E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode October 12th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరికి షాక్ ఇచ్చిన అమర్  

Nindu Noorella Saavasam Serial Today Episode October 12th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరికి షాక్ ఇచ్చిన అమర్  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: సీసీటీవీలు కాలిపోవడంతో పార్థు హత్య వెనక ఎవరో ఉన్నారని ఆ వ్యక్తే ఇప్పడు మనల్ని చాలా క్లోజ్‌గా అబ్జర్వ్‌ చేస్తున్నారని వైజయంతి అనుమానిస్తుంది. ఆ మాటలకు మనోహరి షాక్‌ అవుతుంది. చాలా తెలివైన దానివే వైజయంతి బలే కనిపెట్టావు అని మనసులో అనుకుంటుంది. ఆ వ్యక్తి ఎవరో మనల్ని ఫాలో అవుతున్నాడు.. వెంటనే ఆ వ్యక్తిని పట్టుకుంటాను.. అనగానే.. మనోహరి చిన్నగా నవ్వుకుని నన్ను పట్టుకోవడం అమర్‌ వల్లే కాలేదు.. నీ వల్ల ఏమవుతుంది. నన్ను పట్టుకోవడానికి నీ టైం వేస్టు చేసుకోవడం తప్ప నీకేం మిగలదు వైజయంతి అని మనోహరి అనుకుంటుంది. నేను వాళ్లను పట్టుకోలేని అని వాళ్లు అనుకోవచ్చు కానీ తప్పకుండా పట్టుకుని జైలులో ఊచలు లెక్కపెట్టిస్తాను అని వైజయంతి అంటుంది. ఆల్‌ ది బెస్ట్‌ వైజయంతి అని చెప్పుకుని మనోహరి వెళ్లిపోతుంది. వైజయంతి కూడా వెళ్లిపోతుంది.

కులుమనాలి వెళ్లిన వైజయంతి కానిస్టేబుల్‌తో కలిసి పార్థు, మను కలిసి స్టే చేసిన హోటల్‌ రూంకు వెళ్తుంది. రూంలోకి వెళ్లి అంతా చూస్తుంది. అక్కడ ఒక సూట్‌ కేసు చూసి ఇది ఎవరిది అని అడుగుతుంది. అది పార్థు సార్ ది అని హోటల్‌ మేనేజర్‌ చెబితే.. మరి మనోహరి లగేజీ ఎక్కడుంది అని వైజయంతి అడగ్గానే.. తను అప్పుడే తీసుకెళ్లింది మేడం అంటూ మేనేజర్‌ చెప్తాడు. దాంతో వైజయంతి అనుమానంగా పార్థు లగేజి వదిలేసి తనది మాత్రమే ఎందుకు తీసుకెళ్లింది అని మనసులో అనుకుంటూ సూట్‌కేస్‌ ఓపెన్‌ చేస్తుంది. అందులో వైజయంతి, పార్థు కలిసి దిగిన ఫోటో ఉంటుంది. ఫోటో వెనకాల అమ్మ ప్లస్ అక్క ఈక్వోల్‌  అమ్మక్క అని రాసి ఉంటుంది. అది చూసిన వైజయంతి ఎమోషనల్ అవుతూ పార్థు తనను అమ్మక్క అని పిలిచిన మాటలను గుర్తు చేసుకుంటుంది.

Advertisement

అమర్‌ ఫోన్‌ చేసి తాము హైదరాబాద్‌ వెళ్తున్నామని వైజయంతికి చెప్తాడు. సరే వెళ్లే ముందు ఒకసారి మనోహరిని తీసుకుని రమ్మని చెప్తుంది వైజయంతి. ఎక్కడికి రావాలని అమర్‌ అడిగితే.. పార్థు చనిపోయిన ప్లేస్‌కు రమ్మని చెప్తుంది. కాల్‌ కట్‌ చేసి అదే విషయం మిస్సమ్మ, రాథోడ్‌, మనోహరిలకు చెప్తాడు అమర్‌. తాను అక్కడికి రాలేనని మనోహరి బాధపడ్డట్టు యాక్టింగ్ చేస్తుంది. అక్కడకు నువ్వు వెళ్లకపోతే పార్థును చంపింది నువ్వేనని నువ్వే హంతకురాలివి అని పోలీసులు అనుమానిస్తారు అంటూ మిస్సమ్మ చెప్తుంది. రాథోడ్‌ కూడా అదే చెప్తాడు.

అందుకు మనోహరి కోపంగా చూశావా అమర్‌ వీళ్లు నా మీద ఎన్ని నిందలు వేస్తున్నారో అని చెప్పగానే.. అమర్‌ కూడా వైజయంతి మేడం చెప్పే వరకు మనం ఢిల్లీ వదిలి వెళ్లడానికి వీల్లేదు మనోహరి. ఆమె ఎంక్వైరీకి మనం సహకరించాలి. నువ్వేదో తప్పు చేశావని కాదు.. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షివి నువ్వు అందుకే నిన్ను ఎంక్వైరీ చేస్తారు. నువ్వు ఏ తప్పు చేయలేదని వాళ్లు నమ్మితే నువ్వు ఎక్కడికి వెళ్లినా వాళ్లు ఏమీ అనరు అంటూ అమర్‌ చెస్తూ వెళ్దాం పదండి అంటూ వెళ్లిపోతాడు. మనోహరి కోపంగా వెనకాలే వెళ్లిపోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

నాన్న చనిపోయినప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు.. మహేష్ అచంట ఎమోషనల్

చేతిలో రూపాయి లేదు.. శివుడిని మొక్కగానే సినిమా ఛాన్స్.. మహేష్ అచంట ఓపెన్ టాక్!

బిగ్‌బాస్ టైటిల్ అతను గెలిస్తే హ్యాపీ.. మహేష్ అచంట మనసులో మాట!

ఆరుగురిని లవ్ చేశా.. నా భార్యకు చెబితే .. మహేష్ అచంట లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా?

వాళ్లని చూస్తే కంకర రాళ్లతో కొట్టాలనిపిస్తుంది…చిరు పై మహేష్ అచంట వైరల్ కామెంట్స్

బిగ్‌బాస్‌కు వెళ్లకపోవడానికి కారణం ఇదేనా? మహేష్ అచంట ఏమన్నారంటే!

వైల్డ్ కార్డ్స్ కాదు వైల్డ్ ఫైర్.. హౌస్ లోకి అడుగుపెట్టిన స్టార్స్ వీరే!

Big Stories

Advertisement
×