Podarillu Today Episode July 28th: నేను కంప్లైంట్ తీసుకుంటానమ్మా మీ అమ్మాయి వచ్చి మీకు వ్యతిరేకంగా పోలీసులకు చెప్తే నాకే సంబంధం లేదు అని అంటారు.. నేను చచ్చిన కూడా మా వాళ్లకి అనుకూలంగా మాత్రం అస్సలు చెప్పను అని అంటుంది. ఏంటే నువ్వు ఇలా తయారయ్యావు ఇంట్లో వాళ్ళ మీద కేసు పెడతానని అంటావా? కొంచమైనా సిగ్గుందా అని శైలుపై అరుస్తుంది వరాలు. ఇక గాయత్రి సడన్గా ఇంటికి వచ్చింది ఏంటి అని తాయారు కంగారు పడిపోతూ ఉంటుంది.. తన భర్త అసలు నిజం చెప్పడంతో గాయత్రీ అందుకోసమే ఇంటికి వచ్చిందా అని అనుకుంటుంది. ఇక గాయత్రీ కి రమణయ్య నిజం చెప్తాడు. ఇక గాయత్రి మా బావ అలాంటివాడు కాదు మా ఇంట్లో వాళ్ల గురించి నాకు బాగా తెలుసు అని మాధవ కుటుంబానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది.. ఇక మొత్తానికి గాయత్రి మళ్లీ సీన్లోకి ఎంట్రీ ఇవ్వడం ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది..
ముగ్గురు ఆడవాళ్లు కలిసి బృందావనంలో ఉన్న వ్యక్తులకు సపోర్టుగా నిలవడంతో వరాలు ఏమి చేయలేక అక్కడ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. నా కొడుకు ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదమ్మా ఒక ఆడపిల్లని ఇలా అవమానిస్తాడని అనుకోలేదు అంటూ శైలు వాళ్ల నాకు క్షమించమని మహాలక్ష్మిని అడుగుతాడు. ఇక వరాలు అందర్నీ తీసుకుని వెళ్ళిపోతుంది.. అయితే ముగ్గురు ఆడవాళ్ళని చూసినా ఈ అన్నదమ్ములు ఆ ఇంటిని కాపాడడానికి వచ్చిన దేవతల్లాగా కనిపిస్తారు.. మాధవ్ మా బృందావనాన్ని కాపాడడానికి వచ్చిన దేవతల్లాగా మీరు కనిపిస్తున్నారు అని మనసులో అనుకుంటాడు.. ఇక అందరూ ఎటువంటి వెళ్ళిపోగానే మన ఇంటి గురించి ఉన్న మాటలు ఈరోజుతో వెళ్లిపోయాయని అందరూ ఆలోచిస్తూ ఉంటారు..
మాధవ్ మహాలక్ష్మికి ఇలా జరగడం చాలా అవమానంగా ఉంది అని బాధపడుతూ ఉంటాడు.. ఆడపిల్ల గురించి వాళ్ళు ఎలా మాట్లాడుతారు అర్థం కావడం లేదు.. ఐదుగురు మగాళ్లు ఉంటే ఆ ఇంట్లో ఆడపిల్లలు మంచిగా ఉండ లేదా అని మాధవ్ బాధపడిపోతూ ఉంటాడు.. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు పెద్ది ఎందుకు నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు అని మహా అంటుంది. కానీ మన ఇంటి ఆడపిల్లకి ఇంత ఘోర అవమానం జరగడం నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను అని మాధవ్ చాలా బాధపడిపోదు కనిపిస్తాడు.. మీదట నుంచి మహాలక్ష్మి ఎక్కడికి వెళ్తున్న సరే మనం తోడుగా వెళ్లాలి అని మాధవ్ అంటాడు.. అయితే చక్రి మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళినా సరే తీసుకుని రావాల్సిన బాధ్యత తనది అని మాధవ్ అంటాడు.. ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే మహాలక్ష్మికి తోడుగా ఉండాలి అని అంటారు.
మాధవ్ మహా చక్రిని కలపడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అది తెలుసుకోకుండా చక్రి మాత్రం ఏదో ఒకటి అంటూ అడ్డంగా బుక్ అవుతూ ఉంటాడు.. అయితే చక్రి మాత్రం ఆవిడ ఏమి చిన్న పిల్ల కాదు ప్రతిసారి ఎవరో ఒకరు వెళ్లి తీసుకుని రావడానికి తీసుకుని వెళ్లడానికి అని కావాలని ఇరుక్కొని మాట్లాడుతాడు.. అయితే చక్రీని బయటికి తీసుకుని వచ్చిన మాధవ్.. ఏంట్రా ఇలా నీ అంతటి నువ్వే అడ్డంగా ఇరుక్కున్నావ్ కదా అనేసి అంటాడు.. మీ ఇద్దరు గర వాళ్ళని నేను ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకుంటే.. నువ్వు మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నావు అని చక్రికి చెప్పగానే ఏంటో అన్నయ్య నా నెత్తిమీద అలా దరిద్రపు దేవత తాండవ మారుతుందేమో.. నా నోటి దూలతో నేనే అడ్డంగా ఇరుక్కుంటున్నాను అని బాధ పడిపోతాడు.
గాయత్రి నీ బలవంతన్న ఇంటికి తీసుకుపోయిన తాయారు.. ఏంటి నువ్వు అక్కడికి వెళ్లి ఇలా మాట్లాడుతున్నావేంటే ఇప్పుడు నీకు పెళ్లి అయ్యిందన్న విషయం నువ్వు మర్చిపోతున్నావా అని అంటుంది.. వాళ్లు కూడా నీ గురించి అలానే అనుకుని ఉంటే నీ అల్లుడికి నేను భార్యను కాకుండా పోయేదాన్ని అని తాయారు తో గాయత్రి అంటుంది.. వాళ్లు చాలా మంచి వల్లే కాకపోతే వాళ్లు ఇప్పుడున్న పరిస్థితులలో నువ్వు వెళ్లి ఏదో ఒకటి అనడం మంచిది కాదు.. అని తాయారు ఎంత చెప్పినా సరే గాయత్రి మాత్రం మొండి గానే ఉంటుంది.. వాళ్ల గురించి మాట్లాడే అధికారం నీకు లేదమ్మా అనే గాయత్రి గొడవ పడుతూ ఉండగా అప్పుడే గాయత్రి భర్త వినోద్ ఇంట్లోకి సడన్గా ఎంట్రీ ఇస్తాడు.. అసలు ఏమైంది ఎందుకు గాయత్రిని తిడుతున్నారు అని అతను అడుగుతాడు.. అయితే ఏమీ లేదు బాబు ఊరికే తన గురించి మాట్లాడుతున్నాను అని తాయారు ఏదో ఒకటి మాట్లాడుతుంది.
శైలును ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత ఎలాగైనా సరే తనని నోరు మూయించాలి అని వరాలు అనుకుంటుంది.. అయితే వరాలుకి శైలు మాటకు మాట సమాధానం చెప్పడంతో ఇంకాస్త రెచ్చిపోతుంది.. ఏమైంది ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని ఎంత చెప్తున్నా సరే.. శైలు సురేష్ పై అలాగే వరాలు పై విరుచుకుపడుతూ మాట్లాడుతుంది. దాంతో కోపంతో రగిలిపోయిన వరాలు ఆమెని ఎలాగైనా సరే ఇంట్లో పెట్టి తాళం వేయాలని అనుకుంటుంది.. దీనికి పెళ్లయ్యేంతవరకు ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా చేయాలి అని వరాలు ఇంట్లో పెట్టి గడి పెట్టేస్తుంది.. మొత్తానికి శైలుని హౌస్ అరెస్ట్ చేసేస్తారు..
మహాలక్ష్మి ఇంట్లో ఉండడం వల్లే తనకి అవమానం జరిగింది అని మాధవ్ చాలా బాధపడిపోతాడు.. అదే గుర్తు చేసుకుని మాట్లాడుతూ.. తనకోసం ఏదైనా చేయాలి అని అనుకుంటాడు. అయితే మనమందరం మీ ఇంట్లో ఉండడం వల్లే మహాలక్ష్మికి అవమానం జరుగుతుంది.. ఇంట్లో నుంచి మనం వెళ్ళిపోతే ఎటువంటి అవమానాలు జరగవు కదా అని మాధవ్ అనుకుంటాడు. ఆ మాట విన్న చక్రి మీరందరూ వెళ్ళిపోతే నన్ను చంపుకు తింటుంది దెయ్యంలాగా నన్ను పీడిస్తుంది అది ఆలోచించరా అని అంటాడు.. ఉదయం లేవగానే మాధవ్ మహాలక్ష్మితో ఈ విషయాన్ని చెప్పగానే చక్రిపై అరుస్తుంది మహా. ఇక తన తండ్రి చెప్పిన చిన్నప్పటి స్టోరీని చెప్పి అందరికీ కనువిప్పు కలిగిస్తుంది.. కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మహాలక్ష్మి చెప్తుంది.
ఇక శైలు నువ్వు కలవడానికి కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. శైలు ఎక్కడ అని వరాలు అని అడిగితే తను చేసిన పని గురించి వరాలు చెప్పి అందరికీ బుద్ధి చెప్పాలంటే దీన్ని గదిలోని పెట్టేసి పెళ్లయ్యేంతవరకు తీయకూడదు అని అనుకుంటుంది అని చెప్తుంది.. ఇక కీర్తి ఫోన్ నుంచి కేశవ కి చెప్పగానే తనకి పెళ్ళంట ఎలా ఆపాలో నాకు అర్థం కావడం లేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. అయితే మహాలక్ష్మి చక్రి మేం చూసుకుంటాము నువ్వేం టెన్షన్ పడొద్దు అని అంటారు.. అనుకున్నట్లుగానే మహాలక్ష్మి పెళ్ళికొడుకు దగ్గర శైలు గురించి నిజం చెప్తారు. కానీ అతను మాత్రం ఇంటికి వచ్చి కూర్చోవడంతో శైలు షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…