Gold Price Today: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఫలితంగా పసిడి ప్రియులకు ఊహించని శుభవార్త. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది. ఇప్పుడు మెట్రో నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం-వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం.
గడిచిన వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధర, ఈ వారం కాస్త శాంతించింది. ఒక్కమాటలో చెప్పాలంటే పసిడి జోరుకు బ్రేకులు పడ్డాయి. ఇందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టడం, హార్ముజ్ జల సంధిపై ట్రంప్ ప్రకటన, డాలర్ విలువ బలంగా కనిపించడం వంటి పరిణామాల కారణంగా మదుపరులు పుత్తిడి వైపు మొగ్గు చూడకపోవడంతో స్వలంగా తగ్గుదల నమోదు అయ్యింది. బాండ్ ఈల్డ్స్ పెరగడంతో ఇన్వెస్టర్లు అటువైపు మళ్లారు. ఈ క్రమంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయితే వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది.
ఇక అంతర్జాతీయ బులియన్ మార్కెట్ల పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఉదయం 6 గంటలకు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 70 డాలర్లు పెరిగింది. ప్రస్తుతం ఔన్స్ రేటు 4411 డాలర్ల వద్దకు చేరుకుంది. సిల్వర్ రేటు ఔన్సుకు 3.65 శాతం మేరా పెరిగి 66 డాలర్లకు చేరుకుంది.
హైదరాబాద్-విజయవాడ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములు రూ.380 మేరా తగ్గింది. తులం ధర రూ.1,51,970 వద్దకు దిగి వచ్చింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.350 మేరా తగ్గడంతో తులం రేటు రూ.1,39,300 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడ ధర విషయానికి వద్దాం. అక్కడా పసిడి రేట్లు స్వల్పంగా దిగి వచ్చాయి.
24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ తులానికి రూ.380 తగ్గడంతో రూ.1,51,970 వద్ద ప్రస్తుతం పలుకుతోంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం తులం రూ.350 తగ్గి రూ.1,39,300 వద్ద ట్రేడవుతోంది. గడిచిన వారంలో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నా, వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది. ఆగస్టు 6న కిలో వెండి రూ.10 వేలు పెరిగి రూ.2.50 లక్షల మార్క్ తాకింది. వారం రోజులుగా అదే ధర వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.
ALSO READ: ఇంటి అద్దె కంటే.. EMI ఎక్కువైనా సొంత ఇల్లు కొనొచ్చా? సూటిగా సుత్తి లేకుండా!
ప్రధాన నగరాల్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. ముంబై- 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ. 1,53,060 ఉంది. ఢిల్లీ- 10 గ్రాములు రూ. 1,52,800 కాగా, చెన్నైలో రూ. 1,53,510 వద్ద కొనసాగుతోంది. ఇక కోల్‌కతాలో 10 గ్రాములు రూ. 1,52,860 పలుకగా, బెంగళూరులో 10 గ్రాములకు రూ. 1,53,180 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,40,305 కాగా, ఢిల్లీ-రూ. 1,40,067, చెన్నై-రూ. 1,40,718, కోల్‌కతా- రూ. 1,40,122, బెంగళూరు- రూ. 1,40,415 లుగా ఉంది.