E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode October 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును మనోహరి చంపేస్తుందా..?   

Nindu Noorella Saavasam Serial Today Episode October 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును మనోహరి చంపేస్తుందా..?   
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:

కంగారుగా ఇంటికి వచ్చిన రాథోడ్‌కు బయట యాదమ్మ కనిపిస్తుంది. రాథోడ్‌ కంగారు పడుతూ మిస్సమ్మ గురించి అడిగితే తల తిక్క సమాధానాలు ఇస్తుంది యాదమ్మ. రాథోడ్‌ కోపంగా తిట్టి సీరియస్‌గా మిస్సమ్మ గురించి అడుగుతాడు. అందుకు నిర్లక్ష్యంగా యాదమ్మ సమాధానం ఇస్తుంది. పైన మేడ మీద బట్టలు ఆరేస్తుందని చెప్తుంది. మిస్సమ్మ బట్టలు ఆరేస్తుంటే నువ్వేం చేస్తున్నావు.. నువ్వసలు ఇంట్లో పని మనిషివేనా..? అయినా మీ మేడం మనోహరి ఇంట్లోంచి వెళ్లిపోయింది కదా నువ్వు ఇంకా ఇంట్లో ఎందుకు ఉన్నావు.. నువ్వు వెళ్లిపోవచ్చు కదా అంటూ నీ సంగతి తర్వాత చెప్తాను అంటూ రాథోడ్‌ కోపంగా పైకి వెళ్తాడు.

Advertisement

మేడ మీద మిస్సమ్మ బట్టలు ఆరేస్తూ ఉంటుంది. రాథోడ్‌ కంగారుగా వెళ్లడం చూసి ఏమైంది రాథోడ్‌ ఎందుకు టెన్షన్‌ పడుతున్నావు అని అడుగుతుంది. రాథోడ్‌ కంగారు పడుతూనే మిస్సమ్మ ఢిల్లీ వెళ్లిన పార్థు సార్‌ మనోహరి క్వార్టర్స్‌కు వెళ్లలేదట. హెడ్‌ ఆఫీసులో సమాచారం ఇవ్వలేదట అని చెప్తాడు. అదేంటి వాళ్లు ఇక్కడ ఫ్లైట్ ఎక్కలేదా..? అని మిస్సమ్మ అడిగితే.. వాళ్లు ఇక్కడ ఫ్లైట్ ఎక్కారు.. ఫ్లైట్‌ ఢిల్లీలో ఎప్పుడో ల్యాండ్‌ అయిపోయింది కానీ పార్థు సారు వాళ్లే వాళ్ల క్వార్టర్స్‌కు వెళ్లలేదట. పైగా ఇక్కడ ఉన్నప్పడు ఢిల్లీ వెళ్లగానే.. తమ హెడ్‌ ఆఫీసులో ఇన్ఫామ్‌ చేయాలి అని పార్థు సారు చెప్పారు కానీ ఇప్పటి వరకు హెడ్‌ ఆఫీస్‌లో ఇన్ఫామ్‌ చేయలేదట అదే కంగారుగా ఉంది అంటూ రాథోడ్‌ చెప్తాడు.

రాథోడ్‌ మాటలకు మిస్సమ్మ మరింత కంగారు పడుతుంది. నా భయమే నిజం అవుతుంది రాథోడ్‌.. మనోహరి, పార్థు గారిని ఏదో చేయబోతుంది. అదే జరిగితే ఈ పెళ్లికి అర్థం ఉండదు.. అరుంధతి అక్క ఆత్మకు శాంతి ఉండదు.. అక్క ఆత్మ చాలా బాధపడుతుంది అంటూ చెప్పగానే.. రాథోడ్‌ కూడా అవును మిస్సమ్మ అరుంధతి మేడం మీలో ప్రవేశించి ఈ పెళ్లి చేయడానికి చాలా కష్టపడ్డారు. ఇప్పుడు మనోహరి పార్థు సార్‌ను ఏమైనా చేస్తే అరుంధతి మేడం ఆత్మ క్షోభిస్తుంది అంటాడు. ఈ పాపంలో నాకు భాగం ఉంది రాథోడ్‌ అంటూ మిస్సమ్మ బాధపడుతుంది. ఎలాగైనా పార్థు గారిని కాపాడాలి అంటుంది మిస్సమ్మ. ఎలా కాపాడాలి అని రాథోడ్‌ అడిగితే.. అమర్‌కు చెబుదాం అంటుంది. అప్పుడు సార్‌ నమ్మకపోవచ్చు అంటాడు రాథోడ్‌. అయితే మనమే అక్కడికి వెళ్దామా అంటే అయ్యో మిస్సమ్మ వాళ్లు అసలు ఎక్కడున్నారో మనకు తెలియనప్పుడు వాళ్ల దగ్గరకు మనం ఎలా వెళ్లగలం అంటాడు రాథోడ్‌. మరి ఏదో ఒకటి చేయాలి రాథోడ్‌ అంటూ మిస్సమ్మ ఆలోచిస్తుంది.

Advertisement

ఢిల్లీలో పార్థును క్వార్టర్స్‌కు హెడ్‌ ఆఫీసుకు వెళ్లకుండా కారులో హనీమూన్‌కు అని చెప్పి తీసుకెళ్తుంది మనోహరి. కారులో వెళ్తుండగానే.. ఆ విషయం పార్థుకు చెప్తుంది. ముందే ఎందుకు చెప్పలేదని పార్థు అడిగితే నిన్ను సర్‌ప్రైజ్‌ చేద్దామని చెప్పలేదు అంటుంది. ఆ విషయం అమర్‌కు ఫోన్‌ చేసి చెబుదాం అని పార్థు ఫోన్‌ చేయబోతుంటే.. వద్దని ఆపేస్తుంది. నా ఫోన్‌ నేను స్విచ్చాప్‌ చేశాను. నువ్వు కూడా నీ ఫోన్‌ స్విచాప్‌ చేయ్‌ అని చెప్తుంది. ఎందుకు అని పార్థు అడిగితే.. మన ఇద్దరి మధ్య ఎలాంటి డిస్టర్బ్‌ ఉండకూడదని చెప్తుంది మనోహరి. సరేనంటూ తన ఫోన్‌ కూడా స్విచ్చాప్‌ చేస్తాడు పార్థు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

ఒక్కపాటతో గూస్ బంప్స్ తెప్పించేసిన తెలుగు హీరోయిన్..ఏం టాలెంట్ భయ్యా!

అమన్ కెప్టెన్సీని లాగేసుకున్న వర్షిణి?

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో రికార్డ్.. మీనాకు రింగ్ గిఫ్ట్.. రోహిణికి షాక్…

Intinti Ramayanam Today Episode: పల్లవికి దిమ్మతిరిగే షాక్.. కరిగిపోయిన మీనాక్షి.. పార్వతికి నిజం చెప్తారా..?

Podarillu Today Episode : చక్రీకి మైండ్ బ్లాక్.. గోపికకు నిజం చెప్పిన మహా.. కత్తి పట్టిన నారాయణ.

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి డెడ్ లైన్.. నర్మద నిజం బయపెట్టేస్తుందా..? మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Karthika Deepam 2 Serial Today Episode October 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిక షాక్ ఇచ్చిన జ్యోత్స్న – సూరజ్ పీఏగా జ్యోత్స్న            

Big Stories

Advertisement
×