Podarillu Maha : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని సీరియల్ పేరు పొదరిల్లు.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మాల ప్రసారమవుతున్న ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కొన్ని నెలల క్రితం ప్రారంభమైన ఈ సీరియల్ స్టార్ సీరియల్స్ తో పోటీ పడుతుంది అంటే ఆ స్టోరీ ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. రోజుకో ట్విస్ట్ తో సీరియల్లోకి కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇవ్వడంతో దీనిని చూసేందుకు జనాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సీరియల్ లోకి మరొక కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగింది? ఎందుకు మరొక హీరోయిన్ రాబోతుంది.? ఈ సీరియల్ నుంచి ఎవరైనా హీరోయిన్ ను తప్పుకుంటున్నారా ఇలాంటి వార్తలు అభిమానుల్లో వినిపిస్తున్నాయి. మరి ఈ సీరియల్ లో ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
పొదరిల్లు సీరియల్ లో హీరోయిన్గా నటిస్తున్న మహాలక్ష్మి గురించి అందరికీ తెలుసు. గతంలో మగువ మగువ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ ముద్దుగుమ్మ ఒక్క సీరియల్ తోనే బాగా పాపులాటిరిని సంపాదించుకుంది.. ఆ తర్వాత సెకండ్ సీరియల్ గా ఎంట్రీ ఇచ్చిన పొదరిల్లు సీరియల్ కూడా ఆమెకు మంచి క్రేజ్ ని అందించింది. ప్రస్తుతం ఈ సీరియల్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్న మహాలక్ష్మి త్వరలోనే ఈ సీరియల్ కి దూరమవుతుంది అని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. మహాలక్ష్మి అలియాస్ కృతిక ఉమా శంకర్ బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 లో ఎంట్రీ అన్నట్లు ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.. ఆ ఫోటో వల్లే అందరూ కూడా మహాలక్ష్మి బిగ్ బాస్ లోకి వెళ్తుందా అని అనుకుంటున్నారు. మరి మహాలక్ష్మి ఎందుకు ఆ ఫోటోని షేర్ చేసింది అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. నిజంగానే ఈ సీరియల్ కి గుడ్ బై చెప్పి బిగ్ బాస్ లోకి వెళ్తుందా..? లేదా గెస్ట్ గా వెళ్లి వస్తుందా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
పొద ఇల్లు సీరియల్ హీరోయిన్ మహాలక్ష్మి బిగ్ బాస్ లోకి వెళుతుంది అని ఒక ఫోటో బయటకు రావడంతో ఆమె అభిమానులు చాలా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తుంది.. మహాలక్ష్మిని సీరియల్ లో మిస్ అవ్వడం మాకు కష్టంగా ఉంది. మీరు దయచేసి బిగ్ బాస్ లోకి వెళ్లొద్దు అక్కడికి వెళ్లిన తర్వాత చాలామంది సీరియల్స్లలో కనిపించడం లేదు.. మీరు కూడా బిగ్ బాస్ లోకి వెళ్తే ఇక మీదట సీరియల్స్లలో కనిపించరు. దయచేసి అక్కడికి వెళ్ళకండి అంటూ రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ విషయంపై మహాలక్ష్మి అలియాస్ కృతిక శంకర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ప్రస్తుతం మహాలక్ష్మి రెండు సీరియల్స్లలో నటిస్తున్నారు. అలాగే కన్నడలో కూడా మరో కొత్త సీరియల్ లో నటించే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి తెలుగులో సీరియల్స్ కి గుడ్ బై చెప్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.