E-Paper
Advertisement

Podarillu Chakri : ఇదేం ట్విస్ట్ మావా.. పాలిటిక్స్ లోకి పొదరిల్లు చక్రీ ఎంట్రీ..

Podarillu Chakri : ఇదేం ట్విస్ట్ మావా.. పాలిటిక్స్ లోకి పొదరిల్లు చక్రీ ఎంట్రీ..
Advertisement

Podarillu Chakri : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ గురించి అందరికీ తెలుసు.. గత ఏడది డిసెంబర్లో ప్రారంభమైన సీరియల్ కేవలం కొన్ని నెలల్లోని మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ సీరియల్ లో హీరోగా నటిస్తున్నాడు చక్రి.. ఈయన అసలు పేరు దీపక్ కుమార్.. ఒక తమిళ నటుడు. తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్లలో నటించి తనకంటూ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. తెలుగులో ప్రస్తుతం పొదరిల్లు సీరియల్తో పరిచయమయ్యాడు.. ఈయన చేసింది ఒక్క సీరియల్ అయినా కూడా ఆ సీరియల్స్ స్టోరీ జనాలకి విపరీతంగా నచ్చడంతో చక్రి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా వినిపిస్తుంది.. ఇదిలా ఉండగా తాజాగా చక్రి పాలిటిక్స్ లోకి అడుగు పెట్టబోతున్నాడు అంటూ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది.. సడన్ గా ఈ ట్విస్ట్ ఏంటి అని అనుకుంటున్నారు కదా.. అసలు నిజంగానే చక్రి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడా? లేదా అన్న దానిపై ఒకసారి తెలుసుకుందాం..

విజయ్ దళపతితో చక్రీ..

పొదిరిల్లు సీరియల్ హీరో చక్రి తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్టు కాస్త వైరల్ అవ్వడంతో చక్రి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే.. తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి తో దిగిన ఫోటోలు ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఎప్పుడైతే విజయ్ ఎన్నికల్లో గెలిచాడో చాలామంది సినీస్టార్స్ ఆయన పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. ఇక ఈ చక్రి అలియాస్ దీపక్ కుమార్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అనే అనుమానాలు ఆయన అభిమానులకి కలుగుతున్నాయి.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే దీపక్ క్లారిటీ ఇచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు సత్యం క్లాస్.. మనోజ్ అడ్డంగా దొరుకుతాడా? మనోజ్ 30 లక్షలు గోవిందా..?

దీపక్ రియల్ లైఫ్..

తమిళ నటుడు దీపక్ కుమార్ తమిళంలో ఎన్నో సీరియల్స్లలో నటించి నటుడిగా ప్రేక్షకుల హృదయంలో చెరగని ముద్ర వేసుకున్నాడు.. అయితే తెలుగులో ఆయన నటించిన మొదటి సీరియల్ పొదరిల్లు.. డిఫరెంట్ స్టోరీ తోచిన ఈ సీరియల్లో హీరోగా చక్రి కనిపిస్తాడు. వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన యాక్టర్స్ కి తెలుగులో మంచి డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. చక్రి కి కూడా ఈ సీరియల్ ద్వారా మంచి క్రేజ్ అయితే వచ్చింది. అయితే ఇతడికి రియల్ లైఫ్ లో పెళ్లయిన విషయం తెలిసిందే.. ఆయన భార్య కూడా తమిళ్ ఇండస్ట్రీలో సీరియల్స్లలో నటిస్తుంది. వీరిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు. చక్రి కి పెళ్లయిపోయిందని చాలామంది అమ్మాయిలు ఫీల్ అయిపోతున్నారు. ఇకపోతే చక్రీకి తెలుగులో మరో రెండు సీరియల్స్ వచ్చినట్లు తెలుస్తుంది.. త్వరలోనే ఆ సీరియల్స్ గురించి క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి..

Advertisement

Related News

ఛాన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట 7 నెలలు.. కెవ్వు కార్తీక్ పడిన కష్టాలు ఇవే!

మనుషులు అన్నాక చచ్చిపోరా? అమ్మ మరణం పై కార్తీక్ ఎమోషనల్!

జబర్దస్త్ లో కాంట్రవర్సీలు ఎక్కువ.. ఎన్నో అవమానాలు పడ్డాను:కెవ్వు కార్తీక్

కెవ్వు కార్తీక్ జబర్దస్త్ కు దూరం అవడానికి అదే కారణమా?

ఇండస్ట్రీని వదిలేద్దాం అనుకున్నా..తనూజ షాకింగ్ స్టేట్మెంట్!

షారుక్ ఖాన్ తో సృష్టి.. కామనర్ గా బిగ్ బాస్ లోకి.. మరీ ఇంత మోసమేంటి నాగ్ సార్!

తండ్రి భూస్వామి.. 150 ఎకరాలు దానం..ఉదయభానుకి దక్కిందెంతో తెలుసా?

ఉదయ భాను యాంకరింగ్‌కు అంత పారితోషికమా? ఒక్కో షోకు ఎంతంటే!

Big Stories

Advertisement
×