Nindu Noorella Saavasam Serial Today Episode : బాబ్జీ ఫోన్ లో వార్నింగ్ ఇవ్వగానే అమర్ అలర్ట్ అవుతాడు. వెంటనే ఆఫీసుకు ఇన్ఫామ్ చేసి బాబ్జీ ఫోన్ ను ట్రేస్ చేయమని రాథోడ్ కు చెప్తాడు. మనోహరి ఇంటికి వెళ్లే వరకు ఆమె ఫోన్ ను కూడా ట్రేస్ చేయమని చెప్తాడు. రాథోడ్ ఆఫీసుకు ఫోన్ చేసి మాట్లాడుతూ.. ఇది మనోహరి ప్లానే అయ్యుంటుంది అనుకుంటాడు. వెంటనే ఫోన్ కట్ చేసి సార్ బాబ్జీ ఫోన్, మనోహరి మేడం ఫోన్ ఒకే లోకేషన్ లో ఉన్నాయని చెప్తున్నారు అని చెప్పగానే అమర్ షాక్ అవుతాడు. అసలు మనోహరి ఎక్కడ ఉన్నట్లు ఇద్దరు ఒకే దగ్గర ఉండటం ఏంటి? అని ఆలోచిస్తుంటాడు.
స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన రామ్మూర్తి మంగళను పిలిచి క్యారియర్ బాక్స్ ఇస్తాడు. తీసుకెళ్లి శుభ్రంగా కడగమని చెప్తాడు. మంగళ అలాగే చూస్తుండిపోతుంది. దీంతో రామ్మూర్తి కోపంగా నా ముఖం చూస్తున్నావేంటి అని అడుగుతాడు. దీంతో మంగళ నీ ముఖం కూడా పక్కకు తిప్పి చూస్తే నేను ఇక్కడ ఎందుకు ఉన్నానో నీకు అర్తం అవుతుంది అని అంటుంది. దీంతో రామ్మూర్తి పక్కకు తిరిగి చూస్తాడు. మిస్సమ్మ ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. కంగారుపడుతూ రామ్మూర్తి మిస్సమ్మ దగ్గరకు వెళ్లి విషయం కనుక్కుంటాడు. మిస్సమ్మ ఏడుస్తుంటే ఓదారుస్తాడు.
నువ్వేమి బాధపడకు అమ్మా.. అది నీ ఇల్లు, నీ కాపురం మనస్పర్థలు లేని కాపురాలు ఉండవమ్మా.. వాటిని దాటుకుని ముందుకు ఎలా వెళ్లాలో ఆలోచించాలి. ఈరోజు పొమ్మన్న బాబుగారే రేపు రమ్మంటారు చూడు. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి అని మిస్సమ్మకు భరోసా ఇస్తాడు. దీంతో మిస్సమ్మ సరే నాన్నా.. అంటూ నాకు ఇంతసేపు చాలా భయమేసింది నాన్నా అనగానే రామ్మూర్తి నవ్వుతూ.. ఎందుకు తల్లి భయం అయినా నువ్వు ఏడ్చి ఈ నాన్నను కూడా ఏడ్పించావు. కొద్ది రోజులు పోతే అన్ని సర్ధుకుంటాయి తల్లి అంటాడు. ఇంతలో మిస్సమ్మ రామ్మూర్తి తీసుకొచ్చిన క్యారియర్ చూసి ఇదేంటి నాన్నా అని అడుతుంది.
ఆ మాటకు షాక్ అయిన రామ్మూర్తి వెంటనే తేరుకుని పొద్దస్తమానం ఇంట్లో ఉండలేకపోతున్నానమ్మా.. అందుకే అలా బయటకు వెళ్లి పార్కులో కొద్దిసేపు కూర్చుని మధ్యాహ్నం అక్కడే తిని కొద్దిసేపు అక్కడే నిద్రపోయి వస్తున్నానమ్మా అని చెప్తాడు. సరేనమ్మా నీకు రాత్రిని ఏం కావాలో చెప్పు తీసుకొస్తాను అని ఏమోయ్ అమ్మాయికి ఇష్టమైన వంటలు చేయ్ అంటూ బయటకు వెళ్లిపోతాడు రామ్మూర్తి. విషయం తెలిస్తే ముసలోడు గుండె పగిలి చనిపోతాడనుకుంటే ఇంత ఉల్లాసంగా ఉన్నాడేంటి అని మనసులో అనుకుంటుంది మంగళ. బయటకు వెళ్లిన రామ్మూర్తి చెట్టు చాటుగా నిలబడి మిస్సమ్మ గురించి తలుచుకుని ఏడుస్తుంటాడు.
