E-Paper
Advertisement

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 
Advertisement

Ninnu kori serial today Episode: మదన్‌ చెప్పిన ట్రిక్‌ ఉపయోగించి తాను సామ్రాట్‌ను పట్టించుకోకుండా ఉండాలని శ్రీజ అనుకుంటుంది. అందుకు అనుగుణంగా శ్రీజ ఇంట్లో మారిపోయిన వ్యక్తిలా తిరుగుతుంది. అలా మారిన వ్యక్తిలా ఉండటానికి ముందుగా అందరికీ కాఫీ పెడుతుంది. హాల్లో మాట్లాడుతూ కూర్చున్న దాక్షాయణి, కేశవ దగ్గరకు కాఫీ తీసుకెళ్లి అత్తయ్యా కాఫీ అంటూ ఇస్తుంది. దాక్షాయణి షాక్‌ అవుతుంది.  ఇదేంటి దాక్షాయణి మనం కలలో ఉన్నామా..? ఒకసారి నన్ను గిల్లు అంటాడు కేశవ. దాక్షాయణి కూడా నాకు అలాగే ఉందండి అంటుంది. మన శ్రీజ ఇంత పద్దతిగా కాఫీ తేవడం అంటే నాకు నమ్మబుద్ది కావడం లేదు అంటుంది. వెటకారం చాలు కానీ ముందు కాఫీ తాగి ఎలా ఉందో చెప్పండి అంటుంది శ్రీజ.

ఆ మాటలకు కేశవ ఆశ్చర్యంగా తాగి చెప్పాలా..? కొంపదీసి ఏదైనా ప్రయోగం చేస్తున్నావా ఏంటి మా మీద అంటాడు. అబ్బా తాగి చెప్పండి మామయ్య అంటూ కాఫీ అందిస్తుంది శ్రీజ. కాఫీ తీసుకుని తాగుతారు కేశవ, దాక్షాయణి. కాఫీ తాగిన దాక్షాయణి ఇదేంటి కాఫీ ఇంత బాగుంది అంటుంది. నిజం చెప్పు ఎక్కడో కెఫేలో తీసుకొచ్చి ఇక్కడ మాకు ఇస్తున్నావు కదా అంటూ కేశవ అడుగుతాడు. దీంతో శ్రీజ మీకు నేను బాగా పెట్టానని కుల్లు. ఇది నేనే పెట్టిన కాఫీ అంటూ చెప్పగానే.. దాక్షాయణి అనుమానంగా ఇంతకు ముందు ఇలా ఎప్పుడు పెట్టలేదే అంటే ఇది చంద్ర నేర్పించిన కాఫీ అని శ్రీజ చెప్తుంది. కేశవ నవ్వుతూ అనుకున్నాను నీకింత టాలెంట్‌ ఎక్కడిది అంటాడు.

Advertisement

అప్పుడే నీలగిరి, గిరిజ వస్తారు. అబ్బా కరెక్టుగా కాఫీ టైం వచ్చామన్న మాట అంటూ కాఫీ తీసుకుని తాగి నీలగిరి కాఫీ చాలా బాగుంది. అమ్మా శ్రీజ నువ్వు పెట్టలేదు కదా అంటాడు. అందుకు గిరిజ కోపంగా నీలగిరిని గిల్లుతుంది. దీంతో కేశవ బావ ఇది నీ కూతురు పెట్టిందే అంటాడు. దీంతో నీలగిరి హమ్మయ్య ఇన్నాళ్లకు నా అల్లుడు సుఖపడతాడనే కాన్ఫిడెంట్‌ నాకు వచ్చింది అంటాడు గిరిజ కోపంగా చూస్తూ నువ్వు అసలు తండ్రివేనా అంటుంది. ఇదిగో నిన్ను చేసుకుని నేను పడుతున్న పాట్లు దాన్ని చేసుకుని నా అల్లుడు పడకూడదని అలా అన్నాను అన్నమాట.. అనగానే.. శ్రీజ కోపంగా ఏంటి నాన్న అల్లుడు అల్లుడు అంటూ భజన చేస్తున్నావు కూతురు కన్నా అల్లుడు ఇంపార్టెంటా..? అంటే అమ్మా నాకు నా చెల్లి ఇంపార్టెంట్‌, బావ ఇంపార్టెంట్‌.. తర్వాత అల్లుడు ఇంపార్టెంట్‌ ఎందుకంటే వాళ్లందరూ బాగుంటేనే రేపు నువ్వు ఈ ఇంట్లో హ్యాపీగా ఉంటావు.. అంటే అర్థం ఏంటి.. నీ సంతోషమే నాకు ఇంపార్టెంట్‌ అనే కదా అంటాడు నీలగిరి..

