India vs Bangladesh 2nd T20 Playing 11, head-to-head, streaming: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఇవాళ రెండో టి20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మొదటి టి20 మ్యాచ్ గెలిచిన టీమ్ ఇండియా జట్టు… రెండవ టి20 మ్యాచ్ లో కూడా విజయం సాధించాలని… ఎంతో ఆత్రుతగా ఉంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ కూడా కైవసం చేసుకోవాలని అనుకుంటుంది. అయితే బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండవ టి20 మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం లో జరగనుంది. ఈ మ్యాచ్ ఇవాళ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది.
Also Read: Hong Kong Sixes: 5 ఓవర్ల టోర్నీ ఆడనున్న టీమిండియా.. ఈ టోర్నమెంట్ రూల్స్ ఇవే!
ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న బంగ్లాదేశ్ అలాగే టీమ్ ఇండియా జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు ప్రాక్టీస్ చేసి…. రంగంలోకి దిగనున్నాయి ఈ రెండు జట్లు. అయితే ఇవాల్టి మ్యాచ్… టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. మొదటి బ్యాటింగ్ తీసుకునే జట్టు విజయం సాధించే ఛాన్స్ ఉంది… అయితే ఈ రెండో టి20 కోసం టీమిండియా ఎలాంటి మార్పులు చేయడం లేదని తెలుస్తోంది.
Also Read: Jp Duminy: JP డుమిని దొంగాట..కోచ్ గా ఉండి..ఫీల్డింగ్ చేశాడు..?
మొన్న మ్యాచ్ గెలవడంతో అదే జట్టును కొనసాగించాలని.. సూర్య కుమార్ యాదవ్ నిర్ణయం తీసుకున్నాడట. అటు బంగ్లాదేశ్లో పలు కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఇవాళ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తుంది. కాగా మూడవ టి20 హైదరాబాదులోని.. ఈ నెల 12వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే.
రెండు జట్ల అంచనా
టీమిండియా ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (WK), సూర్యకుమార్ యాదవ్ (c), నితీష్ రెడ్డి/తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్
బంగ్లాదేశ్ ప్లేయింగ్ XI: పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, రిషాద్ హొస్సేన్, షోరీఫుల్ ఇస్లాం,