Rice Water For Hair: ప్రస్తుత రోజుల్లో చాలా మంది జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్నారు. ఇందుకోసం బయట మార్కెట్లో రకరకాల షాంపులు, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. అయితే ఇవన్ని కెమికల్స్‌తో తయారయి ఉంటాయి కాబట్టి వాటివల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా జుట్టును మహిళలు ఒక కిరీటం లాగా భావిస్తుంటారు. జుట్టు పొడవుగా, ఊడిపోకుండా ఉండేందుకు అనేక రకాల టిప్స్ ఫాలో అవుతుంటారు. అయిన ఫలితం ఉండదు. కాబట్టి మన ఇంట్లోనే దొరికే నాచురల్ పదార్ధాలతో ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే.. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ కనిపిస్తాయి.
జుట్టుకి గంజి అప్లై చేశారంటే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. జుట్టు రాలడాన్ని ఆపేందుకు గంజి బాగా ఉపయోగపడుతుంది. ఏంటి గంజి జుట్టు రాలిపోకుండా ఉండేందుకు సహాయపడుతుందా అని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు విన్నది నిజమే.. జుట్టు సంరక్షణకు గంజి ఉపయోగపడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఎందుకంటే గంజిలో “ఇనోసిటాల్ కాంపౌండ్” ఉంటుందట. ఇది జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది పలువురు నిపుణులు చెబుతున్నారు.
ఈ పరిశోధననలను ఇటీవల బ్యూటీ కేర్ లాబరేటరీస్ యొకోమా అనే జపాన్ సైంటిస్టులు కనుగొన్నారు. సాధరణంగా గంజి అన్నం వార్చినప్పుడు వస్తుంది. పూర్వం రోజుల్లో గంజి పోసుకుని అన్నం తినే వాళ్లు. గంజిలో విటమిన్ బి, అనేక పోషకాలు ఉంటాయి. ఇది ఈరోగ్యానికి చాలా మంచిదని అందరికి తెలుసు. గంజితో తినడం, బట్టలకు ఉపయోగించడమే తెలుసు కానీ జుట్టుకు కూడా అప్లై చేయవచ్చని అంతగా తెలీదు. అయితే గంజిని జుట్టుకు కూడా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
తయారు చేసుకునే విధానం..
అన్నం వండేటప్పుడు గంజిని వార్చిన తర్వాత.. దాని మళ్లీ చిక్కగా అయ్యేలా బాగా ఉడికించాలి.. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసి.. ఆరేంత వరకు ఉంచాలి. ఈ గంజిలో ఉండే ఇనోసిటాల్ కాంపౌండ్ అనే కెమికల్.. జుట్టు కుదుళ్ల మీద డైరక్ట్‌గా పని చేసి జుట్టు రాలిపోకుండా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గంజిని జుట్టుకు పట్టించి బాగా ఆరిన తర్వాత తలస్నానం చేయండి. దీని వల్ల ఎంలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
Also Read: బరువు పెరగాలనుకుంటున్నారా ? అయితే ఇవి త్రాగండి
గంజిని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు బాగా సిల్కీగా మారుతుంది. జుట్టు చివర్ల చిట్లిపోకుండా ఉండేందుకు చాలా బాగా పనిచేస్తుంది. గంజి ఎక్కువగా జిగురుని కలిగి ఉంటుంది ఇది జుట్టుకు స్మూత్‌గా ఉండేలా చేస్తుంది. గంజిని ప్రతిరోజు అప్లై చేయవచ్చు. జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా జుట్టుకు గంజి అప్లై చేయండి, మంచి ఫలితం ఉంటుంది.
దీంతో పాటు.. బియ్యం కడిగిన నీళ్లను జుట్టుకు అప్లై చేసిన మంచి ఫలితం ఉంటుంది. బియ్యం నీళ్లతో జుట్టుకు అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్యలు తొలగిపోతాయి.