Nindu Noorella Saavasam Serial Today Episode: పార్థుతో పెళ్లి విషయంలో తన ప్రమేయం లేకుండానే అన్ని జరిగిపోతున్నాయని మనోహరి టెన్షన్ పడుతుంది. భాగీలో ప్రవేశించిన ఆరు ఆత్మ పెళ్లి పూర్తి చేసే వరకు వదిలేలా లేదని కంగారుపడుతుంది. అయితే మనోహరి కష్టాన్ని తీర్చేందుకు చంభా మళ్లీ మంత్రాలు మొదలుపెడతానని చెప్తుంది. అందుకోసం తానే ఆరు ఆత్మను బంధించేందుకు రెడీ అవుతానని చెప్తుంది. మనోహరి కూడా సరే అంటుంది. అయితే మిస్సమ్మను ఒంటరిగా బయటకు తీసుకురావాలని అప్పుడే తాను ఆరు ఆత్మను బంధింస్తానని చెప్తుంది. మనోహరి ఒక ప్లాన్ ద్వారా మిస్సమ్మను బయటకు తీసుకొస్తానని చెప్పగానే.. చంభా సరే అంటూ తాను బయటకు వెళ్లి ఏర్పాట్లు చేసుకుంటానని వెళ్లిపోతుంది.
యమలోకం నుంచి అంతా గమనిస్తున్న గుప్త కంగారుపడతాడు. చంభా మళ్లీ ఆరు ఆత్మను బంధిస్తుందా..? అయితే నా సహోదరి చిక్కుల్లో పడుతుందా..? నేను వెంటనే భూలోకం వెళ్లాలి. వెంటనే ఆరును కాపాడాలి అనుకుంటూ గుప్త స్పీడుగా భూలోకం బయలుదేరుతాడు. అప్పుడే నారదుడు ఎదురుగా వస్తాడు. నారదుడిని గమనించకుండా గుప్త వెళ్లిపోతుంటే.. నారదుడు గుప్తను పిలుస్తాడు.. ఎందుకు అంత కంగారుపడుతున్నావు.. ఎక్కడికి వెళ్లిపోతున్నావు.. అని అడిగితే.. గుప్త భయంగా భూలోకం వెళ్తున్నాను.. మహర్షి అక్కడ నా సోదరి అరుంధతి మళ్లీ చిక్కుల్లో పడనుంది అని చెప్తాడు. నారదుడు నవ్వుతూ నువ్వు నీ సోదరికి సాయం చేయాల్సిన అవసరం లేదు గుప్త అని చెబితే..
ఎందుకు అలా అంటున్నారు మహర్షి అంటూ గుప్త అడుగుతాడు.. అరుంధతి బాలికకు ఉన్న శక్తి చాలు తనను తాను రక్షించుకోగలదు అని చెప్పగానే.. గుప్త అనుమానంగా మహర్షి మీరు కలహబోజననులు కదా ఇందులో కూడా ఏదైనా సరదా ఆశిస్తున్నారా..? అని అడిగితే.. నారదుడు నవ్వుతూ అవును గుప్త నేను కలహభోజనుడినే.. అందుకే కదా ఆరుంధతి బాలిక తన శక్తుల ద్వారా మనోహరి బాలికను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడం ఇక్కడి నుంచే చూడబోతున్నాను.. నువ్వు కూడా ఇచ్చటి నుంచే వీక్షించుము అంటాడు నారదుడు. గుప్త ఆశ్చర్యంగా చూస్తుంటాడు.
తన పెళ్లి అంగరంగవైభవంగా జరుగుతుందని అసలు ఊహించలేదని ఇంతలా తన పెళ్లి చేస్తున్నందకు అమర్‌కు థాంక్స్ చెప్తాడు పార్థు. అయితే దానికి అంతటకు కారణం తాను కాదని అంతా మిస్సమ్మ చేస్తుందని నీ థాంక్స్ మిస్సమ్మకు చెప్పు అంటాడు అమర్. అప్పుడు మిస్సమ్మ తనదేం లేదని అంతా అక్క ఆశీర్వాదంతో జరుగుతుందని చెప్తుంది. రాథోడ్ కూడా అవును సార్ అరుంధతి మేడం ఆశీస్సులతో అంతా గ్రాండ్‌గా జరుగుతుంది. పెద్ద మేడం వెనకుండి మిస్సమ్మను నడిపిస్తుంది అని చెప్తాడు. సంకల్పం అరుంధతిది అయినా సక్సెస్ చేస్తుంది మాత్రం భాగీనే కదా అంటాడు అమర్. ఏదేమైనా నా పెళ్లి ఇంత గ్రాండ్‌గా జరుగుతున్నందుకు అరుంధతి గారికి భాగీ గారికి చాలా థాంక్స్ అంటాడు పార్థు.
అందరూ మాట్లాడుకుంటుండగానే.. మనోహరి కిందకు వస్తుంది. మనోహరి కింద అందరూ మాట్లాడుకోవడం చూసీ చూడనట్టు వెళ్లిపోతుంటే.. పార్థు, మనోహరిని పిలుస్తాడు. మనోహరి దగ్గరకు వెళ్లగానే.. ఎక్కడికి వెళ్తున్నావు మనోహరి అని అడుగుతాడు. మనోహరి తాను ఆశ్రమానికి వెళ్తున్నట్టు చెప్తుంది. ఆశ్రమానికా ఇప్పుడు దేనికి అంటూ అమర్ ఆశ్చర్యంగా అడిగితే.. బహుశా సరస్వతి మేడం ఆశీస్సులు తీసుకోవడానికి అయ్యుండొచ్చు అంటుంది మిస్సమ్మ. మిస్సమ్మ మాటలకు మనోహరి షాక్ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.