E-Paper
Advertisement

Podarillu Today Episode : అయ్యో పాపం.. చక్రీ కోసం మాధవ్ ఫీల్.. మహా దెబ్బకు షాక్.. ఇదేం ట్విస్ట్ సామి..

Podarillu Today Episode : అయ్యో పాపం.. చక్రీ కోసం మాధవ్ ఫీల్.. మహా దెబ్బకు షాక్.. ఇదేం ట్విస్ట్ సామి..
Advertisement

Podarillu Today Episode July 14th: మహాలక్ష్మి నవ్వుతూ ఉండగా చక్రి.. నవ్వుతూనే ఉంటారా ఏదైనా ఒక ఆట ఆడుకుందాం పదండి అని అందరూ కలిసి కళ్ళకు గంతలు కట్టుకునే ఆటనే ఆడుకుంటారు. ఇక మహాలక్ష్మి వంటగ దొరకడంతో చక్రి తన మనసులోని మాటని చెప్పాలని అనుకుంటాడు. అయితే తన మనసులో మాట చెప్పబోతూ ఉండగా నారాయణను సెక్యూరిటీ పోలీసులకు పట్టిస్తాను అని గొడవకు దిగుతాడు.. ఇక నారాయణ ఏం చేశాడో తెలుసుకోవాలని అందరూ అక్కడికి వెళ్తారు.. ఆయన మందు తాగి ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్నాడని చెప్పగానే మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఇక సెక్యూరిటీ దగ్గర నుంచి నారాయణను విడిపించి ఇంటికి తీసుకొని వస్తారు.. అందరూ కలిసి నారాయణను ఒక ఆట ఆడుకుంటారు.. నారాయణ ను తీసుకొచ్చిన మహాలక్ష్మిని కూడా అందరూ తిడతారు..

కన్నీళ్లు పెట్టుకున్న చక్రీ…

మాధవ్ పనిచేస్తున్న సైట్ కి వెళ్లిన చక్రి ని చూసిన మాధవ్ ఏమైంది ఇక్కడికి వచ్చావ్ ఏంటి రా అని అడుగుతాడు.. అయితే ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక ఇక్కడికి వచ్చాను అన్నయ్య అని చక్రీ అంటాడు. అదేంట్రా ఎలా ఉన్నావ్? ఏం జరిగింది రా? మాధవ్ అడుగుతాడు.. ఏం లేదు అన్నయ్య లాయర్ ఫోన్ చేశారు అంత డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేశాడట.. వచ్చి సంతకాలు పెడితే కోర్టుకు పంపిస్తాడట అని చెప్పాడు అని చక్రి బాధపడుతూ ఉంటాడు.. వీరిద్దరూ విడిపోతారు అని అనుకున్నప్పటి నుంచి చాలా బాధగా ఉంది రా నిద్ర కూడా పట్టడం లేదు అని మాధవ్ అనగానే.. నువ్వు నిద్రపోవడం లేదా ఏంటి అన్నయ్య అబద్దం చెప్తున్నావ్ నాకు అని చక్రి అడుగుతాడు.. కానీ చక్రితో నేను మాట్లాడతానని మాధవ్ ఎంతగా చెప్పిన సరే వద్దులే అన్నయ్య నేనే నా ప్రేమని తనకు అర్థం అయ్యేలా చెప్తాను అని అంటాడు..

చక్రీ కోసం వెళ్లిన మహా..

Advertisement

చక్రి తర్వాత రోజు మహాలక్ష్మి ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు.. మీతో మాట్లాడాలని వచ్చాను అలా కూర్చొని మాట్లాడదామా అని కూల్ గా అడుగుతాడు.. దేని గురించి మాట్లాడాలో చెప్పండి అని మహాలక్ష్మి అంటుంది. మీరు నన్ను భర్తగా ఒప్పుకోకపోయినా కూడా.. నేను మిమ్మల్ని తాళి కట్టిన భార్య గాని అనుకుంటున్నాను. మీరు కూడా అలానే ఉంటే బాగుంటుంది అని చక్రి అనగానే మహాలక్ష్మి మైండ్ బ్లాక్ అవుతుంది.. మిమ్మల్ని నేను చాలా సంతోషంగా చూసుకుంటాను అని చక్రి అనగానే మహా ఆలోచనలో పడుతుంది.. మరి చక్రి తో మహాలక్ష్మి కలిసిపోతుందా? లేదంటే బృందావనంకి దూరంగా వెళ్లిపోతుందా అన్నది సస్పెన్స్ గా మారింది? చక్రి తన మనసులోని మాటని చెప్పాలనుకుంటాడు కానీ తన ఫ్రెండ్స్ వచ్చి మధ్యలో వాళ్ళ స్టోరీని చెప్పడంతో ఆగిపోతాడు.. మహాలక్ష్మి గారికి నా మీద ప్రేమ వస్తే తనే చెప్తుంది లే అని అనుకుని బయలుదేరుతారు..

చక్రీ కోసం బాధపడ్డ అన్నదమ్ములు..

