E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: కొడుకు కోసం పార్వతి ఎమోషనల్.. అయ్యో శివ.. బాలు దెబ్బకు గుణ షాక్..

Gundeninda GudiGantalu Today episode: కొడుకు కోసం పార్వతి ఎమోషనల్.. అయ్యో శివ.. బాలు దెబ్బకు గుణ షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode August 26th : సుమతి ఈ విషయాన్ని ఎలాగైనా సరే అరుణ్ కు ఒకసారి చెప్తే తన ద్వారా కూడా శివుని పట్టుకునే అవకాశం ఉంటుంది అని అనుకుంటుంది.. శివ మిస్ అయిన విషయాన్ని అరుణ్ కి ఫోన్ చేసి చెప్తుంది.. అరుణ్ సైబర్ క్రైమ్ లో ఇన్ఫర్మ చేసి శివ అడ్రస్ ని కనుక్కునే ప్రయత్నం చేస్తాడు.. అదే పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన బాలుకి మాత్రం అక్కడున్న పోలీసులు అలా అడ్రస్ చెప్పడం కుదరదు. ముందు మీరు పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి బాలు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మీకు సమాచారం ఇస్తామని చెప్తాడు. బాలు ఎంతగా రిక్వెస్ట్ చేసినా సరే అక్కడున్న పోలీస్ మాత్రం ముందు ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి అని చెప్తాడు. ఇక బాలు బయటికి వెళ్ళగానే అరుణ్ చెప్పినా అడ్రస్ ని సుమతి బాలుకి చెప్తుంది. ఆ అడ్రస్ విని బాలు షాక్ అవుతాడు..

పార్వతికి నిజం చెప్పిన మీనా..

సుమతి చెప్పిన అడ్రస్ ప్రకారం బాలు నేను అక్కడికి వెళ్లి వాడు ఉన్నాడో లేదో చూసి ఇస్తాను మీరేం కంగారు పడకండి అని అంటాడు. అయితే సుమతి ఒక్కటే శివ ఎక్కడున్నాడు అంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంట్లోకి సడన్గా ఎంట్రీ ఇచ్చిన పార్వతి శివ ఎక్కడ ముందు ఫోన్ చెయ్ అని అంటుంది. వాడు ఎగ్జామ్ కి వెళ్ళాడేమో అమ్మ ఇప్పుడు ఫోన్ చేసిన వాళ్ళు లిఫ్ట్ చేయడు అని సుమతి ఎంతగా పార్వతికి నచ్చ చెప్పాలని ప్రయత్నం చేసినా సరే.. పార్వతి మాత్రం ఎందుకే నాకు అబద్ధం చెప్పాలని చూసావు వాడు ఇంకా మంచిగా ఉండాలని ప్రయత్నించిన సరే ఆ వెధవ దీన్ని ఉండనివ్వట్లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అసలు నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అమ్మ అని సుమతి అడుగుతుంది. నేనే చెప్పాను అని మీనా అక్కడికొస్తుంది. పార్వతికి మీనా ధైర్యం చెప్తుంది..

బాలు ఎంట్రీ తో సీన్ రివర్స్..

Advertisement

పార్వతి తన కొడుకు బాగుపడతాడు అని చాలా సంతోషపడేది. కానీ ఇప్పుడు ఆ గుణ వల్ల తన కొడుకు జీవితం అయోమయంలో పడబోతుంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వేమి కంగారు పడకమ్మా ఆయన వెళ్లారు కదా ఖచ్చితంగా శివని తీసుకొని వస్తారు.. అంతే కాదు వాడి చేత ఎగ్జామ్ కూడా రాయిస్తాడు అని మేన ధైర్యం చెబుతుంది. అటు గుణ నా మాట విని నా దగ్గర ఉంటే నువ్వు మంచిగా డబ్బులు సంపాదించుకుంటావు.. నువ్వు ఎంత చెప్పినా వినవు కదా అందుకే నీకు ఈ మత్తు ఇంజక్షన్ వేయిస్తాను.. నిన్ను డ్రగ్స్ కేసులు ఇరికిస్తాను అని గుణ అనగానే శివ షాక్ అవుతాడు. ఇక శివాకి ఇంజక్షన్ ఇచ్చే టైంలో సడన్గా బాలు ఎంట్రీ ఇస్తాడు.. ఆలు ఎంట్రీ తో గుణ ముఖంలో ఫ్యూజులు ఎగిరిపోతాయి. గుణ ని చూసి కోపంతో రగిలిపోయిన బాలు నీకు ఈరోజు ఉంటుంది అంటూ వార్నింగ్ ఇస్తాడు. బాలుని సడన్గా చూడడంతో గుణ మైండ్ బ్లాక్ అయిపోతుంది.

రౌడీలను చితక్కోట్టిన బాలు..

నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదంటారా.. ఎందుకురా నువ్వు వాడు రాను అంటుంటే వాడి వెనకాల పడుతున్నావు. బాగా తిని దున్నలాగా తయారయ్యావు. నీకు ఇప్పుడు మామూలుగా ఉండదు. అందుకని ఎక్కువ నీకే పడతాయి చూడు అంటూ బాలు సెటైర్ల వర్షం కురిపిస్తూనే గుణతో పాటుగా తన మనుషుల్ని కూడా చితక్కొట్టేస్తాడు. ఇక బాలు సీన్లోకి ఎంట్రవడంతో యాక్షన్ ఓ రేంజ్ లో ఉంటుంది.. గుణ మనుషులందరినీ కొట్టేస్తాడు బాలు. నువ్వు ఇలాంటి ఎదవని తెలిసి కూడా నీతో స్నేహం చేశాడు కాబట్టే వాడు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటూ బాలు గుణాన్ని కూడా దారుణంగా కొట్టేస్తాడు. పోలీసులు సడన్గా సీన్లోకి ఎంట్రీ ఇస్తారు. పోలీసులు వచ్చి ఆ గుణ ని తీసుకెళ్లాలని అనుకునే లోపులే అతను పారిపోతాడు. కానీ బాలుకి పోలీసుల గురించి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్న అనుమానం మొదలవుతుంది.. మా డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి ఈ పరిస్థితి గురించి వివరించి లొకేషన్ పంపించారు. దాంతో మేము ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది నువ్వేం కంగారు పడకు బాలు వాటి గురించి మేము చూసుకుంటాము అని పోలీసులు చెప్తారు. మొత్తానికి శివ ను బాలు కాపాడుతాడు.

సుమతి పై అనుమానం..

Advertisement

సుమతి పక్కకు వెళ్లి అరుణ్ కి ఫోన్ చేసి మా తమ్ముడిని కాపాడేందుకు మీరు చేసిన ప్రయత్నం బాగుంది దొరికారు అని చెప్పగానే. అరుణ్ మాత్రం మీ బావ ముందే వెళ్లి ఆ రౌడీలను చితగ్గొట్టి మీ శివని కాపాడాడు. పోలీసులు వెళ్ళగానే వాళ్ళందరూ పారిపోయారట అని అరుణ్ చెప్పగానే మా బావ నిజంగానే గ్రేట్ అని సుమతి బాలుని తెగ పొగిడేస్తుంది.. ఇక లోపలికి వెళ్ళగానే సుమతి చెప్పిన మాటకి పార్వతి అలాగే మీనా ఇద్దరు షాక్ అవుతారు.. ఇక పార్వతి సుమతికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తే బాగుంటుంది అని అనగానే.. మీనా ఆ శ్రమ మనకు అక్కర్లేదులేమా తనే వెతుక్కుంటుంది అని అంటుంది. పార్వతికి సుమతి పై డౌట్ వస్తుంది..

మనోజ్ పై ప్రభాకు అనుమానం..

మీనా ఇంకా రాలేదు కనీసం టీ పెట్టే దిక్కు కూడా లేదు అంటూ శృతి బాలు రవి ముగ్గురు కూడా తనకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే మనోజ్ ఇంట్లోకి రావడం చూసినా ప్రభావతి ఆ మంత్రగత్తే షోరూం కి వచ్చిందా అని అడుగుతుంది. కానీ రాలేదు అని మనోజ్ చెప్పగానే ప్రభావతి మాత్రం రోహిణి పై అనుమానంతో మళ్లీ మళ్లీ అడగడంతో బాలు సెటైర్ల వర్షం కురిపిస్తాడు.. ఇక ప్రభావతిని బాలుతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక ఆట ఆడుకుంటారు. అప్పుడే లోపలికి వచ్చిన రోహిణిని చూసి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కానీ రోహిణి మాత్రం బ్యాగ్ లోంచి డబ్బులు తీసి ఇస్తుంది. ప్రభావతికి కాస్త అనుమానం మొదలైన సరే రోహిణి మాట విని ఆగిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ఇంట్లో బాంబ్ పేల్చిన ప్రేమ.. శ్రీవల్లి చెంప చెల్లు.. అమూల్య ప్రేమలో పడిందా..?

Related News

Illu Illalu Pillalu Today Episodes: ఇంట్లో బాంబ్ పేల్చిన ప్రేమ.. శ్రీవల్లి చెంప చెల్లు.. అమూల్య ప్రేమలో పడిందా..?

Intinti Ramayanam Today Episode: పల్లవి పై అవని కామెంట్స్.. పల్లవి రంగు బయటపడిందా..? అక్షయ్, అవని కాపురంలో చిచ్చు..

Brahmamudi Serial Today Episode August 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: మరోసారి ఇందుతో చాలెంజ్ చేసిన ఐశ్వర్య      

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. సినీ ప్రియులకు పండగే..

ఈశ్వర్ సాయి వీడియో మళ్లీ బయటకు.. రాఖీ కట్టించుకో అంటూ…

కొమరం కన్నీళ్ల వెనుక ఇంత కథ ఉందా !

ఈశ్వర్ సాయి మాటలు నమ్మొచ్చా? మాధురి వివాదంలో కొత్త డౌట్స్

Big Stories

Advertisement
×