E-Paper
Advertisement

ఖైరతాబాద్ గణేష్ భక్తులకు బిగ్ అలర్ట్.. 23వ తేదీ రాత్రి వరకే దర్శనాలు!

ఖైరతాబాద్ గణేష్ భక్తులకు బిగ్ అలర్ట్.. 23వ తేదీ రాత్రి వరకే దర్శనాలు!
Advertisement

Khairatabad Ganesh: నగరంలో వినాయక చవితి సంబరాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. భక్తుల కొంగుబంగారమైన ఖైరతాబాద్‌ మహా గణపతితో పాటు భాగ్యనగరంలో కొలువైన వినాయకుల సామూహిక నిమజ్జన ఘట్టం ఈ నెల 25న (శుక్రవారం) కంటిపాపలా జరగనుంది. ఈ వేడుకను విజయవంతం చేసేందుకు జీహెచ్‌ఎంసీ సహా అన్ని ప్రభుత్వ విభాగాలు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాయి.

ఖైరతాబాద్ లంబోదరుడి దర్శనం ఎప్పటివరకంటే?

Advertisement

మహా గణపతి శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా పూర్తికావాలనే లక్ష్యంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 23వ తేదీ (బుధవారం) రాత్రి వరకే భక్తులకు స్వామివారి దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. 24న ఉదయం నుంచే పందిరి, బ్యారికేడ్ల తొలగింపు ప్రక్రియ మొదలుకానుంది. 25న ఉదయం 6 గంటలకే మహా గణపతి వాహనాన్ని కదిలించి, మధ్యాహ్నం 12 గంటల కల్లా నిమజ్జనం పూర్తిచేసేలా ఉత్సవ కమిటీ, పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

హుస్సేన్‌సాగర్‌కు పోటెత్తనున్న విగ్రహాలు

Advertisement

మరోవైపు నగరవ్యాప్తంగా నిమజ్జనాలు శరవేగంగా సాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ పరిధుల్లో ఇప్పటివరకు సుమారు లక్ష విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరినట్లు అధికారులు తెలిపారు. 11వ రోజైన శుక్రవారం నాడు ఒక్క హుస్సేన్‌సాగర్‌ వద్దకే దాదాపు 80 వేల విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశముంది.

చెరువుల వద్ద పటిష్ట ఏర్పాట్లు

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రధాన చెరువుల వద్ద క్రేన్ల సంఖ్యను పెంచుతున్నారు. ముఖ్యంగా హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో నిమజ్జనం వేగంగా సాగేందుకు అదనంగా మరొక 20 క్రేన్లను అందుబాటులోకి తెస్తున్నారు. నగరం అంతటా భద్రతను పటిష్టం చేస్తూ వేడుకలను పండుగ వాతావరణంలో ముగించేందుకు సర్వం సిద్ధమైంది.

Also Read: వైట్‌హౌస్‌లో ఆ మూడు మీడియా సంస్థలపై బ్యాన్.. డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

Tags

Related News

హైదరాబాద్‌కి పోటీగా వరంగల్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు!

అర్ధరాత్రి పిల్లల వార్డులో పేలిన ఏసీ.. ఆదిలాబాద్ రిమ్స్ లో ఘోర అగ్నిప్రమాదం, రంగంలోకి అధికారులు

కాంగ్రెస్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. 22A భూములపై మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ!

తెలంగాణ పోటీపరీక్షల్లో సిలబస్ మార్పులు.. క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ!

హైడ్రా ప్రజావాణికి 47 ఫిర్యాదులు.. 80 గజాల్లో 7 అంతస్తుల భవనం కలకలం!

జూరాల రైతుల అరెస్టులపై హరీష్ రావు ఫైర్.. ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్!

అక్టోబర్ 2న తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

Advertisement
×