బాధపడుతూ గుప్త దగ్గరకు వస్తుంది ఆరు. ఆమెను గమనించిన గుప్త ఏమైంది బాలిక అని అడుగుతాడు. దీంతో ఆరు ఇల్లంతా బోసి పోయింది గుప్తగారు. మిస్సమ్మ ఉంటే ఇల్లంతా ఎంత హడావిడిగా ఉండేది. మిస్సమ్మ వెళ్లి 24 గంటలు కూడా కాలేదు. అప్పుడే మిస్సమ్మ లేని వెలితి అందరి ముఖాల్లోనూ కనిపిస్తుంది అని ఆరు చెప్తుంది. దీంతో గుప్త నిజమే బాలిక. నీ కుంటుంబము నీవు లేవన్న విషయం తెలిసిన క్షణములో ఎంత బాధపడ్డారో ఇప్పుడు అలాగే ఉన్నారు అంటాడు గుప్త.
ఇద్దరూ బాధపడుతుంటే ఇంతలో మనోహరి సంతోషంగా ఇంటికి వస్తుంది. మనోహరిని చూసిన ఆరు కోపంగా తిట్టుకుంటుంది. ఎవరు ఎంత ఎక్కువగా ఏడిస్తే దీనికి అంత ఆనందంగా ఉంటుంది గుప్త గారు అంటుంది. లోపలికి వెళ్లిన మనోహరిని చూసి భోజనం చేయమని అంజు చెప్తుంది. నిర్మల చేసిన వంట తినలేక అందరూ ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి భోజనం చేసి తర్వాత ఇబ్బంది పడలేము అంటూ అందరూ లేచి వెళ్లిపోతారు. శివరాం మాత్రం నువ్వు కావాలని ఇలా చేశావు కదా? అని అడుగుతాడు. దీంతో నిర్మల నేను కావాలని ఎందుకు చేస్తాను అంటూ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే నువ్వు ఇలా చేస్తేనే కదా? అమర్ మళ్లీ మిస్సమ్మను ఇంటికి తీసుకొస్తాడు అంటాడు శివరాం.
ఇంతలో అమర్ వచ్చి గట్టిగా మనోహరిని పిలుస్తాడు. అమర్ పిలవడం ఇన్న మనోహరి హ్యాపీగా ఇంటికి రాగానే నన్నే పిలుస్తున్నాడు అనుకుంటూ బయటకు వస్తుంది. మనోహరి నువ్వు మధ్యాహ్నం బయటకు ఎందుకు వెళ్లావు. చెప్పు మనోహరి.. అని అడుగుతాడు అమర్. ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్లాను అని చెప్తుంది మనోహరి. దీంతో అమర్ టెన్షన్ పడుతూ.. నిన్ను చంపడానికి బాబ్జీ నాకు ఫోన్ చేసినప్పుడు ఇద్దరు పక్కనే ఉన్నట్లు తెలిసింది అని అమర్ చెప్పగానే మనోహరి భయంతో వణికిపోతుంది.
ఇంతలో రాథోడ్ చెప్పండి మేడం.. సార్ అడుగుతున్నారు కదా..? బాబ్జీ గాడు సార్‌కు ఫోన్ చేసినప్పుడు మీరు వాడి పక్కనే ఉన్నారా..? అని నిలదీయడంతో మనోహరి నేను వాడి పక్కన ఉండటమేంటి? ఎందుకు ఉంటాను అంటూనే.. అయితే వాడు నా పక్కనే ఉండి నన్ను చంపేస్తానని నీకు ఫోన్ చేశాడేమో.. అమర్ అంటూ ఏడుస్తున్నట్లు యాక్టింగ్ చేస్తూ.. అమర్ ను హగ్ చేసుకోవడానికి వెళ్తే అమర్ దూరం పెడతాడు. తర్వాత అమర్ మనోహరిని నువ్వు సేఫ్ గా ఉండాలంటే కలకత్తాకు వెళ్లాలి అని అమర్ చెప్తాడు . దీంతో మనోహరి నేను ఎక్కడికి వెళ్లినా ఆ బాబ్జీ గాడు వచ్చి చంపేస్తాడు అమర్. ఇక్కడ ఉంటే కనీసం నువ్వు రక్షిస్తావు అంటూ ఏడుస్తున్నట్లు నటించడంతో సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు అని అమర్ చెప్పగానే.. నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.