేస్తుంది. పిల్లల గురించి అడుగుతుంది. శివరాం గురించి అడుగుతుంది. అందరి బాగోగులు అడుగుతుంటే నిర్మల, శివరాం బాధగా వింటుంటారు. వాళ్లు ఏమీ మాట్లాడకపోయే సరికి హలో అత్తయ్యా వినబడుతుందా..? అని అడుగుతుంది మిస్సమ్మ. ఇంతలో శివరాం.. వినబడటం లేదు మిస్సమ్మ మా మీద నీకున్న ప్రేమ కనబడుతుంది. నీ మంచి మనసుకు ఈ ఇల్లు గుడి కట్టాల్సింది పోయి. నిన్ను అవమానించి ఇంట్లోంచి బయటకు పంపించింది. అంత ధ్వేషిస్తున్నా… ఇంతలా ఎలా ప్రేమిస్తున్నావు మిస్సమ్మ అని అడుగుతాడు.
దీంతో మిస్సమ్మ అదేంటి మామయ్యా నేనేదో గొప్ప పని చేసినట్టు మాట్లాడుతున్నారు. నా కుటుంబం నాకేదో ఇస్తుందని ప్రేమిస్తామా..? ఒక మాట అన్నారని వదిలేస్తామా..? మన అనుకుంటేనే కదా మామయ్యా మనసు విప్పి మాట్లుకునేది. పిల్లలు తిన్నారా..? మామయ్య అని అడుగుతుంది. దీంతో ఆ విషయం గురించి ఏం అడుగుతావులే మిస్సమ్మ అంటూ నిట్టూరుస్తాడు శివరాం. ఇంతలో నిర్మల నీ చేతి వంట తిని నాలుకకు నా వంట రుచించటం లేదు మిస్సమ్మ అని చెప్తుంది. ఇంతలో అమర్ హాల్లోకి వచ్చి నిర్మలను పిలుస్తాడు. అమర్ మాటలు విన్న నిర్మల మళ్లీ ఫోన్ చేస్తాను అమర్ పిలుస్తున్నాడని చెప్పగానే ఫోన్ ఆన్ లో పెట్టండి అత్తయ్యా ఆయన మాటలైన వింటాను అని మిస్సమ్మ అడగ్గానే సరేనని ఫోన్ అలాగే తీసుకుని వెళ్లి డైనింగ్ టేబుల్ మీద పెట్టి మాట్లాడుతుంది నిర్మల. ఫోన్ లో అమర్ మాటలు వింటున్న మిస్సమ్మ ఎమోషనల్ గా ఫీలవుతుంది.
పిల్లలకు టిఫిన్ బాక్స్ రెడీ చేసి రామ్మూర్తి ఇస్తుంది. తీసుకెళ్లి పిల్లలకు స్కూల్ లో తినిపించమని చెప్తుంది. నేను వెళ్లి తినిపిస్తాను కానీ నిన్నటి నుంచి నువ్వు ఏమీ తినలేదు ఇప్పుడైన కాస్త తిను తల్లి అని రామ్మూర్తి చెప్పగానే పిల్లలు తినే వరకు నేనేమీ తినను నాన్న అంటుంది మిస్సమ్మ. అయితే పిల్లలు ఏమైనా తింటున్నారేమో రాథోడ్ కు ఫోన్ చేసి కనుక్కోమని రామ్మూర్తి చెప్పగానే మిస్సమ్మ రాథోడ్ కు ఫోన్ చేస్తుంది. పిల్లలు స్కూల్ కు బయలుదేరారా..? అని అడుగుతుంది. లేదని రాథోడ్ చెప్పగానే అక్కడి పరిస్తితి ఏంటని అడుగుతుంది. ఉన్న పరిస్తితి చెప్తాడు రాథోడ్. దీంతో నేను నాన్నతో పిల్లలకు బాక్స్ పంపిస్తున్నాను వాళ్లు బయట ఎక్కడా తినకుండా స్కూల్ కు తీసుకెళ్లు అని చెప్తుంది మిస్సమ్మ. రాథోడ్ సరే అంటాడు. ఇంతలో మంగళ కోపంగా రామ్మూర్తికి అడ్డుపడి ఇంట్లో మనం తినడానికి తిండి లేదు కానీ బయట వాళ్లకు పెడుతున్నావా..? అంటూ అడ్డుపడుతుంది. దీంతో రామ్మూర్తి అంతే కోపంగా మంగళను తిట్టి క్యారియర్ తీసుకుని వెళ్లిపోతాడు.
వాకింగ్ కు వెళ్లి ఇంటికి వచ్చిన శివరాం ఇంట్లో మిస్సమ్మ లేని లోటు చూసి బాధపడతాడు. రూంలోంచి బయటకు వచ్చి శివరాంను చూసిన మనోహరి ఇంట్లో అది ఒక్కరోజు లేకపోవడంతో చాలా బాదపడతున్నాడు అనుకుంటుంది. శివరాం తన గదిలోకి వెళ్లి బాధపడుతుంటే నిర్మల వచ్చి ఓదారుస్తుంది. ఇంతలో హాల్ లోకి వచ్చిన అమర్ గట్టిగా మిస్సమ్మ కాఫీ అంటూ పిలుస్తాడు. అలా రెండు మూడు సార్లు పిలిచిన తర్వాత మిస్సమ్మ లేదన్న విషయం గుర్తు చేసుకుని మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో హాల్ లోకి వచ్చిన శివరాం రాథోడ్ ను పిలిచి మన ఇంట్లో మిస్సమ్మ లేదు కదా..? ఒక వంట మనిషి కావాలి. అలాగే ఒక పనిమనిషి కావాలి. పిల్లలకు ఒక కేర్ టేకర్ కూడా కావాలి. మంచి వాళ్లను చూడు. లేదంటే ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తూ.. అలాగే నాకు నా భార్యకు వయసైపోయింది కదా..? మమ్మల్ని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ ను కూడా చూడు అని చెప్పగానే రాథోడ్ ఒకే సార్ చూస్తాను..
అంటూ ఒక్క మిస్సమ్మ లేకపోతే ఇంత మంది అవసరం ఉందని బయట పడింది సార్ అంటాడు. దీంతో అవును ఇన్ని రోజులు తను ఈ ఇంటిని పట్టించుకుంది కాబట్టి. మనం పట్టించుకునే అవసరం రాలేదు కాబట్టి నువ్వు మంచి మనుషులను చూడు అని శివరాం చెప్తుండగానే అమర్ వెంటనే లేచి రాథోడ్ పిల్లలను రెడీ చేయ్ స్కూల్ లో మనమే డ్రాప్ చేసి వెళ్దాం అంటాడు. రాథోడ్ సరే అనగానే అమర్ వెళ్లిపోతాడు. ఏంటి సార్ మనం ఇంత మొత్తుకున్నా మీ అబ్బాయి ఏమీ విననట్లు వెళ్లిపోయారు అంటాడు రాథోడ్. వాడు విననట్టు వెళ్లిపోయాడు అంటేనే మనసులో పెట్టుకున్నాడు అని అర్థం అంటాడు శివరాం. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.