Singer Pravasthi : సింగర్స్ టాలెంట్ షో పాడుతా తీయగా పై ఈ మధ్య విమర్శలు ఎదుయ్యాయి. ఈ షోలో సింగర్ గా పాల్గొన్న ప్రవస్తి తనకు అన్యాయం జరిగిందని, కావాలనే తనని ఎలిమినేట్ చేశారంటూ సోషల్ మీడియాలో వీడియోలను రిలీజ్ చేసింది. ఆ వీడియోలు ఎంత దుమారం లేపాయో తెలిసిందే. ఈ షోలో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువగా ఉందని ప్రవస్తి చేసిన ఆరోపణలపై కొందరు సింగర్స్ సమర్థిస్తే మరికొందరు ఆమెపై విమర్శలు గుప్పించారు. ఇది ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సింగర్ ప్రవస్తి, సింగర్ సునీత మధ్య పెద్ద వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈ షో ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
సునీత, కీరావాణిలతో నవ్వుతూ ప్రవస్తి..
బుల్లితెరపై ప్రసారమవుతున్న పాడుతా తీయగా షో నుంచి ఇప్పటికే ప్రవస్తి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్ ఇంకా టెలికాస్ట్ కాలేదు. మరో రెండు వారాల్లో అయ్యే ఛాన్స్ ఉంది. అయితే లేటెస్ట్‌గా ఈ షో నుంచి వదిలిన ప్రోమో ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రవస్తి నవ్వుతూ కనిపించడం విశేషం. కీరవాణి, సింగర్ సునీతలతో కలిసి ప్రవస్తి నవ్వుతూ కనిపించిన విజువల్స్‌ని ప్రోమోలో చూపించారు.. ఆ ప్రోమో హైలెట్స్ ఏంటో చూసేద్దాం..
పాడుతా తీయగా షో లేటెస్ట్ ప్రోమో..
పాడుతా తీయగా షో 25 వ సీజన్ ప్రసారం అవుతుంది. ఈ షోలో సింగర్ ప్రవస్తి కూడా తన టాలెంట్ ను నిరూపించుకునేందు పాల్గొంది. ఇందులో ఎన్నో పాటలను పాడి అలరించింది. ఆ ప్రోమోలో.. దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తుచేసుకుంటూ ఈ ఎపిసోడ్‌ని రూపొందించారు. ఆయన సినిమాల్లోని పాటలని కంటెస్టెంట్లు ఆలపించారు. ఇక ఈ వారం అందరూ అబ్బాయిలే పాడతారంటూ ప్రోమో ముందే ఎస్పీ చరణ్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఈ ప్రోమోలో అబ్బాయిలంతా అద్భుతంగా పాడారు.. అందులో భాగంగా ఒక సింగర్ వాడడానికి వస్తుంటే ప్రవస్థి అన్నా అన్నా అంటూ ఆట పట్టించింది. అది చూసిన సింగర్స్ సునీతతో పాటు మిగిలిన వాళ్ళందరూ కుర్చీలో పడి పడి నవ్వారు. ఇకపోతేప్రోమో చివరిలో సింగర్ స్వరాగ్ జననీ జన్మ భూమిశ్చ పాట పాడి అందరినీ ఎమోషనల్ చేసేశాడు. ఈ పెర్ఫామెన్స్ చూసి కీరవాణి ఇది కేవలం పాట అని నేను అనుకోవడం లేదని అంటాడు. మొత్తానికి ఆ ప్రోమో అయితే సరదాగా సాగింది. ఆ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ షో ఫుల్ ఎపిసోడ్ లో చూడాలి..
Also Read : గద్దర్ అవార్డ్స్ పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్.. అలా అనేసారేంటి?
సింగర్ ప్రవస్తి vs సింగర్ సునీత..
ఈ షో లో నుంచి ఎలిమినేట్ అయిన ప్రవస్తి తన తల్లిని అవమానించింది అంటూ సింగర్ సునీత పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ షోలో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువగా ఉందని, బాడీ షేవింగ్ కూడా ఎక్కువేనంటూ ప్రవస్తి గతంలో రిలీజ్ చేసిన వీడియోలో బయటపెట్టింది. అటు సింగర్ సునీత కూడా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ వరుసగా వీడియోలను వదులుతుంది. ఇప్పటికే పలువురు ఈ ఇష్యూపై రెస్పాండ్ అవుతూ క్లారిటీ ఇస్తున్నారు. మరి చివరికి ఏమవుతుందో చూడాలి..