Podarillu Today Episode august 1st: అక్కడున్న వాళ్ళందరూ కూడా వరాలు వాళ్ళ ఇంటికి వచ్చి మీ అమ్మాయి లేచిపోయింది ఏంటి అని అడుగుతుంటారు. నా కూతురు ఏమి లేచిపోలేదు అని వరాలు ఎంత చెప్తున్నా సరే అందరూ సూటికోటి మాటలతో మాట్లాడుతూ అక్కడ ఇంటి దగ్గర గుంటూరు ఉంటారు. అప్పుడే కేశవ తో శైలు ఎంట్రవడంతో వరాలు చాలా కోపంగా ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళగానే కేశవ హరి బామ్మర్ది మీ చెల్లి వచ్చింది తీసుకెళ్లమని అంటాడు. ఇక తర్వాత నిన్ను ఎవరైనా గానీ ఒక్క మాట అన్నా.. నిన్ను ఒక దెబ్బ కొట్టిన నాకు చెప్పు నేను వాళ్ళ సంగతి చూస్తాను అని కేశవ అందరికీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.. వరల్డ్ మాత్రం శైలుని ఎందుకు వచ్చావే మళ్ళీ అంటూ తిడుతుంది ఆ మాట వినగానే శైలు నీ పరువు పోగొడితేనే నేను వచ్చాను అని అంటుంది. ఏది ఏమైనా కూడా శైలు మళ్లీ ఇంటికి తిరిగి రావడంతో శంకరయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ఏంటే మళ్ళీ ఇంట్లోకి వచ్చావు వాడు నిన్ను వదిలేసాడా అని వరాలు దారుణంగా మాట్లాడుతుంది.. కట్నం తీసుకొస్తేనే నీ మెడలో తాళి కడతాను అని అన్నాడా? ఎందుకు మళ్లీ వచ్చావు వెళ్లిపోయిన దానివి వెళ్ళిపోవచ్చు కదా ఎక్కడైనా చావచ్చు కదా మళ్లీ ఎందుకు వచ్చావు అని వరాలు చాలా కోపంగా శైలుపై అరుస్తుంది.. వాడు నీ నువ్వు తెచ్చే డబ్బులు కోసమే నిన్ను ప్రేమించాడన్న సంగతి నీకు ఇప్పటికైనా అర్థమైందా అని వరాలు అంటుంది. నువ్వు ఆలోచించడం ఇంతేనమ్మ ఇంతకుమించి నువ్వు ఆలోచించలేవు అని శైలు అంటుంది.. నేను పెళ్లి చేసుకుందామని తీసుకుని వెళ్లిన సరే అతను మాత్రం మీ కుటుంబం పరువు పోకతలికే నువ్వు మీ ఇంట్లో ఉండాలి అని నన్ను ఒప్పించి ఇక్కడికి తీసుకొని వచ్చాడు అని చెప్తుంది. ఆ ఇంటి బయట నుంచి మాత్రమే కాదు ఆ ఇంటి లోపలికి వెళ్లి ఆ ఇంట్లో మనుషుల గురించి ఆలోచించమ్మా అని శైలు చెప్పగానే శంకరయ్య నువ్వు ఆగమ్మా లోపలికి వెళ్ళు అని అంటాడు..
