E-Paper
Advertisement

జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?

జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?
Advertisement

Tirumala News: లడ్డూ కల్తీ ఘటన తర్వాత దాని క్వాలిటీ ఫోకస్ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి ప్రసాదాలకు ఉపయోగించే ముడి సరుకుల వినియోగంలో క్వాలిటీని ఎప్పటికప్పుడు చెక్ చేస్తోంది. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో టెండరు నిబంధనల్లో పేర్కొన్న ప్రమాణాలు పాటించకుంటే సరుకులను వెనక్కి పంపిస్తున్నారు. తాజాగా మన్యం జిల్లా నుంచి సేకరించిన సుమారు 12 టన్నుల జీడిపప్పును వెనక్కి పంపించింది టీటీడీ.

జీసీసీ అధికారులకు షాకిచ్చిన టీటీడీ

ఏపీలోని ఉత్తరాంధ్రలో ఉత్పత్తి అయ్యే జీడిపప్పుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఎందుకంటే మంచి క్వాలిటీ ఉండడమే దీనికి కారణం. ఇటీవల తిరుమల కల్తీ లడ్డూ ఘటన తర్వాత స్వామి ప్రసాదానికి ఉపయోగించే వస్తువులను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసిన ల్యాబ్‌ల్లో చెక్ చేస్తోంది టీటీడీ. ఏ మాత్రం క్వాలిటీ లేకున్నా, వెంటనే సరకులను వెనక్కి పంపిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన సహకార కార్పొరేషన్‌ నుంచి సేకరించిన సుమారు 12 టన్నుల జీడిపప్పును వెనక్కి పంపించింది టీటీడీ.

తిరుమల నుంచి 12 టన్నుల జీడిపప్పు వెనక్కి

Advertisement

కొద్దిరోజుల కిందట జీసీసీ నుంచి సేకరించిన సుమారు 12 టన్నుల జీడిపప్పును వివిధ అవసరాల కోసం వినియోగించేందుకు టీటీడీ తీసుకొచ్చింది. తిరుమలలో సరుకులను వినియోగించే ముందు ప్రమాణాలకు అనుగుణంగా రా మెటీరియల్ ఉందో లేదో తెలుసుకునేందుకు నాణ్యత పరీక్షలు నిర్వహిస్తారు. సరుకు నుంచి కొన్ని శాంపిల్స్‌ తీసుకున్న అధికారులు, తిరుమలలోని ల్యాబ్‌లో పరీక్ష చేశారు. టీటీడీ పేర్కొన్న క్వాలిటీ ప్రమాణాలకు అనుగుణంగా లేవని గుర్తించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దాదాపు 12 టన్నుల జీడిపప్పును తిరిగి వెనక్కి పంపించింది టీటీడీ.

పరీక్షల్లో క్వాలిటీ లేదని తేలడంతో.. అలర్టయిన అధికారులు

క్వాలిటీ లేకపోవడంతో ఈ సరకు తిరిగి పార్వతీపురం చేరుకుంది. ముందుగా నాణ్యత పరీక్షలు జరగకుండానే జీడిపప్పు సరఫరా చేశారనే విమర్శలు మొదలయ్యాయి. ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న సరుకు మాత్రమే వినియోగించాలని అధికారుల నిర్ణయించారు. జీసీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే రిజెక్ట్‌ అయ్యిందని అంటున్నారు. ఎందుకంటే ఉత్పత్తి చేసే గిరిజనులతో దళారులు కుమ్మక్కు కావడమేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. కాసుల మోజులోపడి ఉత్పత్తి పెంచేందుకు రకరకాల పద్దతులు అవలంభించినట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారం చివరకు ఇంకెన్ని పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

Advertisement

ALSO READ: ప్రపంచ నగరాలకు ధీటుగా.. అమరావతికి మహర్దశ, కొత్త రైల్వే లైన్ కోసం టెండర్లు ఆహ్వానం

Related News

ప్రపంచ నగరాలకు ధీటుగా.. అమరావతికి మహర్దశ, కొత్త రైల్వే లైన్ కోసం టెండర్లు ఆహ్వానం

రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా.. ఓ ప్రయాణికుడ్ని రక్షించిన ట్రాఫిక్ కానిస్టేబుల్, అనంతపూర్ జిల్లాలో ఘటన

పీపీపీ పేరుతో రాష్ట్రం అమ్మకానికి? చంద్రబాబు, లోకేష్‌లపై పేర్ని నాని సంచలన ఆరోపణలు

కాకినాడ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. చాట్‌జీపీటీ సాయంతో ప్లాన్.. అసలు సూత్రధారి అతడే!

ప్రియురాలి పీక కోసి.. బిల్డింగ్‌పై నుంచి దూకేసిన ప్రియుడు

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం.. మంత్రి నారాయణ కీలక ప్రకటన

శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. పరిశ్రమ బాయిల‌ర్‌లో భారీ పేలుడు.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి!

Big Stories

Advertisement
×