Nindu Noorella Saavasam Serial Today Episode: లాయర్ తప్పించుకుని రణవీర్ దగ్గరకు వెళ్తాడు. రణవీర్‌కు జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు. దీంతో రణవీర్ వెంటనే మనోహరికి కాల్ చేసి వెంటనే రమ్మని చెప్తాడు. దీంతో కొద్దిసేపటి తర్వాత వచ్చిన మనోహరి కోపంగా ఏంటి రణవీర్ ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఫోన్ చేసి మరీ వెంటనే రమ్మన్నావు అని అడుగుతుంది. కొంప మునిగిపోతుంది. కానీ నా కొంప కాదు నీ కొంప అంటూ రణవీర్ చెప్పగానే..ఏం మాట్లాడుతున్నావు రణవీర్ అంటూ మనోహరి అడుగుతుంది. అవును అమరేంద్ర నీకోసం చేస్తున్న వేట వేగం చేశాడు. చాలా దగ్గరగా వచ్చేశాడు అని రణవీర్ చెప్తాడు. అమర్ నాకోసం వెతుకుతున్నట్టు తెలుసు కానీ చాలా దగ్గరగా రావడం ఏంటి..? అని అడుగుతుంది మను.
మొన్న అమరేంద్ర నా లాయరును కిడ్నాప్ చేసి నా వైఫ్ ఎవరని టార్చర్ పెట్టాడు అని రణవీర్ చెప్తాడు. అవును మేడం రెండు రోజులు నన్ను బంధించి కొట్టిన చోట కొట్టకుండా కొట్టారు.. అని లాయరు చెప్పగానే.. మను కంగారుగా నువ్వు వాళ్లతో ఏమైనా చెప్పావా..? అని అడుగుతుంది. లేదు మేడం వాళ్లు ఎంత కొట్టినా నాకేం తెలియదని చెప్పాను.. అనగానే నేను ఇచ్చిన డబ్బుకు న్యాయం చేశాడన్న మాట అని మనసులో అనుకుంటుంది మను. అంతేకాదు మనోహరి అదే రోజు అమరేంద్ర నా ఇంటికి వచ్చాడు.. నీ గురించి వెతికాడు.. అని రణవీర్ చెప్పగానే.. వాట్ ఆ రోజు అంజు హాస్పిటల్ లో ఉంది కదా..? అమర్ బ్లడ్ కోసం తిరిగాడు కదా..? అంటుంది. అవును అంజు హాస్పిటల్ లో ఉంది.. కానీ అమర్ బ్లడ్ కోసం వెతకలేదు.. నీ కోసం వెతికాడు.. కావాలంటే చూడు అంటూ సీసీటీవీ పుటేజీ చూపిస్తాడు రణవీర్. ఆ పుటేజీ చూశాక మను షాక్ అవుతుంది.
చూశావా ఆరోజు నేను ఇంటికి రావడం కొంచెం లేట్ అయినా మనిద్దరి పెళ్లి ఫోటో అమర్ కంట్లో పడేది. టైంకు నేను వచ్చాను కాబట్టి మన పెళ్లి ఫోటో నాతో తీసుకెళ్లిపోయాను. ఆరోజు నేను నీతో ఫోన్‌లో మాట్లాడింది అమరేంద్ర కనిపెట్టేశాడు. నాఫోన్ నుంచి నీ నెంబర్ తెలుసుకోవాలనుకున్నాడు.. కానీ లక్కీగా అది జరగలేదు.. కానీ అతి త్వరలో అమర్ నీ గురించి తెలుసుకుంటాడు మనోహరి అంటూ రణవీర్ హెచ్చరిస్తాడు. దీంతో మను కోపంగా చూస్తూ.. హాస్పిటల్ లో అంజు చావు బతుకుల్లో ఉంటే.. అమర్ కు నా గురించి వెతకాల్సిన అవసరం ఏమొచ్చింది. అంజును వదిలేసి అంతగా నా మీద ఎందుకు కాన్సంట్రేషన్ చేశాడు అంటుంది మను. అదేదో నువ్వే తెలుసుకోవాలి.. లేదంటే ఇన్నాళ్లు నువ్వు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది.
దేని కోసం నన్ను వదిలేశావో.. ఏం సాధించడానికి మన బిడ్డను వదిలించుకున్నావో అది నీకు దక్కకుండా పోతుంది. ఇప్పటివరకు ఇది నీ ప్రాబ్లం మనోహరి.. నీ వల్ల నాకు ఏదైనా ప్రాబ్లం అయిందో ఊరుకోను..ఇది చెప్తే ముందే జాగ్రత్త పడతావని నిన్ను ఇక్కడికి రమ్మన్నాను అని రణవీర్ చెప్పగానే.. మనోహరి కోపంగా చూస్తూ.. ఇన్నాళ్లు నాకు అడ్డుగా ఉన్నవాళ్లు పోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు నేనే పోయే పరిస్థితి వచ్చింది. నేనంటూ పోతే నాతో పాటు అందరినీ తీసుకెళ్లిపోతాను.. అంటుంది మను. దీంతో రణవీర్ భయంగా ఏంటి మనోహరి ఏం మాట్లాడుతున్నావు అందరినీ అంటే ఎవరెవరిని అని అడుగుతాడు.
మనోహరి మాత్రం మనసులో ఇప్పటి వరకు భాగీనే అమర్‌ను ఇష్టపడుతుంది అనుకున్నాను.. ఇప్పుడు అమర్ కూడా భాగీని ఇష్టపడుతున్నాడు.. అక్కడ నాకు స్పేస్ లేదు. అనుకుంటుంటే.. రణవీర్ కోపంగా చెప్పు మనోహరి ఎవరెవరిని తీసుకెళ్తావు అంటాడు. చెప్పను చేసి చూపిస్తాను అంటూ మనోహరి వెళ్లిపోతుంది. రణవీర్ కోపంగా అదేంటి లాయరు మనోహరి ఏదేదో మాట్లాడుతుంది. తను ఏం చెప్తుంది.. అని అడగ్గానే.. మేడం ఏదో ఫిక్స్ అయ్యారు సార్ ఈసారి గట్టిగా ఏదో చేయబోతున్నారు ఎవరు బలి అవుతారో ఏమో అంటాడు లాయరు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.