BigTV English

Nindu Noorella Saavasam Serial Today October 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చూసి భయంతో వణికిపోయిన ప్రిన్సిపాల్‌ – తనకు శక్తులు వచ్చాయని తెలుసుకున్న ఆరు

Nindu Noorella Saavasam Serial Today October 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చూసి భయంతో వణికిపోయిన ప్రిన్సిపాల్‌ – తనకు శక్తులు వచ్చాయని తెలుసుకున్న ఆరు

Nindu Noorella Saavasam Serial Today Episode:  మిస్సమ్మ ను చూసి దాక్కున్న  రామ్మూర్తిని దగ్గరకు వచ్చి మిస్సమ్మ  పలకరిస్తుంది. మీరు ఇక్కడ ఉన్నారేంటి అని అడుగుతుంది. దీంతో రామ్మూర్తి పిల్లల్ని చూడటానికి వచ్చానని చెప్తాడు. అందుకోసం అయితే ఇంటికే రావొచ్చు కదా అంటుంది. దీంతో ఇంటికి వస్తే మీరు  నన్ను మొహమాట పెడతారని అందుకే ఇక్కడికి వచ్చానని రామ్మూర్తి  చెప్తూ.. నువ్వెందుకు వచ్చావమ్మా అని మిస్సమ్మను అడుగుతాడు రామ్మూర్తి.  ప్రిన్సిపాల్‌ ను కలవడానికి వచ్చానని చెప్తుంది. అమ్ము వాళ్లు క్లాస్‌కు వెళ్తారు. అంజును తీసుకుని మిస్సమ్మ ప్రిన్సిపాల్‌ రూంకి వెళ్తూ రామ్మూర్తి కూడా తీసుకెల్తుంది.


తనకు ఏమీ గోల్‌ లేదు అన్న మిస్సమ్మ మాటలే గుర్తు చేసుకుంటుంటాడు అమర్‌.  గోల్‌ ఏమీ లేదంటుంది. అసలు గోలే లేని మనిషి ఉంటాడా? ఏదో రెండు సార్లు అనుకున్నది జరగలేదని గోలే లేదని అంటే ఎలా? కనీసం చిన్న కోర్కెలు ఉంటాయి కదా? అవైనా చెప్పాలి కదా? అని ఒక్కడే తనలో తాను మాట్లాడుకుంటుంటాడు. ఇంతలో రాథోడ్‌.. సార్‌ ఏమీ అనుకోకండి ఈ గోల్‌ గోల ఏంటి సార్‌ అని అడుగుతాడు.

అంటే ఏంటి? రాథోడ్‌ గోల్‌ ఉండటం నీకు గోలగా అనిపిస్తుందా? అంటూ అమర్‌ ప్రశ్నించడంతో రాథోడ్‌ అయ్యో నేను అలా అనలేదు సార్‌. అంటే ఎవరికి గోల్‌ లేదని మీరు గోల చేస్తున్నారు అని అడుగుతున్నాను అని క్లారిటీ ఇవ్వగానే ఇంకెవరు ఆ మిస్సమ్మ గురించే.. ఉంది కదా నా లైఫ్‌లో ఒక లూజ్‌. ఆ మిస్సమ్మకే ఏ గోల్‌ లేదట అంటాడు అమర్‌. దీంతో రాథోడ్‌  పెళ్లైన ఆడపిల్లకు భర్తను ప్రేమగా చూసుకోవడం తప్పా పెద్దగా గోల్‌ ఏముంటుంది సార్‌ అంటాడు. అలా అంటావేంటీ రాథోడ్‌  ప్రతి ఒక్కరికీ ఒక గోల్‌ ఉంటుంది. ఉండాలి. మిస్సమ్మకు కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఫ్యామిలీని చూసుకోవాలని తన గోల్‌ ను పక్కన పెట్టేసింది. అదేంటే కనుక్కుని వెంటనే నెరవేర్చాలి అంటాడు అమర్‌.


ప్రిన్సిపాల్  రూలోకి వెళ్లి నిలబడి ఉంటారు భాగీ, రామ్మూర్తి.  ప్రిన్సిపాల్‌ మాత్రం వీళ్లను చూసి మళ్లీ రామ్మూర్తిని పనిలోకి తీసుకున్నందుకు గొడవ పడటానికి వచ్చిందా ఈ మిస్సమ్మ అని మనసులో అనుకుంటూ భయంగా అలాగే చూస్తుంటుంది. దీంతో మిస్సమ్మ  ప్రిన్సిపాల్‌ గారు మీతో మాట్లా్డ్డానికి అని వచ్చి ఇంత సేపు అయింది. మీరేం మాట్లాడరేంటి? అని అడుగుతుంది. అది చెప్పాల్సింది మీరు అంటుంది ప్రిన్సిపాల్‌.  మీరు ఫ్రీగా ఉన్నారంటే మాట్లాడతాము అంటుంది మిస్సమ్మ. అయితే నేను కొంచెం బిజీగా ఉన్నాను. తర్వాత మాట్లాడదాం అంటుంది ప్రిన్సిపాల్‌.

మిస్సమ్మ కోపంగా టైం లేదు మేడం మీతో ఇప్పుడే మాట్లాడాలి అనగానే ప్రిన్సిపాల్‌ మరింత భయంగా అయ్యో ఈ రామ్మూర్తి వల్ల ఇవాళ నేను ఈ మిస్సమ్మ దగ్గర ఇరుక్కుపోయానే అని మనసులో అనుకుంటుంది. ఇంతలో రామ్మూర్తి కలగజేసుకుని ప్రిన్సిపాల్‌ గారు మా మిస్సమ్మ మీతో అంజలి గురించి మాట్లాడటానికి వచ్చింది అని చెప్పగానే ప్రిన్సిపాల్‌ కూల్‌గా అవునా.. ఏంటి విషయం అనగానే అంజు స్కూల్‌ కు రాలేదు కదా? అందుకోసమే అంటుంది మిస్సమ్మ. అవునా.. అయితే ఏమైంది.. ఇంకోసారి ఆఫ్సెంట్‌ కాకుండా చూసుకోండి ఇప్పుడైతే నువ్వు క్లాస్‌ కు వెళ్లు అంజు అంటూ ప్రిన్సిపాల్ చెప్పగానే అంజలి హ్యాపీగా క్లాస్‌ కు వెళ్తుంది.

ఇంట్లోంచి బయటకు వెళ్తున్న మనోహరిని మంచినీళ్లు ఇవ్వమని  శివరాం అడుగుతాడు. దీంతో మనోహరి తిట్టుకుంటూ.. అమర్‌ ను పెళ్లి చేసుకున్న తర్వాత మొదట ఈ ముసలోళ్ల పీడ వదిలించుకోవాలి. ఈ ఇంట్లో  నేను మహరాణిలా బతకాలి అనుకుంటుంది. అదంతా పక్కనుంచి వింటున్న ఆరు కోపంగా ఈ ఇంటికి నిన్ను తీసుకొచ్చి నువ్వెన్ని దుర్మార్గాలు చేసినా నిన్ను ప్రేమగా చూసుకుంటున్నారు కదే.. ఇంత చేస్తున్నా వాళ్లు ఒక్కగ్లాసు నీళ్లు అడిగినందుకు ఇంతలా తిట్టుకుంటావా? నాకు కనక ప్రాణం ఉంటేనే నీకు  నా కాలు అడ్డుపెట్టేదాన్ని  అనుకుంటూ వెళ్లి ఆరు కాలు అడ్డు పెడుతుంది.

కాలు తగిలి మనోహరి కింద పడిపోతుంది. కింద పడ్డ మనోహరి తిరిగి చూసి అసలు నేను కింద ఎలా పడ్డాను అనుకుంటూ అనుమానపడుతుంది. అరు కూడా షాక్‌ అవుతుంది. నేను కాలు అడ్డం పెడితే మను కింద పడిందా? అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది. మనోహరి వెళ్లిపోయాక డైనింగ్‌ టేబుల్‌ దగ్గర ఉన్న గ్లాస్‌ను పట్టుకుని చూస్తుంది. గ్లాస్‌ తన చేతికి రావడంతో ఆరు ఆశ్చర్యంగా తనకు స్పర్శ వచ్చిందని కంగారుపడుతుంది. వెంటనే బయటకు వెళ్లి గుప్తను అడగాలనుకుంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు..అవే స్పెషల్…

Chhaava: సైలెంట్ గా టీవీల్లోకి రాబోతున్న రష్మిక ఛావా.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

Actress Harshitha: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన బుల్లితెర నటి… బేబీ ఆన్ ద వే అంటూ!

Actress : ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత..

Intinti Ramayanam Today Episode: పార్వతి పై అక్షయ్ సీరియస్.. పల్లవికి మరో షాక్.. భరత్, ప్రణతి ల కొత్త కాపురం..

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించేసిన గుణ.. గుండెలు పగిలేలా ఏడ్చిన మీనా.. విడిపోతారా..?

Big Stories

×