శ్రీజ నవ్వుతూ నీలగిరిని లవ్యూ నాన్న అంటూ హగ్‌ చేసుకుంటుంది. నీతో ఇదే సమస్య నాకు లవ్యూ చెప్పడం కాదు.. అల్లుడితో కూడా లవ్యూ చెప్పించుకో అంటాడు. అందరం ఇక్కడే ఉన్నాము అల్లుడు ఎక్కడ వదిన అంటూ గిరిజ అడుగుతుంది. అప్పుడే సామ్రాట్‌ లోపలికి వస్తూ.. అందరూ హ్యాపీగా మాట్లాడుకోవడం చూస్తాడు. సామ్రాట్‌కు బ్రెయిన్‌లో తాను విరాట్‌గా ఉన్నప్పుడు తన ఇంట్లో అందరూ అలాగే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ.. సెల్పీలు దిగడం మెదులుతుంది. ఇక్కడ కూడా సేమ్‌ నీలగిరి, గిరిజ, శ్రీజ, దాక్షాయణి, కేశవ సెల్పీ దిగుతుంటారు. అంతా చూస్తూ తల పట్టుకుని అమ్మా అంటూ సామ్రాట్‌ పడిపోతాడు. అప్పుడే లోపలికి వస్తుంటారు చంద్ర, మదన్‌. సామ్రాట్‌ పడిపోవడం చూసిన చంద్ర పరుగెత్తుకుంటూ వచ్చి సామ్రాట్‌ను పట్టుకుని బెడ్‌రూంలోకి తీసుకెళ్తుంది. మీరు రెస్ట్‌ తీసుకోండి దేని గురించి ఆలోచించకండి అంటూ జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతుంది.

Advertisement

తర్వాత దాక్షాయణి ఇంటికి ఊరి మనిషి ఒకాయన ఏడుస్తూ వస్తాడు. తన కూతురు చనిపోయిందని మీరే నాకు న్యాయం చేయాలని ఏడుస్తుంటాడు. దాక్షయణి ఆ వ్యక్తితో మాట్లాడుతుంటే.. అందరూ వస్తారు. అప్పుడే సామ్రాట్‌ కూడా వస్తాడు. సామ్రాట్‌ను చూసిన ఆ వ్యక్తి కాళ్ల మీద పడి నా కూతురును చనిపోయింది బాబు మీరే న్యాయం చేయాలి నాకు అంటూ ప్రాదేయపడతాడు. మీ కూతురు ఎలా చనిపోయిందని దానికి కారణం ఎవరని సామ్రాట్ అడిగితే.. నా కూతురు చావుకు మీ తమ్ముడు జీవనే కారణం అని చెప్తాడు ఆ వ్యక్తి. ఆ మాటలకు దాక్షాయణి, సామ్రాట్‌, చంద్ర అందరూ షాక్‌ అవుతారు. ఆ వ్యక్తి దాక్షాయణి గురించి కూడా నిజం చెప్తాడు. మీ అమ్మకు నిజం తెలిసినా నీకు చెప్పకుండా దాచేసిందని చెప్తాడు. చిన్న కొడుకును కాపాడుకునేందుకు దాక్షాయణి ఎంత నీచానికైనా దిగజారుతుంది బాబు అంటూ చెప్తాడు. ఆ వ్యక్తి మాటలకు అందరూ మరింత షాక్‌ అవుతారు. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

బ్లాక్ శారీలో తారక్ సిస్టర్ .. ఇంత స్టైలిష్‌గా ఉందేంటి బాబోయ్!

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈశ్వర్ సాయి…వివాదాలకు గుడ్‌బై చెప్పినట్టేనా?

రాంప్రసాద్ నువ్వేమైనా పిస్తావా?డిజాస్టర్ కెప్టెన్ .. విశ్వరూపం చూపించిన నాగార్జున!

Big Stories

Advertisement
×