Padutha Theeyaga promo: సింగర్స్ కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న షో పాడుతా తీయగా.. ఈ షో ద్వారా ఎంతో మంది సింగర్లు తమ టాలెంట్ ని నిరూపించుకుంటూ సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటున్నారు. ఇప్పటికీ ఎన్నో సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఈ మధ్య విమర్శలను అందుకుంటుంది. ఓ సింగరు తనని కావాలనే ఎలిమినేట్ చేశారు. ఆ షో లో జరిగేది ఇదే అసలు బాగోతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు అన్యాయం చేశారంటూ ఆమె సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేసింది. దానిపై ఇప్పటికే రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కానీ షో నిర్వాహకులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా తర్వాత ఎపిసోడ్లో ప్రోమో లను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా పాడుతా తీయగా లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు.
పాడుతా తీయగా లేటెస్ట్ ప్రోమో..
పాడుతా తీయగా లేటెస్ట్ ప్రోమో లో ఏం ఏం కీరవాణి బర్త్ డే సందర్బంగా ఆయన కంపోజ్ చేసిన పాటల్ని పాడారు కంటెస్టెంట్లు. అయితే ఇందులో భాగంగా ఒక కంటెస్టెంట్ కీరవాణిని ఇంట్రెస్టింగ్ కొశ్చన్ అడిగింది. మిమ్మల్ని మీ నాన్నగారు ఎప్పుడైనా కొట్టారా? ఆ సందర్బమేంటి అని సరదాగా అడిగింది. దానికి నవ్వుతూనే కీరవాణి సమాధానం చెప్పాడు. నాకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు మా నాన్న రెండు చెవులు పట్టుకుని పైకి లేపాడు అదే చివరిది అనుకుంటాను అని ఆయన అన్నాడు.. అలాగే ఈ ప్రోమోలో ఇక ఒక కంటెస్టెంట్ ఇచ్చిన పెర్ఫామెన్స్‌కి కీరవాణి ఇచ్చిన స్టేట్‌మెంట్స్ అందరినీ అవాక్కయ్యేలా చేశాయి. సంగీత ప్రపంచంలో నువ్వు సరిగా ఎక్స్‌పోజ్ అవ్వట్లేదు.. నీకు ఆ జ్ఞానం పరిపూర్ణంగా రాలేదు..అంటూ కీరవాణి చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు.. ఇది తప్పే ఇక వేసుకోండి థంబ్ నెయిల్స్ అని కీరవాణి వెటకారంగా మాట్లాడతాడు.. సింగర్ గా పైకి రావాలంటే చాకిరి చేయాలి మరి నువ్వు చాకిరీ చేయడానికి రెడీయేనా అంటూ కీరవాణి కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తాడు.
Also Read :అంత లేపారు… మరి కలెక్షన్స్ ఏంటి మరీ ఇంత తక్కువ ?
కన్నీళ్లు పెట్టుకున్న సునీత..
ఈ షోలో కీరవాణితో పాటు సునీత కూడా జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజా ప్రోమోలో ఆమె కంటతడి పెట్టుకుంది. చుక్కల్లారా చూపుల్లారా తప్పుకోండి మా దారికి అంటూ సాగిన పాటను విని లైవ్ లోనే ఏడ్చేసింది. మనలో ఉన్నటువంటి కరుడుగట్టిన బాధని బయటికి తీసుకురావడానికి ఈ పాట ఒక్కటే ఇన్‌స్ట్రుమెంట్‌గా పని చేసింది నాకు.. ఆ పాటను విన్న ప్రతిసారి నాలో ఏదో తెలియని శక్తి నింపుతుంది అని సునీత ఎమోషనల్ అయ్యారు.. ఇక ప్రోమో చివరిలో కీరవాణి బర్త్ డే సందర్భంగా అందరూ కేక్ కటింగ్ చేయిస్తారు. ఈ ఎపిసోడ్ సోమవారం రాత్రి 9.30 గంటలకి ప్రసారం కానుంది. మరోవైపు సింగర్ ప్రవస్తి ఎలిమినేట్ అయిపోవడంతో కొంతమంది ఈ ప్రోమో కింద నెగెటివ్ కామెంట్లు పెట్టారు. మొత్తానికైతే ప్రోమో మాత్రం అదిరిపోయింది. ఇక ఎపిసోడ్ ఎంత ఆసక్తిగా ఉంటుందో చూడాలి..