మాధవ్ అలాగే కన్నా ఇద్దరు కూడా చక్రీ మహా కు ప్రేమని చెప్తానని వెళ్ళాడు రా.. వాడు ఏం చెప్పాడు మహాలక్ష్మి ఎలా రియాక్ట్ అవుతుందో నాకు అర్థం కావడం లేదు అని మాధవ కంగారు పడిపోతూ ఉంటాడు.. మీరు తిన్నారా అందరూ కూడా చక్రి ఏం చెప్పాడో మహాలక్ష్మి ఎలా రియాక్ట్ అవుతుందని టెన్షన్ పడుతూ ఉండగా వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చేస్తారు.. అయితే వీళ్ళిద్దరూ ఇంత ప్రశాంతంగా వస్తున్నారు అంటే ఎటువంటి గొడవ జరగలేదని అర్థమవుతుంది అని అనుకుంటారు.. మహాలక్ష్మి ఏమైనా అయిందా అని చెప్తున్నా సరే తను మాత్రం ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతుంది.. చక్రి కూడా ఏ మాట చెప్పకుండానే లోపలికి వెళ్లి పడుకుంటానని అంటాడు.. ఇద్దరికీ ఏదో జరిగినట్లుంది.. లేదంటే వీళ్ళు ఇలా ఉండరు అని అందరూ ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటారు..

అయ్యో.. చక్రీ అక్కసు ను కక్కేస్తాడు..

Advertisement

అందరూ భోజనం చేస్తూ ఉండగా చక్రి మాత్రం భోజనం చేయడానికి అస్సలు రాడు.. కన్న వెళ్లి భోజనం అని ఎంత చెప్తున్నా సరే నాకు ఆకలిగా లేదు మీరు వెళ్లి తినండి అని అనగానే అందరూ వెళ్లి తినడానికి కూర్చుంటారు.. మహాలక్ష్మిని ఏమైంది కానీ ఎంతగా అడుగుతున్న సరే. తను మాత్రం నేను ఏమీ అనలేదు తన కడుపులో ఏమో బాగా లేదేమో అని అంటుంది.. అందరూ కూడా భోజనం చేస్తారు కానీ చక్రి మాత్రం భోజనం చేయకుండా ఒంటరిగా ఉంటాడు.. అయితే అందరూ పడుకున్న తర్వాత లోపలికి వచ్చిన చక్రి అందరూ ప్రశాంతంగా పడుకుంటున్నారు కదా పడుకోండి అని చక్రి అంటాడు. ఇప్పుడు బాధపడుతున్నాడు అని మీకు ఏమాత్రం లేదు.. తన మనసులోని ఆవేశాన్ని కక్కేసి బాధపడిపోతూ వెళ్ళిపోతాడు. అయితే మాధవ్ వాడు బాధలో ఉంటే ఎందుకురా అలా మాట్లాడుతున్నావు అని అంటాడు.. మరి ఇప్పుడు వాడిని కూల్ చేయడం ఎలా అన్నయ్య అని అందరూ బాధపడిపోతూ ఉంటారు..

మాధవ్ మాటతో చక్రీ మారతాడా..?

చక్రి బాధ పడిపోతున్నాడు కదా నేను వెళ్లి వాడితో మాట్లాడుతాను అని మాధవ్ చక్రికి భోజనం తీసుకుని బయటకు వెళ్లి కూర్చొని మాట్లాడుతాడు. ఏం బాధపడకురా నీకు చెందాలనుకుంటే నీకు చెందుతుంది. అయితే శబరి రాముడి కథ చెప్పి మాధవ్ చక్రి బాదని కాస్త తగ్గిస్తాడు.. రాముడు వస్తాడన్న సంకల్పంతో శబరి ఉనింది కాబట్టే రాముడు ఎప్పటికైనా వస్తాడు అని ఉంది అలానే వచ్చాడు తన కోరికను తీర్చాడు. నువ్వు కూడా నీ మనసులోని సంకల్పాన్ని గట్టిగా అనుకుంటే కచ్చితంగా విడాకులు కావాలి అని అడగదు నీకు దగ్గరవుతుంది.. నువ్వు ఇదే మనసులో పెట్టుకుని ఉండు అని మాధవ్ చెప్పగానే చక్రి భోజనం చేస్తాడు..

చక్రీ డైలాగ్ తో ఎమోషనల్…

ఉదయం లేవగానే చక్రి గడియారం వైపు చూస్తూ బాధపడిపోతూ ఉంటాడు. ఎందుకురా ఏమైందిరా అని అడుగుతారు. ఆ గడియారం మాగిపోతే బాగుండు అని ఆలోచిస్తున్నా అన్నయ్య అని అనగానే కన్నా వచ్చి దాని బ్యాటరీ తీస్తే ఆగిపోతుంది కదా అని అంటాడు.. మీ వదిన ఆగదు కదరా అని అనగానే అందరూ ఒక్కసారిగా బాధ పడిపోతూ ఉంటారు. అందరిని తన ఎమోషనల్ డైలాగులతో కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తాడు చక్రి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ ప్లాన్ సక్సెస్.. ప్రేమ కు సపోర్ట్ గా రామరాజు.. శ్రీవల్లికి షాక్..

Related News

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ..ఆ మూవీ స్టైల్ లో సీమంతం!

Podarillu Kanna : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కన్నా అవుట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Big Stories

Advertisement
×