E-Paper
Advertisement

రూ.10 వేల జీతం తీసుకునే ఉద్యోగి.. కట్ చేస్తే ఖాతాలో రూ.10 వేల కోట్లు.. చివరికి ఏమైందంటే!

రూ.10 వేల జీతం తీసుకునే ఉద్యోగి.. కట్ చేస్తే ఖాతాలో రూ.10 వేల కోట్లు.. చివరికి ఏమైందంటే!
Advertisement

Rs 10,000 Crore Lien: నెలకు రూ.10 వేల జీతం తీసుకునే సామాన్య యువకుడి బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.10 వేల కోట్లు కనిపిస్తే ఎలా ఉంటుంది? భలే అద్భుతంగా ఉంటుంది కదూ. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో సరిగ్గా ఇలాంటి విచిత్ర ఘటనే చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఖాతాను చెక్ చేసుకోగా ఏకంగా రూ.10 వేల కోట్లు అకౌంట్ లో ఉన్నట్లు చూపించింది.

సికార్‌లోని సాలాసర్ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న ‘నిర్మల్ మెడికల్ పాయింట్’లో సమీర్ ఖాన్ (22) అనే యువకుడు పనిచేస్తున్నాడు. బుధవారం తన ప్రిపెయిడ్ మొబైల్ రీఛార్జ్ చేసుకునేందుకు బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేసి పిన్ నంబర్ నమోదు చేయగా.. ఖాతాలో జీరో బ్యాలెన్స్ అని చూపించింది. ఏమైందో అర్థంకాక వివరాలు చూడగా.. తన ఖాతాపై ఏకంగా రూ. 10,00,00,00,00,000 (రూ.10 వేల కోట్లు) ‘లీన్’ (Lien) పడినట్లు కనబడింది. అంతేకాకుండా బ్యాంక్ విధించిన ఈ లిమిట్ కారణంగా అతని ఖాతాలోని అసలు సొమ్ము రూ. 55,000 కూడా లాక్ అయిపోయింది. కనీసం సొంత డబ్బులు కూడా వాడుకోలేని పరిస్థితి ఏర్పడింది.

Advertisement

తన బ్యాంక్ ఖాతా పరిస్థితి చూసి కంగారుపడ్డ సమీర్ ఖాన్.. వెంటనే తన యజమాని ధీరజ్ శర్మకు విషయం చెప్పాడు. ఇద్దరూ కలసి సికార్ సైబర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ పోలీసులు వారిని నేరుగా బ్యాంకు అధికారులతో మాట్లాడాల్సిందిగా సూచించారు. దాంతో బ్యాంక్‌ను సంప్రదించగా… సాంకేతిక లోపం వల్ల ఈ సమస్య వచ్చిందని అధికారులు తెలిపారు. బ్యాంకు సిబ్బంది తమ సిస్టమ్‌లోని సాంకేతిక లోపాన్ని సరిచేయడంతో సమీర్ ఖాతా యథాతథ స్థితికి వచ్చింది. అతని అసలు బ్యాలెన్స్ రూ. 55,000 తిరిగి కనిపించడంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు.

ఈ సందర్భంగా సమీర్ ఖాన్ మాట్లాడుతూ ‘నా ఖాతాలో అంతకుముందు రూ. 55,000 బ్యాలెన్స్ ఉండేది. కానీ రూ. 10,000 కోట్ల లీన్ పడటంతో నా సొంత డబ్బులను కూడా వాడుకోలేకపోయాను. పోలీసులకు, బ్యాంకుకు సమాచారం ఇవ్వడంతో సమస్య పరిష్కారమైంది’ అని తెలిపాడు. మరోవైపు మెడికల్ షాప్ యజమాని ధీరజ్ శర్మ మాట్లాడుతూ.. ‘సమీర్ జనవరి నుండి నా వద్ద రూ. 10,000 జీతానికి పనిచేస్తున్నాడు. తన అకౌంట్‌లో రూ. 10,000 కోట్ల లీన్ పడిందని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. నా జీవితంలో ఇలాంటిది చూడటం ఇదే తొలిసారి’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: ఇస్రో మరో సంచలనం.. విజయవంతంగా నింగిలోకి GSLV ఎఫ్18.. ఎన్‌వీఎస్ 03 ఉపగ్రహ ప్రయోగం సక్సెస్!

బ్యాంక్ పరిభాషలో లీన్ అంటే.. ‘హక్కును తాత్కాలికంగా నిలిపివేయడం’ లేదా ‘హామీగా ఉంచుకోవడం’. బ్యాంక్‌కు డబ్బులు బాకీ ఉన్నప్పుడు ఖాతాలో ఉన్న డబ్బును విత్‌డ్రా చేయకుండా, ఇతరులకు పంపకుండా బ్యాంక్ విధించే లాక్ (Lock) ని ‘లీన్’ అంటారు. ఉదాహరణకు ఖాతాలో రూ.50,000 ఉన్నాయనుకుంటే బ్యాంక్ రూ.20,000పై ‘లీన్’ విధించింది అనుకుందాం. అప్పుడు ఖాతాదారుడు మిగిలిన రూ.30,000 మాత్రమే వాడుకునేందుకు వీలుపడుతుంది. పై ఘటనలో ఓ సామాన్య ఉద్యోగికి ఏకంగా రూ.10 వేల కోట్లకు లీన్ విధించడం చర్చకు కారణమైంది.

Also Read: ‘గెలిచే దమ్ములేక.. ఈసీపై నిందలా?’.. రాహుల్, అఖిలేష్‌లకు అమిత్ షా ఓపెన్ ఛాలెంజ్!

Tags

Related News

పెన్షనర్లు ఇక లైన్‌లో గంటలకొద్ది నిలబడాల్సిన పనిలేదు.. లైఫ్ సర్టిఫికెట్ ఇంటి నుంచే సమర్పించండి

తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ఎల్‌ఐసీ నుంచి 3 సూపర్ స్కీమ్స్.. పిల్లల భవిష్యత్తుకు కొండంత భరోసా!

భయాందోళన నేపథ్యంలో బంగారం-వెండి ధరలు పతనం, కొనుగోలు ఇదే సరైన సమయమా?

స్క్రాప్ బిజినెస్ ఎలా ప్రారంభించాలి? ఎక్కడ కొనాలి, ఎవరికి అమ్మాలి? చెత్త నుంచి సూపర్ సంపాదన

SBI క్రెడిట్ కార్డ్ యూజర్లకు బిగ్ షాక్.. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. 1% అదనపు ఛార్జీలు!

నవంబర్ 1 నుంచి కీలక మార్పులు.. సామాన్యులు, పెన్షనర్లపై తీవ్ర ప్రభావం.. తెలుసుకోకుంటే ఇబ్బందే!

దీపావళి, ధన త్రయోదశి సందర్భంగా బంగారం కొంటున్నారా? ఈ 4 విషయాలు గుర్తుంచుకోండి

Big Stories

Advertisement
×