BigTV English

Jewel Thief Movie Review : ‘జ్యూవెల్ థీఫ్’ మూవీ రివ్యూ

Jewel Thief Movie Review : ‘జ్యూవెల్ థీఫ్’ మూవీ రివ్యూ

మూవీ : జ్యూవెల్ థీఫ్ – Beware of Burglar
విడుదల తేదీ : 8 నవంబర్ 2024
డైరెక్టర్ : పీఎస్ నారాయణ
నటీనటులు : కృష్ణసాయి, మీనాక్షీ జైస్వాల్, అజయ్ తో పాటు తదితరులు
నిర్మాత : మల్లెల ప్రభాకర్


Jewel Thief Movie Rating – 2/5

Jewel Thief Movie Review : ప్రతి జోనర్ లో వచ్చే సినిమాలకి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. కొందరు లవ్ స్టోరీస్ ఇష్టపడితే, ఇంకొందరు ఫ్యామిలీ స్టోరీస్, మరికొందరు హర్రర్ స్టోరీస్ ఇష్ట పడుతూ ఉంటారు. అలానే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌లంటే మూవీ ల‌వ‌ర్స్‌కు ఎంతో ఇష్టం. సరైన కంటెంట్ తో ఆ సినిమా వస్తే ప్రేక్షకులు దానిని విపరీతంగా ఆదరిస్తారు. అదే మాదిరిగా వ‌చ్చిన చిత్రం “జ్యూవెల్ థీఫ్ – Beware of Burglar”. తాజాగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. పి. ఎస్. నారాయణ దర్శకత్వం వహించగా, మల్లెల ప్రభాకర్ నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. ఎం. ఎం. శ్రీలేఖ సంగీతాన్ని అందించారు. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలను ఎంత మేరకు అందుకుందో రివ్యూ లో చూద్దాం.


కథ :
సిన్సియర్ ట్రావెల్స్ ఓనర్ కృష్ణ (కృష్ణసాయి) వ‌జ్రాలు, బంగారం న‌గ‌లు దొంగిలిస్తుంటాడు. శివారెడ్డితో క‌లిసి దొంత‌నాలు చేస్తూ వ‌చ్చిన డ‌బ్బుల‌తో అనాథ పిల్ల‌ల‌కు పంచిపెడ‌తాడు. నేహ (నేహ‌) నెక్లెస్ కూడా దొంగిలిస్తాడు. ప‌ట్టుబ‌డి జైలుకు వెళ్లి వ‌స్తాడు. కృష్ణ గురించి అస‌లు విష‌యం తెలుసుకుని ప్రేమిస్తుంది. ఇదే క్ర‌మంలో ఒక కండీష‌న్ పెడుతుంది. మోసం చేయకుండా, జూదాం ఆడకుండా 6 నెలల్లో 15 లక్షలు సంపాదించి ఫ్రూవ్ చేసుకోవాల‌ని చాలెంజ్ పెడుతుంది. ఈ క్ర‌మంలో ధ‌నిక కుటుంబానికి చెందిన అనారోగ్యంగా ఉన్న వ్య‌క్తికి ప‌నులు చేస్తూ, అత‌డిని బాగు చేస్తాడు. కానీ, అనారోగ్యంగా ఉన్న వ్య‌క్తిని చంపిన‌ట్టు హ‌త్య కేసులో ఇరుక్కుంటాడు. న‌మ్మించి భారీ దెబ్బ కొడ‌తారు. ఇంత‌కీ కృష్ణను మోసం చేసింది ఎవ‌రు? ఊహించ‌ని చిక్కుల్లో ఎలా ఇరుక్కుంటాడు? హ‌త్య కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌తాడా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన పి. ఎస్. నారాయణ ఈ త‌రం ప్రేక్షకులకు న‌చ్చే సినిమాను అందించారు. త‌ను రాసుకున్న‌ కథను ఆక‌ట్టుకునే రీతిలో తెరపై ఆవిష్కరించారు. ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం, ఇటీవల విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. బ్యాంకాక్‌లో చిత్రీకరించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొత్తం మీద అన్ని విభాగాల్లో సరైన నాణ్యత కనిపిస్తోంది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే కిక్, ఊపిరి వంటి సినిమా ఛాయలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. సినిమాలో హీరో కృష్ణసాయి తన పాత్రలో మంచి నటన కనబరిచారు. ఈ సినిమాతో ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుంటారు. కృష్ణ సాయి డాన్స్, మేనరిజమ్స్, హెయిర్ స్టైల్ అన్ని ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాలలో సూపర్ స్టార్ కృష్ణ పోలికలతో కనబడతారు. ఫైటింగ్ సీన్లలో ఇరగదీసాడు. ఇక హీరోయిన్ మీనాక్షి జైస్వాల్ గ్లామ‌ర్ ఆండ్ ఫ‌ర్మార్మెన్స్‌తో ఆకట్టుకుంది. సీనియర్ నటీనటులు ప్రేమ, అజయ్ క‌థ‌కు త‌గిన‌ట్టుగా త‌మ పాత్రలలో ఒదిగిపోయారు. ఇక‌ “30 ఇయర్స్” పృథ్వి, శివారెడ్డి టైమింగ్‌తో న‌వ్విస్తుంటారు. శ్రావణి, శ్వేతా రెడ్డి తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేసారు.

ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన ఎం ఎం శ్రీలేఖ ఈ సినిమాకి కూడా సంగీతం అందించారు. ఈ సినిమాకి ఎం.ఎం. శ్రీలేఖ అందించిన సంగీతం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. బ్యాక్ గ్రాండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రాఫర్ అడుసుమిల్లి విజయ్ కుమార్ విజువల్స్ అందంగా చూపించారు, ఎడిటర్ జేపీ పనితీరు పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఫైటర్ మాస్టర్ మార్షల్ రమణ రూపొందించిన స్టంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

మొత్తంగా… సస్పెన్స్ థ్రిల్లర్ ను ఇష్టపడే ప్రేక్షకులు ఓ సారి చూడొచ్చు.

Jewel Thief Movie Rating – 2/5

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×