BigTV English

OTT Movie : ఏజెంట్ ను చేస్తామని చెప్పి, సీక్రెట్ సర్వీస్ పేరుతో చేసే పని ఇదా?… మైండ్ బెండింగ్ స్పై థ్రిల్లర్

OTT Movie : ఏజెంట్ ను చేస్తామని చెప్పి, సీక్రెట్ సర్వీస్ పేరుతో చేసే పని ఇదా?… మైండ్ బెండింగ్ స్పై థ్రిల్లర్

OTT Movie : జేమ్స్ బాండ్, మిషన్: ఇంపాసిబుల్ వంటి స్పై యాక్షన్ సినిమాలకు ఇప్పటికీ మంచి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సినిమాలంటే పడి చచ్చేవారి సంఖ్య భారీగా ఉంటుంది. ఓటీటీలో ఇలాంటి అదిరిపోయే స్పై థ్రిల్లర్ గురించి వెతికే వారికోసం ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ బెస్ట్ ఆప్షన్. మరి ఆ మూవీ ఏంటో తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళ్తే…
కింగ్స్‌మ్యాన్ అనే సీక్రెట్, ఇండిపెండెంట్ బ్రిటిష్ స్పై సంస్థ చుట్టూ తిరుగుతుంది. ఈ సంస్థలో మంచి శిక్షణ పొందిన ఏజెంట్లు ఉంటారు. ఇక గ్యారీ ఎగ్సీ అన్విన్ (టారన్ ఎగర్టన్) మన హీరో. లండన్‌లో నివసించే ఎగ్సీ తెలివైనవాడు, చురుకైనవాడు. కానీ అతని తండ్రి మరణం తర్వాత తన స్టెప్‌ ఫాదర్‌తో ఇబ్బందుల్లో జీవిస్తాడు. అతని తండ్రి ఒకప్పుడు కింగ్స్‌మ్యాన్ ఏజెంట్ అని, అతను ఒక మిషన్‌లో మరణించాడని తెలుస్తుంది.

హ్యారీ హార్ట్ (కాలిన్ ఫర్త్), కోడ్‌నేమ్ గాలహాడ్, ఒక ఎక్స్పీరియన్స్డ్ కింగ్స్‌మ్యాన్ ఏజెంట్. ఎగ్సీ తండ్రి మరణం తర్వాత అతనికి ఒక మెడల్ ఇచ్చి, సహాయం అవసరమైతే సంప్రదించమని చెప్తాడు. ఎగ్సీ ఒక సమస్యలో చిక్కుకున్నప్పుడు, అతను హ్యారీని సంప్రదిస్తాడు. హ్యారీ అతన్ని కింగ్స్‌మ్యాన్ రిక్రూట్‌మెంట్ ప్రోగ్రామ్‌లో చేర్చుతాడు. ఈ ప్రోగ్రామ్ లో ఒక ఏజెంట్ స్థానాన్ని భర్తీ చేయడానికి అత్యంత కఠినమైన శిక్షణ, పరీక్షలు ఉంటాయి.


మరోవైపు రిచ్‌మండ్ వాలెంటైన్ (సామ్యూల్ ఎల్. జాక్సన్) అనే ఒక టెక్ బిలియనీర్, ఎకో-విలన్… ఒక భయంకరమైన ప్లాన్‌ను అమలు చేస్తాడు. అతని అసిస్టెంట్ గజెల్ (సోఫియా బౌటెల్లా), లెగ్-బ్లేడ్‌లతో ఉన్న డెడ్లీ ఫైటర్, అతనికి సహాయం చేస్తుంది. వాలెంటైన్ ప్లాన్ ప్రపంచాన్ని నాశనం చేసేంత డేంజర్ అని తెలుసుకున్న కింగ్స్‌మ్యాన్ దీనిని ఆపడానికి రంగంలోకి దిగుతుంది.

ఎగ్సీ కింగ్స్‌మ్యాన్ శిక్షణలో ఇతర రిక్రూట్‌లతో (ముఖ్యంగా రాక్సీ అనే అమ్మాయితో) పోటీపడతాడు. ఇందులో డేంజరస్ టెస్ట్‌లు, స్పై స్కిల్స్, టీమ్‌వర్క్ ముఖ్యం. హ్యారీ మార్గదర్శకత్వంలో, ఎగ్సీ తన స్ట్రీట్-స్మార్ట్ ధైర్యాన్ని ఉపయోగించి ఒక సాధారణ యువకుడి నుండి స్పై ఏజెంట్‌గా మారతాడు. ఇక ఆ తరువాత రిచ్‌మండ్ ప్లాన్ ను ఆపడానికి ఎగ్సీ ఏం చేశాడు? అన్న అడ్వెంచర్ యాక్షన్ స్టంట్స్ ను తెరపై చూడాల్సిందే.

Read Also : మేలో ఓటీటీలోకి రాబోతున్న మోస్ట్ అవైటింగ్ మలయాళ సినిమాల లిస్ట్… ఆ రెండూ మాత్రం డోంట్ మిస్

ఏ ఓటీటీలో ఉందంటే?
ఈ స్పై థ్రిల్లర్ పేరు “కింగ్స్‌మ్యాన్: ది సీక్రెట్ సర్వీస్”. ఇదొక బ్రిటిష్-అమెరికన్ యాక్షన్-స్పై కామెడీ సినిమా. మాథ్యూ వాన్ దర్శకత్వంలో, మార్క్ మిల్లర్, డేవ్ గిబ్బన్స్ రాసిన కామిక్ సిరీస్ “ది సీక్రెట్ సర్వీస్” ఆధారంగా తెరకెక్కింది. కాలిన్ ఫర్త్, టారన్ ఎగర్టన్, సామ్యూల్ ఎల్. జాక్సన్, మైఖేల్ కేన్, సోఫీ కుక్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదొక స్టైలిష్, హై-ఎనర్జీ స్పై థ్రిల్లర్‌, జేమ్స్ బాండ్-స్టైల్ యాక్షన్, కామెడీతో ఆకట్టుకుటుంది. ఈ మూవీ జియో హాట్ స్టార్ (Jio Hotstar)లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది.

 

Related News

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×