కేశవ ఇంట్లో వాళ్ళు ఏమంటారు అని ఆలోచిస్తూ ఇంటికి వస్తాడు. బయటే ఉన్నా నారాయణ ఏంట్రా ఒక్కడివే వచ్చావు అమ్మ ఎక్కడ అని అడుగుతాడు. ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను అని చెప్పగానే భయపడ్డావా కేసు పెడతానని బెదిరించారా? ఎందుకు నువ్వు ఇలా చేశావు అని నారాయణ అరుస్తాడు. ఒక అమ్మాయి నిన్నే కావాలి అని కోరి వస్తే నువ్వు ఇలా తనని వద్దు అని వాళ్ళ ఇంట్లో వదిలిపెడతావా? అసలు నువ్వు ఏం మనిషివి రా నువ్వేం మగాడివి రా అంటూ నారాయణ తిడతాడు.. కానీ నారాయణన్న మాటకి కేశవ నువ్వు నన్ను పర్వాలేదు.. కానీ నేను మాత్రం అన్నయ్యకి పెళ్లి కాకుండా పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు అని చెప్పగానే వాడు నువ్వు ఇద్దరు వెళ్లి సన్యాసం తీసుకోండి రా అని నారాయణ అరుస్తాడు.. ఏ అమ్మాయి నైనా తీసుకుని వెళ్లి పెళ్లి చేసుకోవాలి అనుకోవాలి కానీ ఇలా తన ఇంటి దగ్గర వదిలేసి రావడం మూర్ఖత్వం అంటారు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు..
కేశవా లోపలికి అడుగుపెట్టగానే చక్రి ఏంటి ఒక్కడివే వచ్చావ్ అమ్మాయి ఎక్కడ అని అడుగుతారు. ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో దిగబెట్టేసి వచ్చాను. ఎందుకురా ఎందుకిలా చేశావు నువ్వు ఏం జరిగింది? మీరిద్దరే మన గొడవ పడ్డారని చెక్రి అడుగుతాడు.. మేమిద్దరం గొడవ పడడం కాదు ఇప్పుడే పెళ్లి చేసుకోవద్దు అని ఆలోచించాము అందుకే తనని వాళ్ళింట్లో వదిలి పెట్టేసి వచ్చాను అని కేశవ చెప్పగానే చక్రి ఇద్దరిద్దరూ త్యాగమూర్తులని అనుకుంటున్నారా..? అప్పుడు గాయత్రి కూడా అంతే అన్నయ్య కోసం పెళ్లి పెట్టుకొని మరీ వస్తే వదిలేసి తన కుటుంబం కోసం త్యాగం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. కానీ ఇప్పుడు నువ్వు కూడా ఇలాగే ఆలోచిస్తావా అని కేశవ పై చక్రి సీరియస్ అవుతాడు.. మీరిద్దరూ ఇంతగా ఆలోచించి మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటారని నేను అసలు ఊహించలేదు అని చక్రి ఆవేశంగా బయటికి వెళ్లిపోతాడు..
కేశవ ఇలా చేయడం వల్ల నేను చాలా బాధపడిపోతున్నాను అని చక్రి బయటకు వెళ్లి ఒంటరిగా ఆలోచిస్తూ ఆవేశ పడిపోతూ ఉంటాడు. కేశవా ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థం కావడం లేదు అని చక్రి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే బయటకు వచ్చిన కేశవ అని ఏంట్రా నువ్వు చేసింది నిన్ను కోరి వచ్చిన ఆ అమ్మాయిని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు. మీరిద్దరూ ఏదైనా గొడవ పడ్డారా ఎందుకు నువ్వు ఇప్పుడు పెళ్లి వద్దు అంటున్నావు అని అడుగుతాడు.. అయితే నేను పెళ్లి చేసుకునే నా సంతోషాన్ని చూసుకుంటే అన్నయ్య పెళ్లి ఎలా అవుతుంది అని నేను ఆలోచించాను రా అందుకే ఈ పెళ్లి వద్దు అని అనుకున్నాను అని కేశవ అంటాడు.. ఇప్పటికే నువ్వు పెళ్లి చేసుకుందామని అన్నయ్యకి పెళ్లి కాదు అని అందరూ అంటున్నారు ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసుకుంటే ఆ మాటే నిజం అవుతుంది అని కేశవ అనగానే చక్రి ఎమోషనల్ అయిపోతాడు.. నువ్వు ఇంత దూరం ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదురా.. నువ్వు నిజంగా గ్రేట్ రాణి చక్రి కేశవ పై ప్రశంసలు కురిపిస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…