Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో ఈవారం అసలు మెగా చీఫ్ కంటెండర్స్ ఎవరు అవుతారు అనే విషయంపై పోటీ జరిగింది. చివరి ఆటలో యష్మీ, విష్ణుప్రియా.. మెగా చీఫ్ కంటెండర్స్ అవ్వడం కోసం పోటీపడగా యష్మీ గెలిచి బ్యాచ్‌ను దక్కించుకుంది. అలా పృథ్వి, నబీల్, యష్మీ, రోహిణి, ప్రేరణ మెగా చీఫ్ కంటెండర్స్ అయ్యారు. మామూలుగా ఏదైనా టాస్క్ పెట్టి, వారిని ఆడి గెలిచి మెగా చీఫ్ అవ్వమంటే సింపుల్‌గా ఉండేదేమో. కానీ బిగ్ బాస్ అలా చెప్పలేదు. ఎవరికైతే ఇతర కంటెస్టెంట్స్ నుండి ఎక్కువ మద్దతు లభిస్తుందో వారే మెగా చీఫ్ అవుతారని చెప్పడంతో ఎవరికి వారు మద్దతు ఇవ్వమంటూ అందరినీ అడగడం మొదలుపెట్టారు.
యష్మీ ఓటమి
నబీల్ అయితే తన రాజకీయాలతో అందరి సపోర్ట్ అడగడం మొదలుపెట్టాడు. కానీ తన వెనుక పెద్ద కుట్రే జరిగింది. అవినాష్ మెగా చీఫ్ అవ్వడానికి నబీల్ సాయం చేశాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తనకే తిరిగి సాయం చేయాలని అవినాష్ ఫిక్స్ అయ్యాడు. దీంతో అసలు రోహిణికి సపోర్ట్ చేసేవారే లేరు. ఇక యష్మీని మళ్లీ మెగా చీఫ్ చేయాలనే ఆలోచన ఎవ్వరికీ లేదు. అలా కంటెస్టెంట్స్ అంతా ఫుల్ క్లారిటీతో ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి సపోర్ట్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యారు. అప్పుడే మెగా చీఫ్ కోసం ‘మూట ముఖ్యం’ ఛాలెంజ్ మొదలయ్యింది. మొదటి రౌండ్‌లోనే యష్మీని ఔట్ అయ్యింది. దీంతో తన ఫ్రెండ్స్ అయిన ప్రేరణ, పృథ్వికి సపోర్ట్ చేయాలని తను ఫిక్స్ అయ్యింది.
Also Read: బయట ఒకరు.. ఇంట్లో మరొకరు.. ఏంటయ్యా ఈ లీలా..
బరిలోకి దిగిన గంగవ్వ
ఎప్పుడూ ఏ ఆట ఆడడానికి కూడా ముందుకు రాని గంగవ్వ.. మొదటిసారి రోహిణిని సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చింది. అలా టేస్టీ తేజ, గంగవ్వ కలిసి రోహిణి రెండో రౌండ్ నుండి బయటికి వెళ్లకుండా కాపాడారు. చాలావరకు కంటెస్టెంట్స్ అంతా కలిసి నబీల్‌నే టార్గెట్ చేయడంతో తన బాక్స్‌లో ఎక్కువ మూటలు పడ్డాయి. ఎన్ని రాజకీయాలు చేసినా తను అనుకున్నది జరగలేదని నబీల్ చాలా ఫీలయ్యాడు. తనను ఔట్ చేసిన వారందరికీ థ్యాంక్స్ అంటూ వ్యంగ్యంగా చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇప్పటినుండి నబీల్ రివెంజ్ తీర్చుకుంటాడని హరితేజ స్టేట్‌మెంట్ ఇవ్వడంతో సైలెంట్‌గా కెమెరా ముందుకు వెళ్లి పగ పట్టడానికి నేనేమైనా పామునా అంటూ కామెడీ చేశాడు.
సంచాలకుడు గమనించలేదు
రెండో రౌండ్‌లో పృథ్వి బాక్స్‌లో అస్సలు ఒక మూట కూడా పడలేదు. అదెలా సాధ్యమంటే తను చీటింగ్ చేశాడు. తన బాక్స్‌లో పడుతున్న మూటలను ఎవ్వరూ చూడకుండా తానే స్వయంగా బయటపడేశాడు. దానిని సంచాలకుడు అయిన అవినాష్ కూడా గమనించలేదు. కానీ బిగ్ బాస్, ప్రేక్షకులు మాత్రం పృథ్వి చీటింగ్ చేయడం కళ్లారా చూశారు. ఇలా చీటింగ్ చేసి మెగా చీఫ్ అవ్వడం కంటే న్యాయంగా ఆడి గెలవచ్చు కదా అని అప్పుడే తనపై నెగిటివ్ కామెంట్స్ మొదలుపెట్టారు. ఇక ఆట నుండి తప్పుకున్న నబీల్.. తాను పృథ్వికి, ప్రేరణకి ఎవ్వరికీ సపోర్ట్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు.