E-Paper
Advertisement

Podarillu Today Episode : విక్కీకి చక్రీ ఝలక్.. కన్నాకు సపోర్ట్ గా మహా.. మాధవ్ కు నిజం చెప్పిన శైలు..

Podarillu Today Episode : విక్కీకి చక్రీ ఝలక్.. కన్నాకు సపోర్ట్ గా మహా.. మాధవ్ కు నిజం చెప్పిన శైలు..
Advertisement

Podarillu Today Episode august 26th :నువ్వేంటి రా నా వెనకాల తిరుగుతున్నావు తల్లి వెనకాల పిల్లదిరిగినట్టు అని చక్రీ కూడా వెటకారంగా మాట్లాడుతాడు.. నేను ఏమి అనలేదు నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావో అని అనుమానంతో అడుగుతున్నాను అని కన్నా అంటాడు. మీ వదిన ఆ విక్కీని చూసి పడిపోతుందేమోను భయంగా ఉంది నేను మీ వదినని ఎలా ఇంప్రెస్ చేయాలనీ ఆలోచిస్తూ ఉన్నాను అని చక్రి అంటాడు అయితే లోపలికి వెళ్ళిన కన్నా చక్రి డ్రస్సులను తీసుకొని వచ్చి చూపిస్తాడు.. ఇంట్లో ఇల్లు తుడవడానికి ఉపయోగించే క్లాత్ను నువ్వు వేసుకుంటున్నావు మరి నిన్ను చూసి వదిన ఎలా ఇంప్రెస్ అవుతుంది అని కన్నా తనకి ఒక అద్భుతమైన సలహా ఇస్తాడు. ఇక చక్రి తన డ్రెస్సింగ్ స్టైల్ ని మార్చాలని ఫిక్స్ అవుతాడు.

చక్రీని చూసి కేశవ షాక్..

చక్రి స్టైల్ చూసి ఇలా ఉండాలి అని కన్నా అనుకుంటాడు కానీ ఇంట్లోనే వాళ్ళందరూ కూడా చక్రీ ని చూసి ఏంటి వీడు ఇలా తయారయ్యాడు పగటివేషించాలని ఎందుకు లోపలికి రానిచ్చారు అని కేశవ కూడా అనడంతో చక్రీ చాలా ఫీల్ అవుతాడు.. కానీ మాధవ్ మాత్రం నీ డ్రెస్ చాలా బాగుందిరా నువ్వు నిజంగా ఇలా ఉంటే చాలా అందంగా ఉన్నావ్ రా అని అనడంతో చక్రి ఇంకాస్త రెచ్చిపోతాడు.. నిజంగానే నేను అంత బాగున్నాను అన్నయ్య నిజం చెప్పు అని అడుగుతాడు. నీకేం రా ఈ డ్రెస్ లో నువ్వు బంగారం లాగా ఉన్నావు అని బాధ పొగుడుతుంటే కేశవ మాత్రం నాకు ఏదో తేడాగా ఉన్నాడు అన్నయ్య అంటూ పరువు తీసేలా మాట్లాడుతాడు.. దానికి చాలా ఫీల్ అయిపోతాడు చక్రి..

మహా మాటతో చక్రీ హ్యాపీ..

Advertisement

మహాలక్ష్మి చక్రిని స్టైల్ గా ఉండడం చూసి చాలా బాగున్నారు తెలుసా అని అంటుంది. మీరు అలా అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చక్రి అంటాడు. నిజంగానే ఈ డ్రెస్ లో మీరు నిజంగా హీరోలాగే ఉన్నారని మహాలక్ష్మి తెగ పొగిడేస్తూ ఉంటుంది. ఆ మాట విన చక్రి సంతోషంలో మునిగిపోతూ ఉంటాడు. మీరు ఇలా అంటూ ఉంటే నిజంగానే నేను తట్టుకోలేకపోతున్నాను నిజంగానే నేను అంత అందంగా ఉన్నానా అని అనుమానం కూడా వస్తుంది అంటే చక్రి అంటాడు. ఆ మాట మహాలక్ష్మి విని నిజంగా ఇలా ఉంటే హీరో లాగా ఉన్నారు ఏ అమ్మాయి అయినా మీకు పడిపోతుంది అని అంటుంది. అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా మహాలక్ష్మి అన్న మాట విని నాకేదో డౌటే అని అనుకుంటారు..

కన్నా గురించి నిజం తెలిసిపోతుంది..?

కన్నా గురించి ఒక నిజాన్ని ఎలాగైనా సరే మహాలక్ష్మికి చెప్పాలి అని వెయిట్ చేస్తూ ఉంటాడు. మహాలక్ష్మి వదిన ఇంకా రాలేదేంటి ఎందుకు వదిన ఇంకా లోపలే ఉంది అని కన్నా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక ఎంతసేపటికి రాలేదు అని తన గదిలోకి వెళ్లాలని అనుకుంటాడు. మహాలక్ష్మి ఏంట్రా కన్నా అంతగా అరుస్తున్నావ్ ఏమైంది ఇంకా టైం అవ్వలేదు కదా అని అడుగుతుంది.. కానీ వదిన నేను రాత్రి ఒక విషయం గురించి చెప్పాను కదా.. ఆ అమ్మాయి నాకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది వెళ్దాం పదానికి గదిలోకి వెళ్లి సీక్రెట్ గా మాట్లాడడం విన్న చక్రి అమ్మాయిల్ని మెయింటైన్ చేసే వయసు వచ్చిందా రా నీకు అంటూ కన్నా నీ ఏడిపించేస్తాడు. కానీ కన్న మాత్రం మహాలక్ష్మి మాట విని మౌనంగా ఉండిపోతాడు.

అమ్మాయిని చూపించిన కన్నా..

Advertisement

బస్టాప్ లో నాకోసం ఒక అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంటుందని చెప్పాను కదా.. వదినా అక్కడికి వెళ్దాం పదా అనేసి అనగానే చక్రి నేను కూడా వస్తాను పద అని వెళ్తాడు. చక్రి అమ్మాయిని చూసి ఏదో ఒక మాట మాట్లాడుతూ ఉంటే మహాలక్ష్మి చాలా కోపంగా అతనిపై అరుస్తుంది. ఇంత చిన్న వయసులో నీకు లవ్వు గివ్వు ఏంట్రా.. నీ కన్నా అని అనడంతో వాడు నీలాగేమీ నేను లవ్ చేస్తున్నాను అని ఆంటీల వెనకాల పడలేదు కదా.. ఆంటీల వెనకాల వెళ్లడంతో పాటుగా బొట్లు అంటించుకోవడం ఇలాంటివన్నీ చాలానే చేస్తుంటావు కదా నీ టైపు వాడు అసలుకే కాదు అని మహాలక్ష్మి అంటుంది. ఆ మాట వినగానే చక్రి చాలా ఫీల్ అవుతాడు.

మాధవ్ కు నిజం చెప్పిన శైలు..

శైలు మాధవ్ వెళుతూ ఉండగా మాధవ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. మీ పేరు మాధవ్ కదా మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్య పెద్ది అంటూ కేశవ వాళ్ళ అన్నయ్య అంటూ చాలా రకాలుగా పిలుస్తూ తన వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి మాధవ్ ని ఆపుతుంది. నిజంగానే మీతో మాట్లాడాలి అని చాలా సేపటి నుంచి అరుస్తున్నానా మీరు పట్టించుకోవడం లేదు అని లోడల్లోడా వాగేస్తూ ఉంటుంది. అది విన్న మాధవ్ కేశవ తో కూడా ఇలానే మాట్లాడతావా అమ్మ నువ్వు అని అంటాడు.. వాడు నాతో ఎందుకు మాట్లాడతాడు ఒక్క మాట మాట్లాడతలికి ఏదో ఒకటి బాగోదు అని నన్ను అరుస్తూ ఉంటాడు అని అంటుంది.. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు మీరు పెళ్లి చేసుకుంటేనే మేము పెళ్లి చేసుకుంటాము అని మాధవ్ ని బాధపెట్టేలా మాట్లాడుతుంది. ఆ మాట విన్న మాధవ్ వాడితో నేను మాట్లాడుతాను నువ్వేం కంగారు పడకమ్మా అని అంటాడు.

చక్రీ పై మహా సీరియస్..

చక్రి తనకి జ్వరమొచ్చిందని అబద్ధం చెప్పినట్లు తెలియదు. మహాలక్ష్మి ఆఫీస్ లోకి అడుగు పెట్టగానే చక్రి చెప్పిన మాట విని విక్కీ నిజమే అని నమ్ముతాడు. మహాలక్ష్మి లోపలికి రాగానే తనకి జ్యూస్ ఇచ్చి స్పెషల్ గా ట్రీట్ చేస్తాడు. నేను ఇంకా జ్యూస్ అడగలేదు కదా ఆఫీసులోకి రాకదలకే ఈ స్పెషల్ వెల్కమ్ ఏంటి అని మహాలక్ష్మి అడుగుతుంది. సారీ మనీ మీకు చెప్పాడు మేడం అని ఫీల్ చెప్పగానే వెనకాలే వచ్చిన విక్కి మీకు జ్వరం అని చెప్పారు కదా.. మీకు ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతాడు. చక్రి అబద్దం చెప్పాడని తెలుసుకున్న మహా చాలా సీరియస్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మాధవ్ కి పెళ్లి చేసేందుకు అందరూ బిజీగా మారుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: కొడుకు కోసం పార్వతి ఎమోషనల్.. అయ్యో శివ.. బాలు దెబ్బకు గుణ షాక్..

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×